టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఈ మే 2022 నెలలో భాగంగా, తమ కార్ల శ్రేణిపై రూ. 45,000 వరకు తగ్గింపును అందిస్తోంది. కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ ను బట్టి ఈ డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి. టాటా కార్లపై మే నెల ఆఫర్లలో భాగంగా నగదు ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు కార్పోరేట్ డిస్కౌంట్‌లు లభిస్తున్నాయి. మరి ఈ నెలలో ఏయే మోడల్ పై కంపెనీ ఎలాంటి ఆఫర్లను అందిస్తుందో ఈ కథనంలో చూద్దాం రండి.

టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

టాటా టియాగో పై రూ.23,000 వరకు ఆదా

టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో పై కంపెనీ మే 2022 లో రూ. 23,000 విలువైన నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో XZ మరియు ఆపై వేరియంట్ లపై రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 విలువైన కార్పొరేట్ తగ్గింపులను కంపెనీ అందిస్తోంది. కాగా, ఇందులో XE, XM మరియు XT వేరియంట్‌లపై మాత్రం ఎలాంటి నగదు తగ్గింపు అందించబడదు. అయితే, ఈ వేరియంట్లపై రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.3000 కార్పోరేట్ డిస్కౌంట్ మాత్రం లభిస్తుంది. కాగా, టియాగో NRG వేరియంట్ మరియు CNG మోడళ్లపై ఎటువంటి తగ్గింపులను అందించడం లేదు.

టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

టాటా టియాగో పెట్రోల్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో, మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌లో కంపెనీ ఎన్ఆర్‌జి అనే స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను కూడా విక్రయిస్తోంది. దేశీయ విపణిలో టాటా టియాగో ధరలు రూ. 5.22 లక్షల నుండి ప్రారంభమై రూ. 7.67 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకూ ఉన్నాయి. టాటా టియాగో ఎన్‌ఆర్‌జి విషయానికి వస్తే, ఇది పెట్రోల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.6.66 లక్షలు మరియు రూ.7.21 లక్షలుగా ఉన్నాయి.

టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

టాటా టిగోర్ పై రూ. 23,000 వరకు ఆదా

టియాగో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపుదిద్దుకున్న టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ పై కూడా కంపెనీ ఈ మే నెలలో రూ. 23,000 విలువైన నగదు ప్రయోజనాలను అందిస్తోంది. టాటా టిగోర్ సెడాన్ యొక్క XZ మరియు ఆపై వేరియంట్‌ల కోసం కంపెనీ రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 విలువైన కార్పొరేట్ తగ్గింపులను అందిస్తోంది. టియాగో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే, టిగోర్ యొక్క XE, XM మరియు XT లకు క్యాష్ డిస్కౌంట్ లభించదు, వాటిపై రూ. 13,000 ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి. టిగోర్ సెడాన్ సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ తో కూడా లభిస్తుంది, ఈ సిఎన్‌జి మోడళ్లపై కూడా ఎలాంటి తగ్గింపులు అందించబడవు.

టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

టాటా టియాగో మరియు టిగోర్ మోడళ్లలో ఒకే రకమైన పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఉపయోగించిన 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 86 పిఎస్ శక్తిని మరియు 3300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. టాటా టిగోర్ ఇప్పుడు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో కూడా లభిస్తుంది. కంపెనీ ఈ టెక్నాలజీ ఐసిఎన్‌జి (iCNG) పేరుతో పిలుస్తుంది.

టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

టాటా నెక్సాన్ పై రూ. 20,000 వరకు ఆదా

ప్రస్తుతం, భారత మార్కెట్లో లభిస్తున్న అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ కూడా ఒకటి. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా ప్యూర్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. కాగా, ఈ నెలలో పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్‌ నెక్సాన్ పై కంపెనీ రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో కార్పోరేట్ డిస్కౌంట్ మరియు ఎక్సేంజ్ బోనస్ లు రెండూ కలిసి ఉన్నాయి.

టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

టాటా నెక్సాన్ రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఒక పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్‌ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి మరియు 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇందులోని 1.5-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. టాటా నెక్సాన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 6 స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

టాటా హారియర్ పై రూ. 45,000 వరకు ఆదా

టాటా మోటార్స్ అందిస్తున్న 5-సీటర్ ఎస్‌యూవీ టాటా హారియర్ పై కంపెనీ మే 2022 నెలలో రూ. 45,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. ఇందులో రూ. 40,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ.5,000 కార్పొరేట్ సేవింగ్స్ కలిసి ఉన్నాయి. టాటా హారియర్ (Tata Harrier) మిడ్-సైజ్ ఎస్‌యూవీలో కంపెనీ ఇటీవలే రెండు కొత్త కలర్ ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టింది. హారియర్ ఇప్పుడు రాయల్ బ్లూ (Royal Blue) మరియు ట్రాపికల్ మిస్ట్ (Tropical Mist) అనే రెండు కొత్త ఎక్స్టీరియర్ కలర్లలో లభిస్తుంది.

టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

భారత మార్కెట్లో టాటా హారియర్ ధరలు రూ.14.64 లక్షల నుండి రూ.21.94 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ ఎస్‌యూవీ కేవలం ఒకే క డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో శక్తివంతమైన 2.0 లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ క్రయోటెక్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 3,750 ఆర్‌పిఎమ్ వద్ద 167.67 బిహెచ్‌పి శక్తిని మరియు 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 350 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

టాటా సఫారీ పై రూ. 40,000 వరకు ఆదా

టాటా హారియర్ ఎస్‌యూవీ ఆధారంగా తయారైన 7-సీటర్ ఎస్‌యూవీ టాటా సఫారీ పై కంపెనీ ఈ మే 2022 నెలలో రూ. 40,000 విలువైన నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ఇది కేవలం ఎక్సేంజ్ బోనస్ మాత్రమే. సఫారీ కూడా హారియర్ మాదిరిగానే అదే 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌ తో లభిస్తుంది. ఈ ఇంజన్ 170 బిహెచ్‌పి పవర్ ను మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో లేదు.

టాటా కార్లపై మే 2022 ఆఫర్స్.. రూ.45,000 వరకూ బెనిఫిట్స్.. ఏయే మోడల్‌పై ఎంతంటే..?

టాటా సఫారీలో లభించే ఫీచర్స్ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో వెంటిలేటెడ్ సీట్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో కూడిన 8.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పానోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ ఏసి, పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి మరెన్నో ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

English summary
May 2022 offers and discounts on tata cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X