అసలే ఖరీదైన కారు, ఆపై ఖరీదైన కస్టమైజేషన్ ప్యాక్.. మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ మాన్సోరీ

అసలే ఖరీదైన కారు, ఆపై ఖరీదైన కస్టమైజేషన్ ప్యాక్.. ఈ రెండింటి కలయికతో వచ్చే కారు ఎలా ఉంటుందో మీరు కూడా ఓ లుక్కేయండి. జర్మన్ ట్యూనింగ్ హౌస్ మాన్సోరీ మెర్సిడెస్-మేబాక్ ఎస్-క్లాస్ కోసం తమ కస్టమైజేషన్ ప్యాకేజీని వెల్లడించింది. మాన్సోరీ ద్వారా కస్టమైజ్ చేయబడిన మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ (Mercedes Maybach S-Class by Mansory) కస్టమైజేషన్ ప్యాకేజీలో కార్బన్-ఫైబర్ బాడీ పార్ట్స్, 3D లెదర్ ఎంబోసింగ్‌తో కూడిన పూర్తి లెదర్ ఇంటీరియర్ ఆప్షన్, కొత్త కస్టమ్ వీల్స్ మరియు మేబాక్ ఎస్-క్లాస్ మోడల్‌లకు పవర్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.

అసలే ఖరీదైన కారు, ఆపై ఖరీదైన కస్టమైజేషన్ ప్యాక్.. మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ మాన్సోరీ

మాన్సోరీ మెర్సిడెస్-మేబ్యాక్ S-క్లాస్ - పవర్ అప్‌గ్రేడ్

మెర్సిడెస్ S580 మరియు S680 మోడళ్లకు పవర్ అప్‌గ్రేడ్ లో భాగంగా మాన్సోరీ పెర్ఫార్మెన్స్ పవర్‌బాక్స్ అని పిలువబడే మోడిఫైడ్ 4.0-లీటర్ ట్విన్-టర్బో వి8 మరియు 6.0-లీటర్ బైటర్బో వి12 ఇంజన్ ‌లను ఉపయోగించారు. ఇందులో పవర్ అవుట్‌పుట్‌ను పెంచే నాలుగు పైప్ లతో కూడిన స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ ఉంటుంది, ఇది రెండు మోడళ్లకు శక్తినిస్తుంది.

అసలే ఖరీదైన కారు, ఆపై ఖరీదైన కస్టమైజేషన్ ప్యాక్.. మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ మాన్సోరీ

మెర్సిడెస్ S580 యొక్క వి8 ఇంజన్ యొక్క అవుట్‌పుట్ అధికంగా 96bhp మరియు 120Nm కి పెంచబడింది, తద్వారా ఈ ఇంజన్ ఇప్పుడు 592bhp పవర్ మరియు 820Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ S580లోని మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కారణంగా అదనంగా మరో 20bhp పవర్ మరియు 180Nm టార్క్‌ లభిస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ ద్వారా వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు పంపిణీ చేయబడుతుంది.

అసలే ఖరీదైన కారు, ఆపై ఖరీదైన కస్టమైజేషన్ ప్యాక్.. మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ మాన్సోరీ

అదేవిధంగా, మాన్సోరీ అప్‌గ్రేడ్‌ ల కారణంగా మెర్సిడెస్ S680 యొక్క గరిష్ట పవర్ అవుట్‌పుట్ 106bhp మరియు టార్క్ 100Nm కి పెరిగింది. మాన్సోరీ ట్యూన్ చేసిన మెర్సిడెస్ మేబాక్ ఎస్680 యొక్క ట్విన్-టర్బో వి12 ఇంజన్ గరిష్టంగా 710bhp పవర్ ను మరియు 1,000Nm గరిష్ట టార్క్‌ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ ద్వారా వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు పంపిణీ చేయబడుతుంది.

అసలే ఖరీదైన కారు, ఆపై ఖరీదైన కస్టమైజేషన్ ప్యాక్.. మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ మాన్సోరీ

మాన్సోరీ మెర్సిడెస్-మేబ్యాక్ S-క్లాస్ - ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లు

మాన్సోరీ మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ లో ఈ కస్టమైజేషన్ కంపెనీ అనవసరమైన గందరగోళానికి తావివ్వకుండా, చాలా సింపుల్ గా మరియు అంతే విలాసవంతంగా తీర్చిదిద్దింది. మాన్సోరీ రూపొందించిన మేబాక్ ఎస్-క్లాస్ కార్బన్ ఫైబర్‌ భాగాలను కలిగి ఉంటుంది. దీనితో పాటుగా ఈ తేలికపాటి మెటీరియల్ ‌ను ఫ్రంట్ ఎయిర్ ఇన్‌టేక్ ‌లపై, కింద మరియు ఫ్రంట్ ఆప్రాన్‌ కి, సిల్స్ ‌పై, బయటి అద్దాలపై మరియు వెనుక ఆప్రాన్‌ పై ఉపయోగించారు. పైకప్పు అంచు పై మరియు బూట్ లిడ్ పై కార్బన్ ఫైబర్ స్పాయిలర్‌ల రూపంలో కూడా ఈ మార్పులు ఉంటాయి.

అసలే ఖరీదైన కారు, ఆపై ఖరీదైన కస్టమైజేషన్ ప్యాక్.. మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ మాన్సోరీ

ఈ ప్రత్యేకమైన మాన్సోరీ మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ తో లభిస్తుంది. ఈ కలర్ ఆప్షన్ తో కస్టమ్ మేబ్యాక్‌ రోడ్డుపై చూపరుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటుంది. ఇతర ఎక్స్టీరియర్ ఫీచర్లలో మాన్సోరీ సెంటర్ క్యాప్స్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ ముందు భాగంలో 9x22 ఇంచెస్ సైజ్ మరియు వెనుకవైపు 10.5x22 ఇంచెస్ సైజులో ఉంటాయి. వీటిపై వరుసగా 265/30 మరియు 305/25 ప్రొఫైల్ టైర్ లు అమర్చబడి ఉంటాయి.

అసలే ఖరీదైన కారు, ఆపై ఖరీదైన కస్టమైజేషన్ ప్యాక్.. మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ మాన్సోరీ

మాన్సోరీ ద్వారా కస్టమైజ్ చేయబడిన మెర్సిడెస్-మేబాక్ ఎస్-క్లాస్ లోపలి భాగాన్ని కస్టమర్ యొక్క ఖచ్చితమైన స్పెసిఫికేషన్‌కు అనుకూలంగా అనుకూలీకరించవచ్చు. మాన్సోరీ కస్టమర్‌లకు సరికొత్త పూర్తి లెదర్ ఇంటీరియర్ ఆప్షన్ ను అందిస్తుంది. ఇంటీరియర్‌లో మల్టిపుల్ కార్బన్ ఫైబర్ ఇన్‌లేస్, అల్యూమినియం పెడల్స్, లెదర్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ మరియు ఫ్లోర్ మ్యాట్‌లు అన్నీ కూడా ప్రత్యేకమైన మాన్సోరీ లోగోలను కలిగి ఉంటాయి. కస్టమర్లు తమకు నచ్చిన విధంగా ఇంటీరియర్ ను కస్టమ్ చేసుకోవచ్చు.

అసలే ఖరీదైన కారు, ఆపై ఖరీదైన కస్టమైజేషన్ ప్యాక్.. మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ మాన్సోరీ

భారతదేశంలో Mercedes-Maybach S-Class విడుదల..

ఇదిలా ఉంటే జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) గడచిన మార్చి నెలలోనే తమ కొత్త '2022 మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్' (2022 Mercedes-Maybach S-Class) లగ్జరీ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ ధర రూ. 2.50 కోట్లు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది ఎస్580 మరియు ఎస్680 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో మెర్సిడెస్ S580 స్థానికంగా అసెంబుల్ చేయబడుతుంది మరియు మెర్సిడెస్ S680 కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా దిగుమతి చేసుకోబడుతుంది.

అసలే ఖరీదైన కారు, ఆపై ఖరీదైన కస్టమైజేషన్ ప్యాక్.. మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ మాన్సోరీ

మెర్సిడెస్ ఎస్680 (Mercedes Maybach S680) భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన మేబాక్ మోడల్. మేబాక్ ఎస్-క్లాస్ అనేది దాని స్టాండర్డ్ ఎస్-క్లాస్ సెడాన్ కంటే ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ 5,469 మిమీ పొడవు, 1,921 మిమీ వెడల్పు, 1,510 మిమీ ఎత్తు మరియు 3,396 మిమీ వీల్‌బేస్ ను కలిగి ఉంటుంది. ఇది మునుపటి తరం కంటే 31 మిమీ ఎక్కువ పొడవు ఉంటుంది. భారతదేశంలో ఈ సెడాన్ యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఇది 2023 వరకు విక్రయించాల్సిన దాని అన్ని యూనిట్లను కంపెనీ ఇప్పటికే పూర్తిగా విక్రయించినట్లు పేర్కొంది.

Most Read Articles

English summary
Mercedes maybach s class141422
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X