కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (XL6 Facelift) విడుదల.. 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైమ్..!

భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki), దేశీయ మార్కెట్లో తమ నెక్సా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ఎమ్‌పివి ఎక్స్ఎల్6 (XL6) లో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ని నేడు (ఏప్రిల్ 21, 2022) విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ కొత్త 2022 మోడల్ మారుతి ఎక్స్ఎల్6 ధరలు రూ.11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.14.55 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది. కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 జెటా, ఆల్ఫా మరియు ఆల్ఫా ప్లస్ అనే మూడు ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (XL6 Facelift) విడుదల.. 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైమ్..!

2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ధరలు ఇలా ఉన్నాయి

Maruti XL6

Manual Automatic
Zeta ₹11,29,000 ₹12,79,000
Alpha ₹12,29,000 ₹13,79,000
Alpha+ ₹12,89,000 ₹14,39,000
Alpha+ Dual Tone ₹13,05,000 ₹14,55,000

2019 తర్వాత ఇదే మొదటి ఫేస్‌లిఫ్ట్

మారుతి సుజుకి గడచిన 2019లో తొలిసారిగా ఎక్స్ఎల్6 (Maruti Suzuki XL6) ఎమ్‌పివిని మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఈ మోడల్‌లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఈ కారును మార్కెట్లో విడుదల చేసిన మొదటి సంవత్సరంలోనే కంపెనీ 25,000 యూనిట్లకు పైగా ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలను విక్రయించింది. మారుతి సుజుకి తమ అరేనా డీలర్‌షిప్ కేంద్రాల ద్వారా విక్రయిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివిని ఆధారంగా చేసుకొని ఎక్స్ఎల్6 ఎమ్‌పివిని తయారు చేసింది. కాగా, ఈ ఫేస్‌లిఫ్ట్ 2022 వెర్షన్ ఎక్స్ఎల్6 ఇప్పుడు రిఫ్రెష్డ్ డిజైన్ మరియు కొత్త ఫీచర్లతో పాటుగా కొత్త ఇంజన్, గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (XL6 Facelift) విడుదల.. 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైమ్..!

ఈ కారులో కొత్తగా ఏం మార్పులు చేశారు?

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్ కారులో పెద్దగా చెప్పుకోదగిన ఎక్స్టీరియర్ మార్పులు ఏమీ లేవు, ఇందులో ప్రధానమైన మార్పులన్నీ ఇంటీరియర్లలో చేయబడ్డాయి. అయితే, ఎక్స్టీరియర్స్‌లో ఇప్పుడు క్రోమ్ గార్నిష్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, కొత్త 16 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు కొత్త కలర్ ఆప్షన్స్ వంటి చిన్నపాటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.సైడ్ ప్రొఫైల్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. కంపెనీ ఈ రిఫ్రెష్డ్ ఎమ్‌పివిని సెలెస్టియల్ బ్లూ, బ్రేవ్ ఖాకీ, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, ఓపులెంట్ రెడ్ మరియు స్ప్లెండిడ్ సిల్వర్ అనే కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (XL6 Facelift) విడుదల.. 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైమ్..!

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు వెంటిలేటెడ్ ఫ్రంట్ డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ సీట్లతో లభిస్తుంది. మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన 2022 బాలెనో మాదిరిగానే, కొత్త మారుతి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ కూడా నావిగేషన్, స్పీడ్, ఇంజన్ ఆర్‌పిఎమ్ వంటి వివరాలను విండ్‌షీల్డ్‌పై ప్రదర్శించే కొత్త హెడ్స్-అప్ డిస్ప్లేని పొందుతుంది. ఇంకా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ మరియు అంతర్నిర్మిత సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్‌తో కూడిన కొత్త 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే కూడా ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (XL6 Facelift) విడుదల.. 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైమ్..!

లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లు

సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్‌తో కూడిన కొత్త 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో అనేక రకాల స్మార్ట్ ఫీచర్లకు యాక్సెస్ కల్పిస్తుంది. బాలెనో ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఆఫర్ చేసిన సుజుకి కనెక్టెడ్-కార్ టెక్నాలజీలో భాగంగా అందించిన లొకేషన్‌ను ట్రాకింగ్, రిమోట్ కార్ లాక్ అన్‌లాక్, రిమోట్ హజార్డ్ లైట్స్ ఆన్/ఆఫ్ వంటి ఫీచర్లను కొత్త 2022 ఎక్స్ఎల్6 లో కూడా అందిస్తోంది. వాహన యజమానులు ఈ ఫీచర్లన్నింటినీ తమ స్మార్ట్‌ఫోన్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు. ఇందులో 'హే సుజుకి' అనే వేకప్ కమాండ్‌తో యాక్టివేట్ చేయదగిన వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (XL6 Facelift) విడుదల.. 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైమ్..!

కొత్త ఇంజన్

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఫేస్‌లిఫ్ట్ ఎమ్‌పివిలో ప్రధానమైన మార్పు దాని ఇంజన్ రూపంలో ఉంటుంది. కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగాలో ఉపయోగించిన అదే అప్‌డేటెడ్ 1.5 లీటర్ కె15సి పెట్రోల్ ఇంజన్‌ను ఈ కొత్త 2022 ఎక్స్ఎల్6 ఎమ్‌పివిలో కూడా ఉపయోగించారు. ఇందులోని 1.5-లీటర్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పి పవర్‌ను మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (XL6 Facelift) విడుదల.. 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైమ్..!

కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్స్

ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కారులో ఇదివరకటి స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌‌ను ఈ కొత్త మోడల్‌లో కూడా అలానే కొనసాగించారు. కాకపోతే, మునుపటి మోడళ్లలో అందించిన 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన 6-స్పీడ్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పరిచయం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఆటోమేటిక్ కారులో ప్యాడిల్ షిఫ్టర్‌లు కూడా ఉంటాయి. ఇవి ఆటోమేటిక్ కారును నడిపే అనుభవాన్ని మరింత సరదాగా మార్చుతాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (XL6 Facelift) విడుదల.. 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైమ్..!

మరిన్ని అదనపు సేఫ్టీ ఫీచర్లు

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఎమ్‌పివిని కంపెనీ అదనపు సేఫ్టీ ఫీచర్లతో అందిస్తోంది. ఇందులో ఫస్ట్-ఇన్ సెగ్మెంట్ ఫీచర్‌గా 360-డిగ్రీ కెమెరా, అన్ని వేరియంట్లలో రెండు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు (టాప్-ఎండ్ వేరియంట్లలో ఎక్కువ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (టిఎమ్ఎస్), హిల్ హోల్డ్ అసిస్ట్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్లు యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 (XL6 Facelift) విడుదల.. 2019 తర్వాత ఇదే ఫస్ట్ టైమ్..!

బుకింగ్స్ మరియు కాంపిటీషన్

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఈ విభాగంలో కొత్తగా వచ్చిన కియా కారెన్స్ మరియు మహీంద్రా మరాజో వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. కొత్త 2020 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 కోసం కంపెనీ డీలర్లు ఇప్పటికే బుకింగ్ లను స్వీకరించడం కూడా ప్రారంభించారు. ఆసక్తిగల కస్టమర్లు మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌ల నుండి రూ. 11,000 బుకింగ్ అడ్వాన్స్ చెల్లించి ఈ కారుని బుక్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Maruti suzuki xl6 facelift launched with new features price specs and updates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X