ఎమ్‌జి కస్టమర్ల కోసం మాన్‌సూన్ ఆఫర్లు.. వర్షాకాలానికి తగినట్లుగా మీ కారుని సిద్ధం చేసుకోండి!

బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ (MG Motor) భారత మార్కెట్లో అమ్మకాలను పెంచుకునేందుకు తమ మోడళ్లపై మాన్‌సూన్ ఆఫర్లను ప్రకటించింది. ఎమ్‌జి కార్లపై మాన్‌సూన్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు జూలై 18, 2022వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఈ మాన్‌సూన్ ఆఫర్ గురించిన సమాచారాన్ని కంపెనీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. మరింత సమాచారం కోసం కస్టమర్లు కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చని కంపెనీ తెలిపింది.

ఎమ్‌జి కస్టమర్ల కోసం మాన్‌సూన్ ఆఫర్లు.. వర్షాకాలానికి తగినట్లుగా మీ కారుని సిద్ధం చేసుకోండి!

ఎమ్‌జి మోటార్ చేసిన పోస్ట్‌లో "ఈ వర్షాకాలంలో ఎమ్‌జి మోటార్ గొప్ప ఆఫర్‌లను అందిస్తోంది. మీ సమీపంలోని ఎమ్‌జి మోటార్ డీలర్‌షిప్‌ని సందర్శించండి, ఈ ప్రత్యేక ఆఫర్‌లను చూడండి మరియు సుదీర్ఘ వర్షాకాల ప్రయాణం కోసం మీ ఎమ్‌జి కారును సిద్ధం చేసుకోండి!" అని పేర్కొంది.

ఎమ్‌జి కస్టమర్ల కోసం మాన్‌సూన్ ఆఫర్లు.. వర్షాకాలానికి తగినట్లుగా మీ కారుని సిద్ధం చేసుకోండి!

ఎమ్‌జి మోటార్ కస్టమర్‌లు ఈ మాన్‌సూన్ ఆఫర్ కింద అనేక ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఆఫర్‌లలో కాంప్రహెన్సివ్ వెహికల్ హెల్త్ చెకప్, కార్ టాప్ వాష్/డ్రై వాష్, ఫ్రంట్ వైపర్ బ్లేడ్‌లపై 50 శాతం తగ్గింపు, కాంప్లిమెంటరీ బ్రేక్ ప్యాడ్ క్లీనింగ్ మరియు వాల్యూ యాడెడ్ సర్వీస్, టైర్లు మరియు బ్యాటరీలపై ఆకర్షణీయమైన ఆఫర్‌లను కంపెనీ అందిస్తోంది.

ఎమ్‌జి కస్టమర్ల కోసం మాన్‌సూన్ ఆఫర్లు.. వర్షాకాలానికి తగినట్లుగా మీ కారుని సిద్ధం చేసుకోండి!

ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో మొత్తం ఐదు కార్లను కలిగి ఉంది. వీటిలో ఎమ్‌జి హెక్టర్, ఎమ్‌జి హెక్టర్ ప్లస్, ఎమ్‌జి గ్లోస్టర్, ఎమ్‌జి ఆస్టర్ మరియు ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. కంపెనీ తన మాన్‌సూన్ ఆఫర్‌లో ఈ కార్లన్నింటినీ చేర్చింది.

ఇదిలా ఉంటే, ఎమ్‌జి మోటార్ తమ హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ మోడళ్లలో చౌకైన వేరియంట్‌లను విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఎమ్‌జి ఆస్టర్ లో కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన విధంగా Hector EX మరియు Hector Plus EX వేరియంట్‌లను తీసుకురాబోతోంది. హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ యొక్క ఈ కొత్త వేరియంట్‌లు కూడా ఆస్టర్ తరహాలో ఉంచబడతాయి. కాబట్టి, ఇందులో అనేక భద్రతా ఫీచర్లు తొలగించబడుతాయి.

ఎమ్‌జి కస్టమర్ల కోసం మాన్‌సూన్ ఆఫర్లు.. వర్షాకాలానికి తగినట్లుగా మీ కారుని సిద్ధం చేసుకోండి!

ఎమ్‌జి మోటార్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) లో కంపెనీ ఓ కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్ ను ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) పేరుతో విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌ ప్రస్తుత ఆస్టర్ వేరియంట్ల కన్నా తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీలో కంపెనీ మొత్తం 4 కొత్త వేరియంట్‌లను అందిస్తోంది. వీటిలో స్టైల్ ఇఎక్స్, సూపర్ ఇఎక్స్, స్మార్ట్ ఇఎక్స్ మరియు షార్ప్ ఇఎక్స్ వేరియంట్లు ఉన్నాయి.

ఎమ్‌జి కస్టమర్ల కోసం మాన్‌సూన్ ఆఫర్లు.. వర్షాకాలానికి తగినట్లుగా మీ కారుని సిద్ధం చేసుకోండి!

కొత్తగా నచ్చిన ఇఎక్స్ వేరియంట్ ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ యొక్క స్టాండర్డ్ వేరియంట్‌ల కంటే దాదాపు రూ. 6,000 నుండి రూ. 12,000 వరకు తక్కువ ధరను కలిగి ఉంటుంది. అయితే, దీని తక్కువ ధరకు తగినట్లుగానే కంపెనీ ఇందులోని ఫీచర్లలో కూడా తగ్గింపులు చేసింది. ఈ కొత్త వేరియంట్ లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ట్రాక్షన్ కంట్రోల్ (TC), బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, హిల్ హోల్డ్/డీసెంట్ కంట్రోల్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ మరియు లేన్-కీప్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లను తొలగించింది.

ఎమ్‌జి కస్టమర్ల కోసం మాన్‌సూన్ ఆఫర్లు.. వర్షాకాలానికి తగినట్లుగా మీ కారుని సిద్ధం చేసుకోండి!

అదే తరహాలో, ఇప్పుడు హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ మోడల్స్ యొక్క EX వేరియంట్ లు కూడా అందుబాటులోకి రానున్నాయి. కంపెనీ దీనిని స్టైల్ ఇఎక్స్, షార్ప్ ఇఎక్స్ మరియు షైన్ ఇఎక్స్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురాబోతోంది, ఇది పెట్రోల్ మరియు పెట్రోల్ హైబ్రిడ్ ఎంపికలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులోకి రానున్నాయి.

ఎమ్‌జి కస్టమర్ల కోసం మాన్‌సూన్ ఆఫర్లు.. వర్షాకాలానికి తగినట్లుగా మీ కారుని సిద్ధం చేసుకోండి!

ఇదిలా ఉంటే, ఎమ్‌జి మోటార్ ఇండియా భారత మార్కెట్ లో అతి త్వరలో ఒక చిన్న మరియు అత్యంత సరసమైన ఓ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఎమ్‌జి మోటార్ యొక్క చైనీస్ అనుబంధ కార్‌మేకర్ వులింగ్ (Wuling) పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఎయిర్ ఈవీ (Wuling Air EV) డిజైన్ ఆధారంగా ఓ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును ఎమ్‌జి మోటార్ భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. వులింగ్ తమ చిన్న ఎలక్ట్రిక్ కార్లను చైనా మార్కెట్‌తో సహా పలు ఆగ్నేయాసియాలోని అనేక దేశాలలో విక్రయిస్తోంది.

ఎమ్‌జి కస్టమర్ల కోసం మాన్‌సూన్ ఆఫర్లు.. వర్షాకాలానికి తగినట్లుగా మీ కారుని సిద్ధం చేసుకోండి!

ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు 20kWh నుండి 25kWh వరకు బ్యాటరీ ప్యాక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 150 కిలోమీటర్ల రియల్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. కాబట్టి, ఇది అర్బన్ మొబిలిటీకి చాలా చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ పవర్ అవుట్‌పుట్ 40 హెచ్‌పిగా ఉంటుంది. ఎమ్‌జి మోటార్ ఇండియా టాటా ఆటోకాంప్ నుండి బ్యాటరీ ప్యాక్‌ను స్థానికంగా సోర్స్ చేస్తుంది. కాబట్టి, ఇ230 టాటా నెక్సాన్ ఈవీ మాదిరిగానే లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ (LFP) సెల్‌ను ఉపయోగిస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mg motor india introduced monsoon offers for its cars details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X