భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ GLB: ధర & వివరాలు ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన GLB లగ్జరీ ఎస్‌యువిని విడుదల చేసింది. ఈ ఎస్‌యువి మొత్తమ్ మూడు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. అంతే కాకూండా ఇది కంపెనీ యొక్క రెండవ 7-సీటర్. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి (Mercedes Benz GLB) మొత్తం మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. అవి GLB 200 ప్రోగ్రెసివ్ లైన్, GLB 220డి ప్రోగ్రెసివ్ లైన్ మరియు GLB 220డి 4మ్యాటిక్ AMG లైన్. వీరి ధరలు వరుసగా రూ. 63.80 లక్షలు, రూ. 66.80 లక్షలు మరియు 69.80 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ GLB

కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి డిజైన్ విషయానికి వస్తే, ఇది దాదాపు జిఎల్ఎస్ మోడల్ మాదిరిగా కనిపిస్తుంది. దీని గ్రిల్‌కు ఇరువైపులా ఇంటిగ్రేటెడ్ LED DRL లతో ఇన్‌సెట్ హెడ్‌లైట్లు ఉంటాయి. ముందు బంపర్‌పై రెండు వైపులా ఎయిర్ ఇన్‌టేక్‌లతో పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్ కూడా చూడవచ్చు. ఫ్లాట్ బానెట్, స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లు మరియు సెగ్మెంటెడ్ రియర్ టెయిల్ ల్యాంప్‌ వంటివి కూడా ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఉన్నాయి. అంతే కాకూండా టర్బైన్ స్టైల్ ఎయిర్ వెంట్స్, దిగువ భాగంలో హీటింగ్, వెంటిలేషన్ మరియు ఎయిర్ కండిషన్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అందుబాటులో ఉంటుంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్స్ మొదలైనవి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ GLB

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి అనేది 7 సీటర్ మోడల్ కావున క్యాబిన్ స్పేస్ చాలా పెద్దదిగా ఉంటుంది. మూడవ వరుసలో కూడా స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ SUV లో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 'Hey Mercedes' వాయిస్ ప్రాంప్ట్, వైర్‌లెస్ ఛార్జర్, ఇన్-బిల్ట్ నావిగేషన్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్ మరియు పార్కింగ్ అసిస్ట్ మొదలైనవి ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి 200 వేరియంట్ 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 161 బిహెచ్‌పి పవర్ మరియు 1,620 - 4,000 ఆర్‌పిఎమ్ మధ్య 250 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ముందు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ SUV కేవలం 9.1 సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 207 కిలోమీటర్లు.

ఇక GLB 220D & GLB 220D 4M వేరియంట్లు డీజిల్ ఇంజిన్ పొందుతాయి. కావున ఇందులో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఫోర్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 3,800 ఆర్‌పిఎమ్ వద్ద 188 బిహెచ్‌పి మరియు 1,600-2.400 ఆర్‌పిఎమ్ మధ్య 400 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇవి రెండూ కూడా 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడ్డాయి. ఇది 7.6 సెకన్లలో 0-100km/h వరకు వేగవంతం అవుతుంది, కాగా టాప్ స్పీడ్ గంటకు 217 కిమీ.

సేఫ్టీ పరంగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌బి మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్ మొదలైనవి పొందుతుంది. అంతే కాకూండా బూట్ స్పేస్ 130 లీటర్ల వరకు ఉంటుంది, కానీ మూడవ వరుస సీట్లను ఫోల్డ్ చేయడం ద్వారా బూట్ స్పేస్ 500 లీటర్ల వరకు పెరుగుతుంది. ఈ లగ్జరీ SUV దేశీయ మార్కెట్లో ఆడి క్యూ7 మరియు ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Mercedes glb launched in india price features details
Story first published: Friday, December 2, 2022, 15:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X