త్వరపడండి.. MINI Cooper SE సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 40 యూనిట్లు మాత్రమే

ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'మినీ ఇండియా' (MINI India) దేశీయ మార్కెట్లో తన 'మినీ కూపర్ ఎస్ఇ' (MINI Cooper SE) ఎలక్ట్రిక్ కారుని ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుని దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలచేయకముందే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 2 గంటల్లోనే మొదటి బ్యాచ్ మొత్తం విక్రయించబడ్డాయి. అయితే కంపెనీ ఇప్పుడు రెండవ బ్యాచ్ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది.

త్వరపడండి.. MINI Cooper SE సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 40 యూనిట్లు మాత్రమే

మిని ఇండియా తన 'మినీ కూపర్ ఎస్ఇ' ఎలక్ట్రిక్ కారుని మొదటి బ్యాచ్ లో కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. కానీ ఇప్పుడు రెండవ బ్యాచ్ లో ఆ సంఖ్య ఇంకొంత పెరిగింది. అంటే కంపెనీ ఇప్పుడు రెండవ బ్యాచ్ లో 40 యూనిట్లను విక్రయించనుంది. కావున ఈ ఎలక్ట్రిక్ కారుని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

త్వరపడండి.. MINI Cooper SE సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 40 యూనిట్లు మాత్రమే

మిని ఇండియా విడుదల చేసిన 'మినీ కూపర్ ఎస్ఇ' ధర విడుదల సమయంలో రూ. 47.20 లక్షలు. ఆ తరువాత కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు ధరను అమాంతం పెంచింది. కావున దీని ధర ఇప్పుడు రూ. 50.90 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.

త్వరపడండి.. MINI Cooper SE సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 40 యూనిట్లు మాత్రమే

కొత్త మినీ ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి వైట్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌వాక్ గ్రే మరియు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

త్వరపడండి.. MINI Cooper SE సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 40 యూనిట్లు మాత్రమే

'మినీ కూపర్ ఎస్ఇ' ఎలక్ట్రిక్ కారు డిజైన్ దాదాపుగా దాని మినీ కూపర్ మాదిరిగానే ఉంది. కానీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో కొన్ని చిన్న మార్పులు గమనించవచ్చు. ఇలాంటి మార్పుల్లో ఒకటి ఫ్రంట్ గ్రిల్. ఇది కారును మరింత ఏరోడైనమిక్‌గా చేస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్‌కి ఫేస్‌లిఫ్ట్ ఇవ్వడానికి, కొత్త కలర్ ఆప్సన్స్ లో ఆకర్షణీయమైన ఎల్లో కలర్ యాక్సెంట్స్ బార్‌లు మరియు మినీ ఎలక్ట్రిక్ బ్యాడ్జ్‌లతో అమర్చబడ్డాయి. కావున ఇది చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.

త్వరపడండి.. MINI Cooper SE సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 40 యూనిట్లు మాత్రమే

'మినీ కూపర్ ఎస్ఇ' (MINI Cooper SE) ఇంటిగ్రేటెడ్ సర్క్యులర్ ఎల్ఈడీ DRLలతో రౌండ్ హెడ్‌లైట్‌ పొందుతుంది. అంతే కాకుండా ఇది 17 ఇంచెస్ స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను ఎల్లో కలర్ రిమ్‌లతో పొందుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మినీ ఇండియా యొక్క ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 3-డోర్ల కూపే, ఇది గో-కార్ట్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది తక్షణ టార్క్‌ను అందిస్తుంది మరియు సున్నా ఉద్గారాలను అందిస్తుంది. దీని కారణంగా, ఈ ఎలక్ట్రిక్ కారులో ఎగ్జాస్ట్ కూడా కనిపించదు.

త్వరపడండి.. MINI Cooper SE సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 40 యూనిట్లు మాత్రమే

ఈ కారు 184 బిహెచ్‌పి పవర్ మరియు 270 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. మినీ ఎలక్ట్రిక్ కేవలం 7.3 సెకన్లలో గంటకు 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ మినీ ఎలక్ట్రిక్ కొత్త మరియు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది 32.6 కిలోవాట్ కెపాసిటీ గల బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు 270 కి.మీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది.

త్వరపడండి.. MINI Cooper SE సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 40 యూనిట్లు మాత్రమే

మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో బిఎండబ్ల్యు గ్రూప్ నుండి విక్రయించబడుతున్న మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను మంచి డిమాండ్ ఉండటం వల్ల మినీ ఇండియా కూడా ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసి అద్భుతమైన అమ్మకాలను పొందుతోంది.

త్వరపడండి.. MINI Cooper SE సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ స్టార్ట్: కేవలం 40 యూనిట్లు మాత్రమే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

నిజానికి మినీ ఇండియా తన మొదటి ఎలక్ట్రిక్ కారుని 2019 లో పరిచయం చేసింది. ఆ తరువాత, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం 2021 అక్టోబర్ చివరి నుండి బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. మొత్తానికి 2022 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు రెండవ బ్యాచ్ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు కూడా మరింత వేగంగా విక్రయించబడే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #మినీ #mini
English summary
Mini cooper se electric car booking starts again features price details
Story first published: Thursday, July 7, 2022, 12:29 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X