మారుతి సుజుకి ఎస్-క్రాస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న బాలెనో క్రాస్ (Baleno Cross)!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ లేటెస్ట్ యుటిలిటీ వెహికల్ గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) ను మార్కెట్లో విడుదల చేయడం ద్వారా దేశీయ యుటిలిటీ వాహన సెగ్మెంట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. కాగా, ఇప్పుడు క్రాసోవర్ విభాగంలో మరో కొత్త ఉత్పత్తిని తీసుకురావడం ద్వారా కొనుగోలుదారులకు మరిన్ని ఆప్షన్లను అందించాలని కంపెనీ యోచిస్తోంది. మారుతి నుండి త్వరలో డిస్‌కంటిన్యూ కానున్న ఎస్-క్రాస్ స్థానాన్ని భర్తీ చేయడానికి కంపెనీ ఓ కొత్త మోడల్‌ను తీసుకురానుంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న బాలెనో క్రాస్ (Baleno Cross)!

వివరాల్లోకి వెళితే.. మారుతి సుజుకి నుండి అత్యంత పాపులర్ అయిన ప్రీమియం క్రాసోవర్ ఎస్-క్రాస్ (నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతున్న మోడల్) స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు కంపెనీ తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఆధారంగా ఓ క్రాసోవర్ మోడల్‌ను తయారు చేయనుంది. ఈ బాలెనో క్రాస్ మోడల్‌ను ఇప్పటికే వైటిబి అనే కోడ్ నేమ్‌తో అభివృద్ది చేస్తున్నారు. ఈ మోడల్‌తో పాటుగా భారత మార్కెట్ కోసం జిమ్నీ ఆధారిత 5-డోర్ మోడల్‌ను కూడా విడుదల చేయాలని మారుతి యోచిస్తోంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న బాలెనో క్రాస్ (Baleno Cross)!

యుటిలిటీ వాహన సెగ్మెంట్లో మారుతి సుజుకి ప్లాన్స్ చేస్తుంటే, ఈ విభాగాలలో ఇప్పటికే అగ్రగాములు ఉన్న ఇతర కంపెనీలకు మారుతి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. సమాచారం ప్రకారం, మారుతి సుజుకి బాలెనో క్రాస్ మరియు మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ మోడళ్లను కంపెనీ వచ్చే ఏడాది ఢిల్లీలో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం ఉంది. బాలెనో క్రాస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ దాని అధికారిక ఆవిష్కరణ అనంతరం ఒక నెల తర్వాత షోరూమ్‌లను తాకుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న బాలెనో క్రాస్ (Baleno Cross)!

అంటే, మారుతి సుజుకి తమ బాలెనో క్రాస్ ని జనవరి 2023లో ఆవిష్కరిస్తే, దాని అమ్మకాలు ఫిబ్రవరి 2023లో ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. సుజుకి యొక్క గ్లోబల్ సి ప్లాట్‌ఫారమ్‌కు ఆధారమైన మారుతి సుజుకి గ్రాండ్ విటారా మాదిరిగా కాకుండా, మారుతి బాలెనో క్రాస్ కంపెనీ యొక్క ప్రస్తుత హార్ట్‌టెక్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించబడుతుందని సమాచారం. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో బ్రాండ్ యొక్క బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కంపెనీ తిరిగి పరిచయం చేయవచ్చని భావిస్తున్నారు. ఈ ఇంజన్ ఇప్పుడు కొత్త BS6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న బాలెనో క్రాస్ (Baleno Cross)!

అంతేకాకుండా, ఇది తేలికపాటి (మైల్డ్) హైబ్రిడ్ సాంకేతికతను కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది.

కొత్త మారుతి వైటిబి (బాలెనో క్రాస్) లో 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ డ్యూయెల్ జెట్ ఇంజన్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్ ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో శక్తివంతమైన వేరియంట్ కోరుకునే వారి కోసం 103 బిహెచ్‌పి శక్తిని అందించే 1.5 లీటర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. గేర్‌బాక్స్ ఆప్షన్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు లేటెస్ట్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న బాలెనో క్రాస్ (Baleno Cross)!

మారుతి సుజుకి ఎస్-క్రాస్ మాదిరిగానే కొత్తగా రాబోయే బాలెనో క్రాస్ కూడా ప్రీమియం ఉత్పత్తి అయినందున ఇది కూడా నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా మాత్రమే విక్రయించబడే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ క్రాసోవర్ ధరలు రూ.8 లక్షల నుండి రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న బాలెనో క్రాస్ (Baleno Cross)!

మారుతి సుజుకి గ్రాండ్ విటారా విషయానికి వస్తే, కంపెనీ ఈ కారు లాంచ్‌తో అత్యంత పోటీతో కూడుకున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి ప్రవేశించింది. ఇది కంపెనీ నుండి వచ్చిన మొట్టమొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ కారు మరియు అనేక ఆధునిక ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం, మార్కెట్లో మైల్డ్ హైబ్రిడ్ గ్రాండ్ విటారా ధరలు రూ. 10.45 లక్షల నుండి రూ. 16.89 లక్షల మధ్యలో ఉండగా, స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ల ధరలు రూ. 17.99 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్).

మారుతి సుజుకి ఎస్-క్రాస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న బాలెనో క్రాస్ (Baleno Cross)!

గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రిడ్ వేరియంట్ 1.5-లీటర్, 4-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌‌తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 101 బిహెచ్‌పి శక్తిని మరియు 136 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. అయితే, ఈ కారులోని ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్‌ మాత్రం కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులోని మాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 21.11 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

మారుతి సుజుకి ఎస్-క్రాస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వస్తున్న బాలెనో క్రాస్ (Baleno Cross)!

కాగా, గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ 1.5-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, అట్కిన్సన్ సైకిల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 114.5 బిహెచ్‌పి శక్తిని మరియు 122 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లో కూడా ఇదే పవర్‌ట్రైన్ ఉంటుంది. ఇది లీటరు పెట్రోలుకు గరిష్టంగా 27.9 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

Most Read Articles

English summary
Maruti suzuki to launch baleno based crossover next year deatils
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X