ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) వేరియంట్ విడుదల.. ధర తక్కువ, ఫీచర్లు కూడా..

బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ (MG Motor) దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎమ్‌జి ఆస్టర్ (MG Astor) లో కంపెనీ ఓ కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్ ను తాజాగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) పేరుతో వచ్చిన ఈ కొత్త వేరియంట్‌ ప్రస్తుత వేరియంట్ల కన్నా తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీలో కంపెనీ మొత్తం 4 కొత్త వేరియంట్‌లను అందిస్తోంది. వీటిలో స్టైల్ ఇఎక్స్, సూపర్ ఇఎక్స్, స్మార్ట్ ఇక్స్ మరియు షార్ప్ ఇఎక్స్ వేరియంట్లు ఉన్నాయి.

ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) వేరియంట్ విడుదల.. ధర తక్కువ, ఫీచర్లు కూడా..

కొత్తగా నచ్చిన ఇఎక్స్ వేరియంట్ ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ యొక్క స్టాండర్డ్ వేరియంట్‌ల కంటే దాదాపు రూ. 6,000 నుండి రూ. 12,000 వరకు తక్కువ ధరను కలిగి ఉంటుంది. అయితే, దీని తక్కువ ధరకు తగినట్లుగానే కంపెనీ ఇందులోని ఫీచర్లలో కూడా తగ్గింపులు చేసింది. ఈ కొత్త వేరియంట్ లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ట్రాక్షన్ కంట్రోల్ (TC), బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, హిల్ హోల్డ్/డీసెంట్ కంట్రోల్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ మరియు లేన్-కీప్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లను తొలగించింది.

ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) వేరియంట్ విడుదల.. ధర తక్కువ, ఫీచర్లు కూడా..

బహుశా సెమీ కండక్టర్ల చిప్ కొరత నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం, మార్కెట్లోని ఇతర వాహన తయారీదారులు కూడా సెమీకండక్టర్ చిప్ కొరతను అధిగమించడానికి తమ వాహనాలలో ఫీచర్లను ఆకస్మికంగా తగ్గిస్తున్నారు, కానీ ధరను మాత్రం అలానే ఉంచేస్తున్నారు. అయితే, ఎమ్‌జి మోటార్ మాత్రం ఇతర వాహన తయారీదారుల మాదిరిగా కాకుండా, ఈ కొత్త వేరియంట్ విడుదలతో తమ వినియోగదారులకు మరొక కొత్త ఎంపికను అందించిందని చెప్పవచ్చు.

ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) వేరియంట్ విడుదల.. ధర తక్కువ, ఫీచర్లు కూడా..

గత నెలలో ఎమ్‌జి మోటార్ భారతదేశంలో ఆస్టర్ ఎస్‌యూవీ ధరలను పెంచింది. కొత్త ధరల ప్రకారం, ఈ ఎస్‌యూవీ యొక్క ధరలు వేరియంట్ ను బట్టి సుమారు రూ. 46,000 వరకు పెరిగాయి మరియు పెరిగిన కొత్త ధరలు జూన్ 2022 నుండే అమలులోకి వచ్చాయి. ధరల పెంపు అనంతరం ఎమ్‌జి ఆస్టర్ ధరలు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ 'స్టైల్' ట్రిమ్ కోసం రూ. 10.28 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి. ఇది ఈ ఎస్‌యూవీ యొక్క పాత ధరతో పోల్చినప్పుడు ఈ బేస్ వేరియంట్ ధర రూ. 30,000 వరకూ పెరిగింది.

ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) వేరియంట్ విడుదల.. ధర తక్కువ, ఫీచర్లు కూడా..

కాగా, ఇప్పుడు కొత్త వేరియంట్‌ ఇఎక్స్ పరిచయంతో, ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ ధరలు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన బేస్ 'స్టైల్ ఇఎక్స్' ట్రిమ్ కోసం రూ. 10.22 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి. మరోవైపు, 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన టాప్-ఎండ్ 'సావీ' వేరియంట్ ధర రూ. 18.13 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంటుంది.

ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) వేరియంట్ విడుదల.. ధర తక్కువ, ఫీచర్లు కూడా..

ఎమ్‌జి మోటార్ తమ ఆస్టర్ ఎస్‌యూవీ ధరలను పెంచినప్పటికీ, ఇది ఈ విభాగంలో దాని సమీప ప్రత్యర్థులైన హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో పోలిస్తే ఆస్టర్ ధర ఇప్పటికీ అగ్రెసివ్ గానే ఉంటుంది. అంతేకాకుండా, కొత్త వేరియంట్‌ పరిచయం కారణంగా ఇప్పుడు కస్టమర్‌లకు మరిన్ని వేరియంట్ల నుండి ఈ కారును ఎంచుకునే సౌలభ్యం కలుగుతుంది.

ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) వేరియంట్ విడుదల.. ధర తక్కువ, ఫీచర్లు కూడా..

ఆస్టర్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, ఇది ఈ విభాగంలో ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లతో లభిస్తున్న ఏకైక మోడల్. ఈ సిస్టమ్ లో భాగంగా ఆస్టర్ ఎస్‌యూవీలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, కొల్లైజన్ అలెర్ట్, డ్రైవర్ డ్రౌజీనెస్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన డ్రైవింగ్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ కూడా రోడ్డుపై ప్రమాదం జరగకుండా నిరోధించడానికి ఉపయోగపడే క్రియాశీల భద్రతా వ్యవస్థలో భాగంగా ఉంటాయి.

ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) వేరియంట్ విడుదల.. ధర తక్కువ, ఫీచర్లు కూడా..

ఇవే కాకుండా, ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ యొక్క స్టాండర్డ్ వేరియంట్‌లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ (ESS), నాలుగు-డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్ హోల్డ్ కంట్రోల్ (HHC), హిల్ డిసెంట్ కంట్రోల్ (HDC), పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్‌లు, సెక్యూరిటీ అలారం, ISOFIX చైల్డ్ సీట్లు, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి మరెన్నో ఇతర స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) వేరియంట్ విడుదల.. ధర తక్కువ, ఫీచర్లు కూడా..

ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీలో ప్రధానంగా లభించే ఫీచర్లను పరిశీలిస్తే, కంపెనీ ఇందులో పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పర్సనల్ అసిస్టెంట్, పానోరమిక్ సన్‌రూఫ్, 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 3 రకాల స్టీరింగ్ మోడ్‌లు, టిల్ట్ అండ్ అడ్జస్టబుల్ స్టీరింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, వెనుక ప్రయాణీకుల కోసం ఏసి వెంట్‌లు మరియు PM 2.5 ఫిల్టర్‌తో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్ మొదలైనవి ఉన్నాయి.

ఎమ్‌జి ఆస్టర్ ఇఎక్స్ (MG Astor EX) వేరియంట్ విడుదల.. ధర తక్కువ, ఫీచర్లు కూడా..

ఆస్టర్ ఎస్‌యూవీ మొత్త రెండు రకాల ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని బేస్ వేరియంట్లు 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను పొందుతాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 108.5 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కాగా, ఇందులో మరింత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ 138 బిహెచ్‌పి గరిష్ట శక్తిని అందిస్తుంది. ఇవి రెండూ కూడా మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లలో లభిస్తాయి. ఎమ్‌జి ఆస్టర్ ఎస్‌యూవీ ఆధారంగా తయారైన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) అనే ఎలక్ట్రిక్ కారును కూడా కంపెనీ భారత మార్కెట్లో విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Mg motor launches astor ex variants with lower price detials
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X