కొత్త కార్ల విడుదలతో పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. మరికొద్ది రోజుల్లో 2022 విటారా బ్రెజ్జా లాంచ్!

భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా గడచిన మే 2022 నెల విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. గత నెలలో కంపెనీ మొత్తం 1,61,413 యూనిట్ల కార్లను విక్రయించింది. కంపెనీ తాజాగా విడుదల చేస్తున్న కొత్త మోడళ్ల నేపథ్యంలో, మారుతి సుజుకి అమ్మకాలు జోరందుకున్నాయి. కంపెనీ ఇటీవలి కాలంలో బాలెనో, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 మోడళ్లలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను విడుదల చేసింది. దీంతో కంపెనీ అమ్మకాలు జోరందుకున్నాయి.

కొత్త కార్ల విడుదలతో పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. మరికొద్ది రోజుల్లో 2022 విటారా బ్రెజ్జా లాంచ్!

మే 2022 నెలలో, కంపెనీ దేశీయ విక్రయాలు 1,34,222 యూనిట్లకు పెరిగాయి, మే 2021లో ఇవి కేవలం 35,293 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. మారుతి సుజుకి గత నెలలో 27,191 యూనిట్ల విక్రయాలతో అత్యధిక నెలవారీ ఎగుమతులను నివేదించింది. గతేడాది ఇదే నెలలో ఇవి 11,262 యూనిట్లుగా మాత్రమే నమోదయ్యాయి. మొత్తమ్మీద మే 2021లో మారుతి సుజుకి కేవలం 46,555 వాహనాలను మాత్రమే విక్రయిస్తే, మే 2022 నెలలో మొత్తం 1,61,413 వాహనాలను విక్రయించింది.

కొత్త కార్ల విడుదలతో పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. మరికొద్ది రోజుల్లో 2022 విటారా బ్రెజ్జా లాంచ్!

మారుతి సుజుకి ఆల్టో మరియు ఎస్-ప్రెస్సో వంటి మినీ కార్లు గత నెలలో 17,408 యూనిట్లను విక్రయాలను నమోదు చేశాయి. గత ఏడాది ఇదే నెలలో ఇవి కేవలం 4,760 యూనిట్లుగా మాత్రమే ఉన్నాయి. అలాగే, మారుతి సుజుకి స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో మరియు డిజైర్ వంటి మోడళ్లతో కూడిన కాంపాక్ట్ విభాగంలో గత మే నెలలో మొత్తం 67,947 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే కాలంలో ఇది 20,343 యూనిట్లుగా ఉన్నాయి.

కొత్త కార్ల విడుదలతో పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. మరికొద్ది రోజుల్లో 2022 విటారా బ్రెజ్జా లాంచ్!

గత నెలలో మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా పెరిగాయి, ఇవి 586 యూనిట్లుగా ఉన్నాయి. కాగా మే 2021 నెలలో కేవలం 349 సియాజ్ కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్ మరియు ఎర్టిగాతో వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు గత నెలలో 28,051 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి 6,355 యూనిట్లుగా ఉన్నాయి. గత నెలలో మారుతి సుజుకి ఈకో వ్యాన్ విక్రయాలు 10,482 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది మేలో ఇవి 1,096 యూనిట్లుగా నమోదయ్యాయి.

కొత్త కార్ల విడుదలతో పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. మరికొద్ది రోజుల్లో 2022 విటారా బ్రెజ్జా లాంచ్!

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (FY 2023) 25 శాతం వృద్ధితో 20 లక్షల కార్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇప్పటి వరకు కంపెనీ వార్షిక ఉత్పత్తిలో ఇదే అత్యధికం. ఇందుకోసం వివిధ సెగ్మెంట్లలో కొత్త కార్లను విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, మారుతి సుజుకి ఈ ఆర్థిక సంవత్సరంలో హ్యాచ్‌బ్యాక్‌లు, క్రాస్‌ఓవర్‌లు మరియు మిడ్-సైజ్ ఎస్‌యూవీ కార్లను విడుదల చేయడం ద్వారా మార్కెట్‌లో తిరిగి పెద్ద వాటాను క్లెయిమ్ చేయాలని చూస్తోంది.

కొత్త కార్ల విడుదలతో పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. మరికొద్ది రోజుల్లో 2022 విటారా బ్రెజ్జా లాంచ్!

కొత్త మోడళ్లను లాంచ్ చేయడమే కాకుండా, దేశంలో సిఎన్‌జి కార్ల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మారుతి తమ ప్రస్తుత మోడళ్లలో మరిన్ని సిఎన్‌జి వెర్షన్లను కూడా ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. మారుతి సుజుకి FY2023 ఆర్థిక సంవత్సరానికి గాను 20.08 లక్షల కార్ల ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2022 ఆర్థిక సంవత్సరంలో తయారైన 16.50 లక్షల యూనిట్ల కంటే 26 శాతం అధికం.

కొత్త కార్ల విడుదలతో పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. మరికొద్ది రోజుల్లో 2022 విటారా బ్రెజ్జా లాంచ్!

మారుతి సుజుకి ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలంటే, కంపెనీ ప్రతి నెలా సగటున 1,74,000 వాహనాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. నివేదిక ప్రకారం, మారుతి ప్రస్తుతం 3.26 లక్షల వాహనాలకు బుకింగ్ ఆర్డర్‌లను కలిగి ఉంది, అంటే ఇది దాదాపు రెండు నెలల కంపెనీ ఉత్పత్తికి సమానం. ఉత్పత్తిలో మెరుగుదలతో మార్కెట్లో మారుతి సుజుకి వాహనాల బుకింగ్ జోరు కూడా కొనసాగుతోంది.

కొత్త కార్ల విడుదలతో పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. మరికొద్ది రోజుల్లో 2022 విటారా బ్రెజ్జా లాంచ్!

మారుతి సుజుకి అందిస్తున్న వ్యాగన్ఆర్, స్విఫ్ట్, బాలెనో మరియు విటారా బ్రెజ్జా వంటి కొన్ని బెస్ట్ సెల్లింగ్ మోడళ్ల అమ్మకాలలో మరింత వృద్ధిని కంపెనీ అంచనా వేస్తోంది. కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5,500 కోట్లకు పైగా మూలధన వ్యయం చేయవచ్చని అంచనా వేయబడింది, ఇది కొత్త సామర్థ్యం మరియు కొత్త మోడళ్ల లాంచ్‌లకు అదనంగా ఉంటుంది.

కొత్త కార్ల విడుదలతో పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. మరికొద్ది రోజుల్లో 2022 విటారా బ్రెజ్జా లాంచ్!

మారుతి సుజుకి ఎస్-క్రాస్ డిస్‌కంటిన్యూ..

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ప్రీమియం క్రాసోవర్ మోడల్ మారుతి సుజుకి ఎస్-క్రాస్ ను కంపెనీ నిలిపివేసింది. మారుతి సుజుకి తమ వెబ్‌సైట్ నుండి ఎస్-క్రాస్‌ను తొలగించడం ద్వారా ఈ మోడల్ కోసం కొత్త బుకింగ్‌లను కూడా ఆపివేసింది. మారుతి సుజుకి 2015లో ఎస్-క్రాస్ క్రాసోవర్ ను ప్రారంభించింది. అయితే ఈ మోడల్ దాని 7 సంవత్సరాల జీవిత కాలంలో కేవలం 1,65,000 యూనిట్లను మాత్రమే విక్రయించబడ్డాయి. బహుశా ఇది ఎస్-క్రాస్‌కు పూర్తి ముగింపు కాబోలు. అయితే, కంపెనీ దీని స్థానాన్ని భర్తీ చేస్తూ ఓ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

కొత్త కార్ల విడుదలతో పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. మరికొద్ది రోజుల్లో 2022 విటారా బ్రెజ్జా లాంచ్!

జూన్ 30న కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా లాంచ్

మారుతి సుజుకి నుండి దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జాలో ఓ కొత్త అప్‌డేట్ మోడల్‌ను కంపెనీ ఈ నెలలోనే మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (2022 Maruti Suzuki Brezza) ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను జూన్ 30, 2022వ తేదీన అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుత బ్రెజ్జాతో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్ బ్రెజ్జా పలు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉండనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles
https://telugu.drivespark.com/four-wheelers/2022/tata-motors-may-2022-sales-increased-186-percent-detailed-sales-report-020267.html

English summary
Maruti suzuki sales increased more than three folds in may 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X