2022 ఎమ్‌జి గ్లోస్టర్ (2022 MG Gloster) టీజర్ వెల్లడి: రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు.. ఎప్పుడంటే?

చైనీస్ యాజమాన్యంలో ఉన్న బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ ఎమ్‌జి గ్లోస్టర్ (MG Gloster) లో ఓ కొత్త 2022 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కంపెనీ తమ కొత్త ఎమ్‌జి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ టీజర్ ను కూడా విడుదల చేసింది.

కొత్త 2022 ఎమ్‌జి గ్లోస్టర్ (2022 MG Gloster) టీజర్ వెల్లడి.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడం

భారతదేశంలో ఎమ్‌జి మోటార్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఎమ్‌జి గ్లోస్టర్, అమ్మకాల పరిమాణం పరంగా ఇతర ఎమ్‌‌జి కార్ల మాదిరిగా అధిక సంఖ్యలో అమ్ముడుపోనప్పటికీ, ఇది సెగ్మెంట్లో కెల్లా విలాసవంతమైన మరియు అధునాతనమైన ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. నిజానికి, భారతదేశంలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ (ADAS) ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి కారు కూడా ఎమ్‌జి గ్లోస్టర్ కావడం విశేషం. కాగా, కొత్తగా వస్తున్న 2022 గ్లోస్టర్ రిఫ్రెష్డ్ డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లతో రానుంది.

కొత్త 2022 ఎమ్‌జి గ్లోస్టర్ (2022 MG Gloster) టీజర్ వెల్లడి.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడం

కొత్త 2022 ఎమ్‌జి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ (New MG 2022 Gloster Facelift) కూడా ఇతర ఎమ్‌జి మోడల్‌ల మాదిరిగానే, ఫుల్లీ లోడెడ్ టెక్ ఫీచర్లతో ప్యాక్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే అమ్ముడవుతున్న ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ ఫీచర్ల పరంగా ఇప్పటికీ చాలా తాజాగా మరియు అధునాతనంగా కనిపిస్తున్నప్పటికీ, కంపెనీ ఇందులో ఓ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్ ను తీసుకురావడం ద్వారా ఈ మోడల్‌ ను మరింత ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలని కంపెనీ భావిస్తోంది.ఎమ్‌‌జి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ఆగస్ట్ 31, 2021వ తేదీన అధికారికంగా విడుదల కానుంది.

కొత్త 2022 ఎమ్‌జి గ్లోస్టర్ (2022 MG Gloster) టీజర్ వెల్లడి.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడం

ఫేస్‌లిఫ్టెడ్ ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ లాంచ్ గురించిన వివరాలను కంపెనీ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్లడి చేసింది. ఇది కేవలం ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అయినందున, రాబోయే 2022 ఎమ్‌జి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ప్రస్తుత మోడల్ కన్నా కొంచెం షార్ప్ గా మరియు యాంగ్యులర్ గా ఉండేలా దాని ఎక్స్టీరియర్ లో చిన్నపాటి ట్వీక్స్ చేయనున్నారు. అంతేకాకుండా, ఇంటీరియర్‌లో కూడా కొన్ని అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. అయితే, ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2022 ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో మెకానికల్ గా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది.

కొత్త 2022 ఎమ్‌జి గ్లోస్టర్ (2022 MG Gloster) టీజర్ వెల్లడి.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడం

ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీ రెండు రకాల ఇంజన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని టూ-వీల్ డ్రైవ్ వేరియంట్ 160 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 375 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కాగా, ఫోర్-వీల్ డ్రైవ్ వేరియంట్ మరింత శక్తివంతమైన 2.0-లీటర్ ట్విన్-టర్బో ఇంజన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 4000 ఆర్‌పిఎమ్ వద్ద 215 బిహెచ్‌పి శక్తిని మరియు 2400 ఆర్‌పిఎమ్ వద్ద 480 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2022 ఎమ్‌జి గ్లోస్టర్ (2022 MG Gloster) టీజర్ వెల్లడి.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడం

ఈ రెండు ఇంజన్లు కూడా స్టాండర్డ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఫోర్‌వీల్ డ్రైవ్ వేరియంట్ లో ఈ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి వెలువడే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. కఠినమైన భూభాగాలపై సైతం సులువైన డ్రైవింగ్ కోసం ఇందులో ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో 4x4 (ఆల్-వీల్) డ్రైవింగ్, ఎకో, ఆటో, స్పోర్ట్ అనే డ్రైవ్ మోడ్స్ మరియు స్నో, మడ్, శాండ్, రాక్ అనే టెర్రైన్ మోడ్స్ కూడా ఉంటాయి.

కొత్త 2022 ఎమ్‌జి గ్లోస్టర్ (2022 MG Gloster) టీజర్ వెల్లడి.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడం

ఎమ్‌జి గ్లోస్టర్ 7-సీటర్ మరియు 6-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. కొత్త 2022 మోడల్ గ్లోస్టర్ లో సరికొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉండనున్నట్లు సమాచారం. ఈ కారులోని కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు, మసాజింగ్ సీట్లు, కూల్డ్ సీట్లు, PM2.5 ఎయిర్ ఫిల్టర్, ఆటో హెడ్‌లైట్లు, పవర్డ్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM, హీటెడ్ ORVMలు మరియు పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

కొత్త 2022 ఎమ్‌జి గ్లోస్టర్ (2022 MG Gloster) టీజర్ వెల్లడి.. రిఫ్రెష్డ్ డిజైన్, కొత్త ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడం

అలాగే, సేఫ్టీ విషయానికి వస్తే ఎమ్‌జి గ్లోస్టర్ ఎస్‌యూవీలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ (BSD), డ్రైవర్ ఫెటీగ్ రిమైండర్, ఫార్వర్డ్ కొలైజన్ వార్నింగ్ (FCW), లేన్ డిపార్చర్ వార్నింగ్ (LDW), పార్క్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC) వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లతో పాటుగా మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్ లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో లభిస్తుంది. ప్రస్తుత ఎమ్‌జి గ్లోస్టర్ ధరలు రూ. 31.49 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్, ఇండియా). కాగా, కొత్తగా రాబోయే 2022 మోడల్ లో చేసిన అప్‌గ్రేడ్స్ కారణంగా దాని ధరలు సుమారు రూ. 50,000 వరకు పెరిగే అవకాశం ఉంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mg motor india teases new 2022 gloster facelift launch date and other details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X