చవకైన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) ఎలక్ట్రిక్ కారు వస్తోంది..!

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా ఈ ఏడాది మార్చి నెలలో తమ కొత్త 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ఈవీ (2022 MG ZS EV) ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. లాంచ్ సమయంలో కంపెనీ ఈ మోడల్ ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసినప్పటికీ, బుకింగ్ మరియు రిటైల్ కోసం టాప్-ఎండ్ 'ఎక్స్‌క్లూజివ్' వేరియంట్‌ ను మాత్రమే అందుబాటులో ఉంచింది. కాగా, ఎమ్‌జి మోటార్ ఇండియా ఇప్పుడు భారతదేశంలో బేస్ MG ZS EV 'ఎక్సైట్' వేరియంట్‌ను రిటైల్ చేయడానికి సిద్ధమవుతోంది.

చవకైన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) ఎలక్ట్రిక్ కారు వస్తోంది..!

తాజాగా, కంపెనీ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV SUV) ఎస్‌యూవీ యొక్క బేస్ 'ఎక్సైట్' ట్రిమ్‌ను హోమోలొగేట్ చేసింది. ఎమ్‌జి మోటార్ తమ కొత్త 2022 మోడల్ ను మార్కెట్లో విడుదల చేసిన సమయంలో కంపెనీ ఈ 'ఎక్సైట్' ట్రిమ్ ప్రారంభ ధరను రూ. 21.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా వెల్లడించింది. అయితే, కంపెనీ ఇంకా ఈ వేరియంట్ ను అధికారికంగా మార్కెట్లో విక్రయించడం ప్రారంభించలేదు కాబట్టి, ఇకపై కూడా ఈ ధర ఇలా ఉంటుందని ఆశిస్తున్నారు. ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఇది బేస్ వేరియంట్ గా ఉంటుంది.

చవకైన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) ఎలక్ట్రిక్ కారు వస్తోంది..!

అయితే, ఓ నివేదిక ప్రకారం బేస్ MG ZS EV వేరియంట్ యొక్క మొదటి బ్యాచ్ విక్రయించబడిన తర్వాత దీని ధరలు పెరుగుతాయని సమాచారం. ఎమ్‌జి మోటార్ తమ కొత్త 2022 మోడల్ MG ZS EV వేరియంట్‌ల ధరలను ప్రకటించినప్పటి నుండి మార్కెట్లో అనేక ఇతర కార్ల ధరలు పెరిగాయి, ఈ నేపథ్యంలో ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ధరలు కూడా పెరగవచ్చని భావిస్తున్నారు. కొత్తగా విడుదల చేయబడిన ఈ ఎలక్ట్రిక్ వాహనం 2022 సంవత్సరానికి విక్రయించబడినందున కొత్తగా ప్రారంభించబడిన 2022 MG ZS EV బుకింగ్‌లు నిలిపివేయబడ్డాయి.

చవకైన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) ఎలక్ట్రిక్ కారు వస్తోంది..!

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ విక్రయాల విషయానికి వస్తే, భారతదేశంలో టాటా నెక్సాన్ ఈవీ తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ నిలుస్తుంది. ఈ కొత్త 2022 మోడల్ కు భారతీయ వినియోగదారుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ అప్‌డేటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క ప్రారంభ బ్యాచ్ కొన్ని వారాల్లోనే విక్రయించబడింది. అంతేకాకుండా, ఇది ప్రారంభించబడిన సమయంలో, టాప్-ఎండ్ 'ఎక్స్‌క్లూజివ్' వేరియంట్ ధర రూ. 25.88 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది.

చవకైన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) ఎలక్ట్రిక్ కారు వస్తోంది..!

కొత్త 2022 మోడల్ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా ఉన్నాయి. ఈ మోడల్ ఇప్పుడు పెద్ద 50.3 బ్యాటరీ ప్యాక్‌ తో లభిస్తుంది. ఇదివరకటి మోడల్ తో పోల్చిచూస్తే, ఈ కొత్త మోడల్ బ్యాటరీ ప్యాక్ అదనంగా 5.7 kWh సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఈ కొత్త 2022 మోడల్ జెడ్ఎస్ ఈవీ రేంజ్ కూడా గతంలో కంటే భారీగా పెరిగింది. ఇప్పుడు ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 461 కిలోమీటర్ల వరకూ రేంజ్ ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది. పాత మోడల్ తో పోలిస్తే, కొత్త మోడల్ రేంజ్ 42 కిలోమీటర్లు పెరిగింది.

చవకైన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) ఎలక్ట్రిక్ కారు వస్తోంది..!

ఈ కొత్త 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఇప్పుడు చూడటానికి కంపెనీ విక్రయిస్తున్న పెట్రోల్ పవర్డ్ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) ఎస్‌యూవీ మాదిరిగా కనిపిస్తుంది. ఇందుకోసం కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ యొక్క స్టైలింగ్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారులోని డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, సన్నగా ఉండే హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎల్ఈడి టెయిల్-ల్యాంప్‌లు కూడా ఎమ్‌జి ఆస్టర్‌ మోడల్ తో సమానంగా ఉంటాయి. అయితే, దీని ఫ్రంట్ బంపర్ మరియు గ్రిల్ మాత్రం విభిన్నంగా ఉంటాయి. ముందు వైపు ఉన్న ఫాక్స్ గ్రిల్ లోనే ఈవీ యొక్క చార్జింగ్ పోర్ట్ అమర్చబడి ఉంటుంది.

చవకైన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) ఎలక్ట్రిక్ కారు వస్తోంది..!

జెడ్ఎస్ ఈవీ యొక్క అప్‌డేటెడ్ మోడల్ లో ఉపయోగించిన పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ ఇప్పుడు గరిష్టంగా 173.6 బిహెచ్‌పి శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త 2022 ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ కేవలం 8.5 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, చార్జింగ్ సమయాన్ని పరిశీలిస్తే, ఈ పెద్ద బ్యాటరీ ప్యాక్ ని 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో ఛార్జ్ చేసినప్పుడు, కేవలం 60 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

చవకైన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) ఎలక్ట్రిక్ కారు వస్తోంది..!

ఈ కారులోని ఇతర ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 7 ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే, డిజిటల్ కీ ఫంక్షన్‌, డ్యూయల్ పేన్ పానోరమిక్ సన్‌రూఫ్, వాయిస్ కమాండ్‌తో కంట్రోల్ చేయగలిగే 75కి పైగా ఐ-స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్స్ మొదలైనవి ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ చేంజ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో పాటుగా అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు మరియు 360 డిగ్రీ కెమెరా వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
Mg motor india gearing up to retail the new 2022 mg zs ev base variant soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X