దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ EQS 580.. ఒక్క ఛార్జ్‌తో 857 కిమీ రేంజ్

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) భారతీయ మార్కెట్లో తన 'ఈక్యూఎస్ 580 4మ్యాటిక్' (EQS 580 4Matic) అనే కొత్త ఎలక్ట్రిక్ కార్ విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ. 1.55 కోట్లు (ఎక్స్-షోరూమ్). దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ EQS 580.. ఒక్క ఛార్జ్‌తో 857 కిమీ రేంజ్

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మ్యాటిక్' అనేది స్థానికంగా తయారుచేయబడిన మొట్ట మొదటి బ్రాండ్ మోడల్. కావున ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు రూ. 25 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ EQS 580.. ఒక్క ఛార్జ్‌తో 857 కిమీ రేంజ్

కొత్త మెర్సిడెస్ బెంజ్ EQS 580 4మ్యాటిక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క ఫ్రంట్ బంపర్‌లు ఇప్పుడు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉన్నాయి. ఇందులో బ్లాంక్డ్-అవుట్ గ్రిల్ మధ్యలో బ్రాండ్ లోగో వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 5 స్పోక్ డిజైన్ కలిగి 20 ఇంచెస్ వీల్స్ పొందుతాయి.

దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ EQS 580.. ఒక్క ఛార్జ్‌తో 857 కిమీ రేంజ్

మెర్సిడెస్ బెంజ్ EQS 580 4మ్యాటిక్ పొడవు 5,126 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది దాని S-క్లాస్ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే వీల్‌బేస్‌ దాదాపు సమానంగా ఉంటుంది. మొత్తం మీద ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు చాలా అద్భుతమైన డిజైన్ పొందుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ EQS 580.. ఒక్క ఛార్జ్‌తో 857 కిమీ రేంజ్

మెర్సిడెస్ బెంజ్ EQS 580 4మ్యాటిక్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంటీరియర్ అపోల్స్ట్రే ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో మూడు స్క్రీన్స్ చూడవచ్చు. ఇందులో కూడా డ్రైవర్ మరియు ప్యాసింజర్ ముందు ఉన్న స్క్రీన్స్ ఒక్కొక్కటి 12.3 ఇంచెస్ ఉంటుంది. అయితే మధ్యలో 17.7 ఇంచెస్ ఉంటుంది. ఇది టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.

దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ EQS 580.. ఒక్క ఛార్జ్‌తో 857 కిమీ రేంజ్

ఇందులో హెడ్స్-అప్ డిస్‌ప్లే, ముందు ప్రయాణికుల కోసం మసాజ్ ఫంక్షన్ సీట్లు, బర్మెస్టర్ 3D సౌండ్ సిస్టమ్, ఎయిర్ ఫిల్ట్రేషన్ మరియు వెనుక ఉండే ప్యాసింజర్ల కోసం MBUX టాబ్లెట్‌ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద ఇది చాలా అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ EQS 580.. ఒక్క ఛార్జ్‌తో 857 కిమీ రేంజ్

ఇప్పుడు Mercedes-Benz EQS 580 యొక్క బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్ వంటి విషయాలను పరిశీలిస్తే, ఇందులో 107.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది రెండు ఎలక్ట్రిక్ మోటారులకు పవర్ డెలివరీ చేస్తుంది. మొత్తమ్ మీద ఇది 523 హెచ్‌పి పవర్ మరియు 855 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిమీ వరకు ఉంటుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ EQS 580.. ఒక్క ఛార్జ్‌తో 857 కిమీ రేంజ్

Mercedes-Benz EQS 580 లగ్జరీ కారు ఒక ఫుల్ ఛార్జ్ తో 857 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. ఛార్జింగ్ విషయానికి వస్తే, ఈ బ్యాటరీ ప్యాక్ 200 కిలోవాట్ DC ఫాస్ట్ ఛార్జింగ్‌ సాయంతో కేవలం 15 నిమిషాల్లో 300 కిమీ వెళ్ళడానికి కావాల్సిన ఛార్జింగ్ పొందుతుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ EQS 580.. ఒక్క ఛార్జ్‌తో 857 కిమీ రేంజ్

ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇందులో ఉన్న భద్రతా ఫీచర్స్, ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా లేన్ కీప్ అసిస్ట్ మరియు ఎమర్జెన్సీ స్టాప్ సిస్టమ్‌ వంటి ఆధునిక ఫీచర్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ కారు సేఫ్టీ విషయంలో యూరో NCAP క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొందింది. కావున భద్రతకు ఏ మాత్రం కొదువ లేదు.

దేశీయ మార్కెట్లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ EQS 580.. ఒక్క ఛార్జ్‌తో 857 కిమీ రేంజ్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ ఆధునిక ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది కొనుగోలుదారులను ఆకర్శించే అవకాశం ఉంది. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో ఆడి ఈ-ట్రాన్ జిటి, పోర్స్చే టైకాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mercedes eqs 580 launched at rs 1 55 crore specs features and range details
Story first published: Friday, September 30, 2022, 15:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X