ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ (MG ZS EV Excite) విడుదల.. ఇప్పుడు డ్యూయెల్ టోన్ ఇంటీరియర్‌తో..

బ్రిటీష్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్ ఇండియా (MG Motor India) దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) లో కంపెనీ ఇప్పుడు ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ (MG ZS EV Excite) పేరుతో కంపెనీ ఇందులో ఓ ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో ఈ వేరియంట్ ధర రూ. 22.58 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కొత్త వేరియంట్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ (MG ZS EV Excite) విడుదల.. ఇప్పుడు డ్యూయెల్ టోన్ ఇంటీరియర్‌తో..

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ వేరియంట్ ప్రత్యేకమైన డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌ థీమ్‌తో లభిస్తుంది. ఇదివరకు ఈ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది మరియు దాని ధర రూ. 26.60 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. ప్రస్తుతం ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్: రూ. 22.58 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్: రూ. 26.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ప్రత్యేక డ్యూయల్ టోన్: రూ. 26.60 లక్షలు (ఎక్స్-షోరూమ్)
  • ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ (MG ZS EV Excite) విడుదల.. ఇప్పుడు డ్యూయెల్ టోన్ ఇంటీరియర్‌తో..

    ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ బ్లాక్ మరియు ఐవరీ డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌లలో పరిచయం చేయబడింది. అలాగే, ఇందులో సింగిల్ టోన్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో లభించే కొన్ని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఐ-స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, డ్యూయల్-పాన్ పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కొత్త ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో అందించబడ్డాయి. కొత్త i-Smart ఫీచర్‌లలో ఫర్మ్‌వేర్ ఓవర్-ది-ఎయిర్ (FOTA) అప్‌డేట్, Park+ నేటివ్ యాప్, MapmyIndia ఆన్‌లైన్ నావిగేషన్, Discover యాప్ మరియు లైవ్ వెదర్ అప్‌డేట్‌లు ఉన్నాయి.

    ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ (MG ZS EV Excite) విడుదల.. ఇప్పుడు డ్యూయెల్ టోన్ ఇంటీరియర్‌తో..

    ఇక కొత్తగా విడుదల చేయబడిన ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ వేరియంట్ విషయానికి వస్తే, ఇది కూడా ఇప్పుడు కొత్త ఐ-స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లు, 360-డిగ్రీ కెమెరా, హిల్-డీసెంట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వెనుక ప్రయాణీకుల కోసం ఏసి వెంట్‌లు మొదలైన వాటిని పొందుతుంది. ఇందులో, కస్టమర్‌లు 75 కంటే ఎక్కువ కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.

    ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ (MG ZS EV Excite) విడుదల.. ఇప్పుడు డ్యూయెల్ టోన్ ఇంటీరియర్‌తో..

    ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 10.1 ఇంచ్ హెచ్‌డి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎంబెడెడ్ LCD స్క్రీన్, హిల్ డిసెంట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా మరియు డిజిటల్ కీ వంటి స్టాండర్డ్ ఫీచర్లను పొందుతుంది. ఎమ్‌జి మోటార్స్ (MG Motors), గడచిన మార్చి నెలలో భారత మార్కెట్లో తమ సరికొత్త అప్‌డేటెడ్ 2022 మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ (2022 MG ZS EV) ని విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ మనుపటి కన్నా మెరుగైన డిజైన్ మరియు ఫీచర్లను పొందింది.

    ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ (MG ZS EV Excite) విడుదల.. ఇప్పుడు డ్యూయెల్ టోన్ ఇంటీరియర్‌తో..

    కొత్తగా మార్కెట్లోకి వచ్చిన 2022 మోడల్ జెడ్ఎస్ ఈవీ ఇప్పుడు పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. ఇందులోని 50.3 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించారు. అంతకు ముందున్న మోడల్ తో పోల్చిచూస్తే, ఈ కొత్త మోడల్ బ్యాటరీ ప్యాక్ అదనంగా 5.7 kWh సామర్థ్యాన్ని అందిస్తుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఈ కొత్త 2022 మోడల్ జెడ్ఎస్ ఈవీ రేంజ్ కూడా భారీగా పెరిగింది. ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 461 కిలోమీటర్ల వరకూ రేంజ్ ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది. పాత మోడల్ తో పోలిస్తే, కొత్త మోడల్ రేంజ్ 42 కిలోమీటర్లు ఎక్కువగా ఉంటుంది.

    ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ (MG ZS EV Excite) విడుదల.. ఇప్పుడు డ్యూయెల్ టోన్ ఇంటీరియర్‌తో..

    పెరిగిన బ్యాటరీ ప్యాక్ సామర్థ్యం కారణంగా, ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ ఇప్పుడు గరిష్టంగా 176 బిహెచ్‌పి శక్తిని మరియు 280 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.5 సెకన్లలోనే గంటకు గరిష్టంగా 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. చార్జింగ్ టైం విషయానికి వస్తే, ఈ బ్యాటరీ ప్యాక్ ని 50 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో ఛార్జ్ చేసినప్పుడు, ఇందులోని బ్యాటరీ కేవలం 60 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.

    ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ (MG ZS EV Excite) విడుదల.. ఇప్పుడు డ్యూయెల్ టోన్ ఇంటీరియర్‌తో..

    రూ.12-16 లక్షల బడ్జెట్‌లో చిన్న ఎలక్ట్రిక్ కారు

    ఇదిలా ఉంటే, ఎమ్‌జి మోటార్ భారత మార్కెట్లో ఇటీవలే విడుదలైన టాటా టియాగో ఈవీకి పోటీగా ఓ సరసమైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎమ్‌జి మోటార్ నుండి రాబోయే ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు ధర సుమారు రూ.12-16 లక్షల మధ్యలో ఉండవచ్చని ఎమ్‌జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ ఛాబా గతంలో వెల్లడించారు. అయితే, ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఏ సెగ్మెంట్‌లో విడుదల చేయబడుతుంది మరియు దాని స్పెసిఫికేషన్‌లు వంటి ఇతర వివరాలను ఇంకా వెల్లడి కాలేదు. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Mg zs ev excite launched in india comes with dual tone interior
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X