రూ.12-16 లక్షల రేంజ్‌లో చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్న ఎమ్‌జి మోటార్

బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India) భారత మార్కెట్లో జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ కంపెనీ త్వరలో మరో కొత్త మరియు చవకైన ఎలక్ట్రిక్ కారును భారతదేశంలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా టిగోర్ ఈవీకి పోటీగా సరసమైన ధరకే ఓ చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని చూస్తున్నట్లు ఎమ్‌జి మోటార్ ఇండియా తెలిపింది. ఎమ్‌జి మోటార్ నుండి రాబోయే ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ.12-16 లక్షల మధ్యలో ఉండవచ్చని ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ ఛాబా వెల్లడించారు.

రూ.12-16 లక్షల రేంజ్‌లో చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్న ఎమ్‌జి మోటార్

అయితే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఏ సెగ్మెంట్‌లో విడుదల చేయబడుతుంది మరియు దాని స్పెసిఫికేషన్‌లు వంటి ఇతర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఎమ్‌జి మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న జెడ్ఎస్ ఈవీ ఈ విభాగంలో టాటా నెక్సాన్ ఈవీ మరియు హ్యుందాయ్ కోనా ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో ప్రతి నెలా దాదాపు 3000-4000 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నామని రాజీవ్ చాబా తెలిపారు.

రూ.12-16 లక్షల రేంజ్‌లో చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్న ఎమ్‌జి మోటార్

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను వీలైనంత త్వరగా క్యాష్ చేసుకోవాలంటే, తయారీదారులు తమ ఈవీ లాంచ్ ప్లాన్స్ ని వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలో కేవలం ప్రీమియం కార్లను మాత్రమే కాకుండా, వివిధ రకాల బడ్జెట్ వినియోగదారులకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టిన తయారీదారులే మార్కెట్లో స్థిరంగా నిలబడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో టాటా మోటార్స్ ఇతర కంపెనీల కన్నా ఓ అడుగు ముందు ఉంది.

రూ.12-16 లక్షల రేంజ్‌లో చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్న ఎమ్‌జి మోటార్

ఎమ్‌జి మోటార్ భారత మార్కెట్లో ఒక్క ఎలక్ట్రిక్ కారును మాత్రమే విక్రయిస్తోంది. దాని ఎక్స్-షోరూమ్ ధర కూడా రూ.20 లక్షలకు పైగా ఉంది. కాబట్టి, ఎమ్‌జి మోటార్ భారత ఈవీ మార్కెట్లోని డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలంటే, ఇందులో దాదాపు సగం ధరకే ఓ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలి. ఎమ్‌జి మోటార్ ఇటీవలే తన సరికొత్త ఎలక్ట్రిక్ కారు MG4ని పరిచయం చేసింది. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి అనేక దేశాలలో ప్రారంభించబడాని సిద్ధంగా ఉంది.

కొత్త ఎమ్‌జి4 యూరప్ లో ఈ బ్రాండ్ నుండి అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఏడాదిలో 1,50,000 యూనిట్లను విక్రయించాలని కంపెనీ యోచిస్తోంది. ఓ నివేదిక ప్రకారం, ఎమ్‌జి4 ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో బడ్జెట్ ఎలక్ట్రిక్ కారుగా కూడా విడుదల చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

రూ.12-16 లక్షల రేంజ్‌లో చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్న ఎమ్‌జి మోటార్

ఎమ్‌జి 4 (MG4) ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఇది పూర్తి ఛార్జింగ్‌పై 450 కిమీల రేంజ్ ను అందిస్తుంది. ఇందులో రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో మొదటిది 51 kWh మరియు రెండవది 64 kWh. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉంది, ఆ తర్వాత ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ మరియు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ ఉన్నాయి.

ఇటీవలి కాలంలో ఇంధన ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా వ్యక్తిగత రవాణా విషయంలో డిమాండ్ భారీగా పెరిగింది. ఇది ద్విచక్ర వాహనాల విభాగంలోని ఎలక్ట్రిక్ వాహనాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చింది. అదే సమయంలో, దేశంలో కొన్ని ఎంపిక చేసిన కంపెనీలు మాత్రమే ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నాయి.

రూ.12-16 లక్షల రేంజ్‌లో చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్న ఎమ్‌జి మోటార్

ప్రస్తుతం, టాటా మోటార్స్ భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు మరియు విక్రయదారుగా ఉంది. ఈ బ్రాండ్ నుండి టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లు లభిస్తున్నాయి. అలాగే, ఫ్లీట్ విభాగంలో టిగోర్ ఈవీ ఆధారిత ఎక్స్‌ప్రెస్-టి ఎలక్ట్రిక్ కారును కూడా కంపెనీ విక్రయిస్తోంది. టాటా మోటార్స్ ప్రతినెలా సగటున 3,500 యూనిట్లకు పైగా ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. మరోవైపు, ఎమ్‌జి మోటార్ ప్రతి నెలా దాదాపు 1,000 యూనిట్ల జెడ్ఎస్ ఈవీ ల కోసం బుకింగ్‌లను పొందుతోంది. ఎమ్‌జి మోటార్ ఇండియా ఇప్పటికే దేశీయ మార్కెట్లో 5,000 యూనిట్లకు పైగా జెడ్ఎస్ ఈవీ లను విక్రయించింది.

రూ.12-16 లక్షల రేంజ్‌లో చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్న ఎమ్‌జి మోటార్

కేవలం ప్యాసింజర్ కార్ విభాగంలోనే కాకుండా లగ్జరీ కార్ విభాగంలో కూడా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఈ విభాగంలో విడుదలైన ఇంపోర్టెడ్ కార్లన్నీ కూడా హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. భారతదేశంలో, ఇప్పటికే ఆడి, మెర్సిడెస్-బెంజ్, వోల్వో, బిఎమ్‌డబ్ల్యూ, జాగ్వార్ మరియు పోర్షే వంటి లగ్జరీ కార్ బ్రాండ్‌లు కూడా తమ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేశాయి. ఇటీవలే కొరియన్ కార్ కంపెనీ కియా కూడా తమ ఈవీ6 (Kia EV6) ఎలక్ట్రిక్ కారును భారత్ లో విడుదల చేసింది. ఇది భారతదేశంలో త్వరలో విడుదల కానున్న హ్యుందాయ్ ఐయానిక్ 6 కారుకి పోటీగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో Kia EV6 ఎలక్ట్రిక్ కారు ధర రూ. 59.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది.

Most Read Articles

English summary
Mg to launch new budget electric car price between 12 16 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X