జీవ ఇంధనం (Biofuel) తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టిన మారుతి సుజుకి

భూమిలో శిలాజ ఇంధనాలు అంతరించిపోతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమోటివ్ తయారీదారులు ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

అనేక దేశాలలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగం పెరగగా, మరోవైపు వాహన తయారీదారులు హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ పవర్డ్ వాహనాల తయారీపై కూడా వేగంగా అడుగులు వేస్తున్నారు.

జీవ ఇంధనం (Biofuel) తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టిన మారుతి సుజుకి

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) కూడా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు పరుగులు తీస్తోంది. ప్రస్తుతం, కేవలం పెట్రోల్ తో నడిచే వాహనాలను మాత్రమే అందిస్తున్న మారుతి సుజుకి, భవిష్యత్తులో బయో ఫ్యూయల్‌ తో నడిచే వాహనాలను తయారు చేయాలని చూస్తోంది.

జీవ ఇంధనం (Biofuel) తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టిన మారుతి సుజుకి

మారుతి సుజుకి తమ కార్లకు శక్తినివ్వడానికి బయో ఫ్యూయల్‌ని ఉపయోగించాలని యోచిస్తోంది. మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్, ఆర్‌సి భార్గవ మాట్లాడుతూ భారతదేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ జీవ ఇంధనంతో నడిచే కార్లను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. బయోమీథేన్ వాడకం ద్వారా ఉద్గారాలను తగ్గించడంతో పాటు సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని ఆయన చెప్పారు.

జీవ ఇంధనం (Biofuel) తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టిన మారుతి సుజుకి

మారుతి సుజుకి భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో ప్రతినెలా అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 కార్లలో ఆరు లేదా ఏడు మోడళ్లు మారుతి సుజుకికి చెందినవే ఉంటాయి. మారుతి సుజుకి కార్లు అందించే అన్ని వాహనాలు దాదాపు అధిక మైలేజీనిస్తుంటాయి మరియు అవి చాలా విశ్వసనీయంగా ఉంటాయి. కాగా, ఇప్పుడు మారుతి పర్యావరణ సాన్నిహిత్యమైన వాహనాల తయారీపై దృష్టి పెట్టింది.

జీవ ఇంధనం (Biofuel) తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టిన మారుతి సుజుకి

ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఆటోమొబైల్ తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటే, మారుతి సుజుకి మాత్రం ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాలు) ప్రస్తుతం భారతీయ మార్కెట్‌కు అవసరం లేదని నమ్ముతోంది. చాలా కాలంగా, మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల కంటే హైబ్రిడ్ టెక్నాలజీ, జీవ ఇంధనం మరియు సహజ వాయువు (న్యాచురల్ గ్యాస్)లు మరింత ఆచరణీయమైన మరియు ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలు అని కంపెనీ నమ్ముతోంది.

జీవ ఇంధనం (Biofuel) తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టిన మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇప్పటికే భారతదేశంలో తమ ప్రోడక్ట్ లైనప్ లో అత్యధికంగా సిఎన్‌జి (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్) ఆధారిత వాహనాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం, భారతదేశంలో అత్యధికంగా సిఎన్‌జి వాహనాలను విక్రయిస్తున్న కంపెనీ కూడా మారుతి సుజుకినే కావడం మరో విశేషం. మారుతి సుజుకి ఇటీవలే టొయోటా సహకారంతో తయారు చేసిన తమ మొట్టమొదటి హైబ్రిడ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారాను కూడా మార్కెట్లో విడుదల చేసింది. కాగా, ఇప్పుడు జీవ ఇంధనంతో నడిచే వాహనాలను తయారు చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.

జీవ ఇంధనం (Biofuel) తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టిన మారుతి సుజుకి

జీవ ఇంధనంతో నడిచే మారుతి సుజుకి కార్లు ఖచ్చితంగా అభివృద్ధిలో ఉన్నాయని కంపెనీ ఛైర్మన్ ఆర్‌సి భార్గవ ధృవీకరించారు. గాంధీనగర్‌లో జరిగిన మారుతి సుజుకి యొక్క 40వ వార్షికోత్సవ వేడుకలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జీవ ఇంధనంతో నడిచే మారుతి సుజుకి కార్ల రాకను ప్రస్తావించారు, అదే సమయంలో భారతదేశ వృద్ధిలో ఈ బ్రాండ్ యొక్క సహకారాన్ని కూడా ప్రశంసించారు.

జీవ ఇంధనం (Biofuel) తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టిన మారుతి సుజుకి

మారుతి సుజుకి ఈ విభాగాన్ని (బయో-ఫ్యూయెల్) తక్షణమే పరిశీలిస్తోంది, ఎందుకంటే ఇది ఇంధన వనరుగా దేశానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉండటమే కాకుండా, ఇది పునరుత్పాదకమైనది మరియు చాలా పరిశుభ్రమైనదిగా కూడా ఉంటుంది. మారుతి సుజుకి బయోమీథేన్‌ను స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుగా ఉపయోగించడాన్ని పరిశీలిస్తోంది. బయోమీథేన్ శక్తితో కూడిన ఇంధనం, మారుతి సుజుకి ఇంజనీర్‌లు ఇప్పటికే ఉన్న ఇంజన్‌ల నుండి మరింత పనితీరు మరియు సామర్థ్యాన్ని గ్రహిచేందుకు అనుమతిస్తుంది.

జీవ ఇంధనం (Biofuel) తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టిన మారుతి సుజుకి

అలాగని మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తిగా విస్మరించడం లేదు. ఓవైపు మారుతి సుజుకి కూడా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తూనే ఉంది. అయితే, కంపెనీ ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాలు అధిక ధరను కలిగి ఉండి, ప్రస్తుతం తాము అందిస్తున్న చిన్న కార్ల ధరల రేంజ్ లో ఏమాత్రం అందుబాటులో ఉండవు. కాబటే, ఈ విభాగంలో సిఎన్‌జజి మరియు జీవ ఇంధనంతో నడిచే వాహనాలు వీటికి చక్కటి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయి.

జీవ ఇంధనం (Biofuel) తో నడిచే వాహనాల తయారీపై దృష్టి పెట్టిన మారుతి సుజుకి

సంవత్సరాలుగా, మారుతి సుజుకి 'ఆకుపచ్చగా ఆలోచించడం' (పర్యావరణం గురించి ఆలోచించడం) లేదని పలువురు విమర్శించారు. అయితే, మారుతి సుజుకి ఆచరణాత్మక పద్ధతిలో గోగ్రీన్ గురించి ఆలోచిస్తోంది. డీజిల్ ఇంజన్ల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసిన ఏకైక మెయిన్‌స్ట్రీమ్ తయారీదారు మారుతి సుజుకి. ఈ బ్రాండ్ ఇప్పుడు సిఎన్‌జి-ఆధారిత కార్ల విస్తృత శ్రేణిని కలిగి ఉంది. ఇప్పుడు, ఈ బ్రాండ్ బయోఫ్యూయల్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలపై తయారీపై కూడా పని చేస్తోంది. ఇది మారుతీ సుజుకిని భారతీయ మార్కెట్లో అత్యంత పచ్చని తయారీదారులలో ఒకటిగా చేసింది.

Most Read Articles

English summary
Maruti suzuki working on biofuel powered cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X