గ్రాండ్ విటారా లాంచ్‌తో గ్రాండ్‌గా పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు వృద్ధి!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, గడచిన నెలలో తమ మిడ్-సైజ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాను విడుదల చేయడంతో కంపెనీ అమ్మకాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. సెప్టెంబర్ 2021 నెలలో మారుతి సుజుకి మొత్తం దేశీయ విక్రయాలు 68,815 యూనిట్లుగా ఉంటే, సెప్టెంబర్ 2022 నెలలో అవి ఏకంగా 1,54,903 యూనిట్లకు పెరిగి, మొత్తం హోల్‌సేల్ విక్రయాలలో రెండు రెట్లు పెరుగుదలను నమోదు చేసింది.

గ్రాండ్ విటారా లాంచ్‌తో గ్రాండ్‌గా పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు వృద్ధి!

కాగా, మినీ కార్లు అయిన ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటి మోడళ్ల విక్రయాలు గతేడాది ఇదే నెలలో 14,936 యూనిట్లుగా నమోదైతే, సెప్టెంబర్ 2022 నెలలో ఇవి 29,574 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కారణంగా అమ్మకాలు క్షీణించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ సమయంలో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో మరియు డిజైర్‌ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు 20,891 యూనిట్ల నుండి 72,176 యూనిట్లకు పెరిగాయి. మరోవైపు, మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలు సెప్టెంబర్ 2021లో 981 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 1,359 యూనిట్లకు పెరిగాయి.

గ్రాండ్ విటారా లాంచ్‌తో గ్రాండ్‌గా పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు వృద్ధి!

యుటిలిటీ వాహన విభాగం విషయానికి వస్తే, కొత్తగా అప్‌గ్రేడ్ చేయబడిన 2022 మోడల్ మారుతి సుజుకి బ్రెజ్జా, ఎస్-క్రాస్ మరియు ఎర్టిగాతో కలిపి 18,459 యూనిట్ల నుండి 32,574 యూనిట్లకు పెరిగినట్లు మారుతి సుజుకి తెలిపింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ ఎగుమతులు 17,565 యూనిట్ల నుంచి 21,403 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వాహన విభాగంలో గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకి కొన్ని వారాల క్రితమే తమ సరికొతత్ గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది.

గ్రాండ్ విటారా లాంచ్‌తో గ్రాండ్‌గా పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు వృద్ధి!

దేశీయ విపణిలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ధరలు రూ. 10.45 లక్షల నుండి రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఇది ఈ విభాగంలో రారాజులుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీగా నిలుస్తుంది. మారుతి సుజుకి సంస్థకు చాలా కాలంగా ఈ విభాగంలో ఎలాంటి మోడల్ లేదు. అయితే, కొత్త గ్రాండ్ విటారా రాకతో, కంపెనీ ఇప్పుడు మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి కూడా ప్రవేశించింది.

గ్రాండ్ విటారా లాంచ్‌తో గ్రాండ్‌గా పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు వృద్ధి!

గ్రాండ్ విటారా ఎస్‌యూవీని టొయోటా సంస్థతో కలిసి మారుతి సుజుకి అభివృద్ధి చేసింది. ఇది మైల్డ్-హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. సమాచారం ప్రకారం, మారుతి సుజుకి గ్రాండ్ విటారా కోసం ఇప్పటికే ఇప్పటికే 55,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. గత నెలలో కంపెనీ ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్ల ధరలను అధికారికంగా వెల్లడి చేసింది. నిజానికి, ఈ ఎస్‌యూవీ ధరలు తెలియకుండానే, అనేక మంది ఈ కారును బుక్ చేసుకున్నారు.

గ్రాండ్ విటారా లాంచ్‌తో గ్రాండ్‌గా పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు వృద్ధి!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మారుతి సుజుకి గ్రాండ్ విటారా 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ తో కూడా లభిస్తుంది. నిజానికి, ఇది మారుతి సుజుకి నుండి వచ్చిన రెండవ ఆల్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీ. గతంలో కంపెనీ విక్రయించిన మారుతి జిప్సీలో కూడా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉండేది. గ్రాండ్ విటారా ఇప్పుడు మారుతి సుజుకి ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలుస్తుంది. ఇప్పటి వరకూ బడ్జెట్ కార్లను విక్రయించిన మారుతి సుజుకి, ఈ ఎస్‌యూవీ లాంచ్‌తో ప్రీమియం కార్ మార్కెట్లోకి ప్రవేశించింది.

గ్రాండ్ విటారా లాంచ్‌తో గ్రాండ్‌గా పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు వృద్ధి!

మారుతి సుజుకి యొక్క ప్రీమియం డీలర్‌షిప్ కేంద్రాలయిన నెక్సా అవుట్‌లెట్ల ద్వారా మాత్రమే గ్రాండ్ విటారా హైబ్రిడ్ ఎస్‌యూవీ విక్రయించబడుతుంది. ఈ కారును కర్ణాటకలోని టొయోటా యొక్క ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. గ్రాండ్ విటారా యొక్క ఇంజన్ టొయోటా హైరైడర్‌తో పంచుకుంటుంది. ఇందులోని K15C మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 103 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తుంది. టొయోటా హైరైడర్ మాదిరిగానే, ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ మైల్డ్-హైబ్రిడ్ మాన్యువల్ వేరియంట్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

గ్రాండ్ విటారా లాంచ్‌తో గ్రాండ్‌గా పెరిగిన మారుతి సుజుకి సేల్స్.. గతేడాదితో పోలిస్తే రెట్టింపు వృద్ధి!

ఇక ఇందులోని స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఇది రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఈ వేరియంట్లలో 1.5-లీటర్, 3-సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది ఎలక్ట్రిక్ మోటార్ మరియు సెల్ఫ్ చార్జింగ్ బ్యాటరీ ప్యాక్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 79 బిహెచ్‌పి పవర్ మరియు 141 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ కలిపి, గరిష్టంగా 115 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ e-CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది మరియు ఇది లీటరుకు 27.97 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది.

Most Read Articles

English summary
Maruti suzuki sold 176306 units in september 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X