మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న పెద్ద కార్లలో ఓ కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఈ కొత్త గేర్‌బాక్స్ ఆప్షన్ ను తమ పాపలర్ విటారా బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లలో పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ కొత్త మోడళ్ల యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు ఇకపై కొత్త 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో రావచ్చని తెలుస్తోంది.

మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్!

ప్రస్తుతం, సుజుకి విదేశాలలో విక్రయిస్తున్న విటారా బ్రెజ్జాలో అందిస్తున్న 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ను ఇండియన్ మార్కెట్లోని మోడళ్లలో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ప్రస్తుతం, మనదేశంలో లభిస్తున్న మోడళ్లలో 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను ఉపయోగిస్తున్నారు. త్వరలోనే దీని స్థానాన్ని మరింత మెరుగైన 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రీప్లేస్ చేస్తుంది.

మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్!

మారుతి సుజుకి కార్లలో ఉపయోగిస్తున్న 4 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ మారుతి యొక్క పెద్ద పెట్రోల్ ఇంజన్ వాహనాలలో ఆఫర్ చేయబడుతోంది. ఇది 2003 మోడల్ గ్రాండ్ విటారా ఎక్స్ఎల్7 నుండి వాడుకలో ఉంది. వాస్తవానికి, ఇప్పటికీ ఇది గొప్ప గేర్‌బాక్స్ అయినప్పటికీ, ఇది స్పోర్ట్ మోడ్ లేదా మాన్యువల్ షిఫ్టింగ్‌ను కలిగి ఉండదు. అయితే, కొత్తగా రాబోయే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్పోర్ట్ మోడ్ లేదా మాన్యువల్ షిఫ్టింగ్‌తో వస్తుందని సమాచారం.

మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్!

అంతేకాకుండా, ఇది మెరుగైన నిష్పత్తి మరియు ఆధునిక సాంకేతికతతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని పనితీరును మెరుగ్గా ఉంటుంది మరియు క్విక్ చేంజింగ్ రెస్పాన్స్ ను కలిగి ఉంటుంది. అయితే, దీని ధర కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది, కాబట్టి భవిష్యత్తులో ఈ కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ ను కలిగిన మోడళ్ల ధరలను కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. దీనితో పాటు మైలేజీ, ఉద్గారాలు కూడా మెరుగ్గా ఉండబోతున్నాయి.

మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్!

భవిష్యత్తులో, CAFE 2 ఏప్రిల్ 2022 నుండి అమలు చేయబడుతుంది, దీని కారణంగా ఆటోమొబైల్ కంపెనీలు తమ అన్ని మోడళ్ల నుండి CO2 వినియోగాన్ని తగ్గించవలసి ఉంటుంది. ప్రస్తుతం ఇది 130g/km ఉంది, అయితే, దీనిని భవిష్యత్తులో 113g/km కి తగ్గించాల్సి ఉంటుంది. దీనిని సాధించడానికి కొత్త గేర్‌బాక్స్ కూడా కంపెనీకి సహాయం చేయనుంది. ప్రస్తుతం, మారుతి సుజుకి తమ కార్లలో మూడు రకాల ఆటో గేర్‌బాక్స్‌లను అందిస్తోంది.

మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్!

ఈ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో బాలెనోలో ఉపయోగించిన సివిటి, డిజైర్‌లో ఉపయోగించిన 5 స్పీడ్ ఏఎమ్‌టి మరియు ఆ తర్వాత అనేక మోడళ్లలో ఉపయోగిస్తున్న 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. కొత్త 2022 మోడల్ ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ ఈ ఏడాది మార్చ్ నెలలో విడుదల కావచ్చని సమాచారం. అంతేకాకుండా, ఇది కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను పొందే మొదటి మోడల్ కూడా ఇదే కానుంది. ప్రస్తుతం, కంపెనీ ఈ కారును పెద్ద 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో అందిస్తోంది.

మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్!

కాగా, ఇందులో కంపెనీ కొత్త ఆటోమేటిక్ వేరియంట్ ను పరిచయం చేయడంతో పాటుగా ఓ తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడా అందించబడుతుందని సమాచారం. అయితే ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుందని సమాచారం. అదే సమయంలో, ఈ ఏడాది జూన్‌ నెలలో కంపెనీ తమ ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో ఓ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అదే సమయంలో, దానితో పాటు కొత్త విటారా బ్రెజ్జా ను కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది.

మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్!

మారుతి సుజుకి నుండి మరిన్ని సిఎన్‌జి మోడళ్లు

డీజిల్ కార్ల తయారీ మరియు వినియోగం తగ్గిపోవడంతో, కొనుగోలుదారులు ఎక్కువగా పెట్రోల్ మరియు సిఎన్‌జి కార్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో, ఈ విభాగంలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి ఇండియా, తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు మరిన్ని కొత్త సిఎన్‌జి కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కంపెనీ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా కూడా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ తో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్!

కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్త బ్రెజ్జాను తీసుకురాబోతోంది, ఇందులో కంపెనీ ఓ సిఎన్‌జి వెర్షన్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. మారుతి సుజుకి ప్రస్తుతం చాలా హ్యాచ్‌బ్యాక్ కార్లలో సిఎన్‌జి వెర్షన్‌లను విక్రయిస్తోంది. అయితే మొదటిసారిగా, ఓ ఎస్‌యూవీ మోడల్ లో కూడా కంపెనీ కొత్త సిఎన్‌జి వెర్షన్ ను తీసుకురాబోతోంది. తమ ప్రోడక్ట్ లైనప్ లో ప్రతి మోడల్‌కు ఓ సిఎన్‌జి వెర్షన్‌ను తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలను దృష్ట్యా, సిఎన్‌జి వాహనాలను వినియోగదారులకు మెరుగైన యాజమాన్యాన్ని అందిస్తాయి.

మారుతి సుజుకి బ్రెజ్జా, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో కొత్త రకం ఆటోమేటిక్ గేర్‌బాక్స్!

ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి సిఎన్‌జి కార్లను ప్రత్యామ్నాయ ఇంధనంగా చూస్తోంది. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఈ సంవత్సరం అనేక కొత్త అప్‌డేట్‌లతో రానుంది. కంపెనీ ప్రస్తుతం ఈ మోడల్‌ను విటారా బ్రెజ్జా పేరుతో విక్రయిస్తోంది, అయితే కొత్త అప్‌డేట్‌తో రానున్న మోడల్ విటారా మోనికర్ తొలగించబడుతుందని, అది కేవలం మారుతి సుజుకి బ్రెజ్జా పేరుతో మాత్రమే విక్రయించబడుతుందని సమాచారం. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

Most Read Articles

English summary
Maruti suzuki soon to introduce new automatic gearbox in brezza ertiga xl6 facelift details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X