వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పారిశ్రామిక వేత్త మరియు అత్యంత సంపన్నుడు 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) మరియు అతని కుటుంబం గురించి దాదాపు అందరికి తెలుసు. ముఖేష్ అంబానీకి ఎప్పుడూ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఈ సెక్యూరిటీలో ఎలాంటి కార్లు ఉన్నాయి, వాటి ధరలు ఎంతవరకు ఉన్నాయి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

నిజానికి ముఖేష్ అంబానీ కుటుంబం అత్యంత ఖరీదైన 'రోల్స్ రాయిస్' వంటి కార్లను వినియోగిస్తారు. అయితే అతని సెక్యూరిటీకి కూడా ఏ మాత్రం తగ్గకుండా రూ. 10 కోట్లకంటే ఎక్కువ ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో మెర్సిడెస్ బెంజ్ జి63 SUV, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, బిఎండబ్ల్యు ఎక్స్5 మరియు ఫోర్డ్ ఎండీవర్ వంటి కార్లు ఉన్నాయి.

వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

బిఎండబ్ల్యు ఎక్స్5 (BMW X5):

జర్మన్ బ్రాండ్ అయిన 'బిఎండబ్ల్యు' (BMW) యొక్క 'ఎక్స్5' కూడా సెక్యూరిటీలో 'ముఖేష్ అంబానీ'కి సేవలు అందిస్తోంది. నిజానికి ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన మొదటి ప్రీమియం SUV లలో ఒకటి ఈ బిఎండబ్ల్యు ఎక్స్5. అంతకు ముందు CRPF సిబ్బంది తమ సొంత వాహనాల్లో సెక్యూరిటీ అందించేవారు.

వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

అంబానీ కుటుంబంలో ఇప్పటికే BMW X5 XDrive30 ని కొనుగోలు చేసి, తన సెక్యూరిటీలో ఉపయోగించడం ప్రారంభించారు. X5 XDrive30 అనేది 3.0-లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది గరిష్టంగా 258 బిహెచ్‌పి పవర్ మరియు 560 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour):

'ఫోర్డ్ ఎండీవర్' కూడా అంబానీ సెక్యూరిటీలో స్థానం పొందింది. అంబానీ కాన్వాయ్ లో అనేక ఫోర్డ్ ఎండీవర్ SUV లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వైట్ కలర్ లో చాలా ఆకర్షనీయంగా ఉన్నాయి. ఫోర్డ్ ఎండీవర్ 3.2 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 197 బిహెచ్‌పి పవర్ మరియు 470 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

ప్రస్తుతం ఫోర్డ్ కంపెనీ భారతీయ మార్కెట్ నుంచి వెళ్ళిపోయింది. అయినప్పటికి ఫోర్డ్ కార్లను ఎక్కువ సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. ఈ కారణంగా ఫోర్డ్ కార్లు ఎక్కువ సంఖ్యలో భారతీయ మార్కెట్లో వినియోగంలో ఉన్నాయి.

వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యువి (Mercedes Benz G63):

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను ఉత్పత్తి చేసే కార్ తయారీ సంస్థల్లో ఒకటి జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ '(Mercedes Benz). ఈ కంపెనీ యొక్క జి63 SUV ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉంది. అయితే ఎన్ని ఉన్నాయనేది స్పష్టంగా తెలియదు. అయితే ఇప్పటికే ఒకసారి 4 కార్లు కనిపించాయి.

వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

మెర్సిడెస్ బెంజ్ జి63 ఎస్‌యువి అద్భుతమైన డిజైన్ మరియు అధునాతన పరికరాలను కలిగి ఉండటంతో పాటు మంచి పనితీరుని అందిస్తాయి. ఇందులో 3982 సిసి, వి8 బిటర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 576 బిహెచ్‌పి మరియు 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కలిగి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. ఇది ఆఫ్ రోడింగ్ కి కూడా అనుకూలంగా ఉంటుంది.

వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ (Land Rover Range Rover Vogue):

ముఖేష్ అంబానీ యొక్క సెక్యూరిటీలో అత్యంత ఖరీదైన కార్లు ఈ 'ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్' (Land Rover Range Rover Vogue). ఇవి కూడా ఎన్ని ఉన్నాయి అనేదానిమీద స్పష్టమైన సమాచారం లేదు. కానీ ఇవి కూడా చాలా సార్లు రోడ్లపైన కనిపించాయి. వీటి ధర సుమారు రూ. 2 కోట్లు నుంచి రూ. 3.5 కోట్లు వరకు ఉంది. ఇది కూడా మంచి పనితీరుని అందిస్తుంది.

వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ (Land Rover Discovery Sport):

'ల్యాండ్ రోవర్' బ్రాండ్ యొక్క మరో ఖరీదైన SUV ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉంది. అది 'డిస్కవరీ స్పోర్ట్' (Discovery Sport). ఇది కూడా దేశీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కారు. ఇవి కూడా అతని సెక్యూరిటీలో ఎన్ని ఉన్నాయనేది తెలియదు. కానీ 5 ఉన్నట్లు సమాచారం. ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ చాలా లగ్జరీ ఫీచర్స్ పొందుతుంది.

వామ్మో.. వామ్మో.. ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో ఉన్న కార్లు: అంత ఖరీదా..?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను వినియోగించే కుటుంబాలలో 'అంబానీ కుటుంభం' చెప్పుకోదగ్గది. ఇప్పటికే అంబానీ ఫ్యామిలీ మూడు కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లను వినియోగిస్తోంది. ఇది మాత్రమే కాకూండా బెంట్లీ వంటి కార్లను కూడా వినియోస్తున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మరియు ఎప్పటికప్పుడు బైకులు & కార్లను గురించి తెలుసుకోవటానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
Mukesh ambani security luxury cars details
Story first published: Wednesday, August 17, 2022, 13:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X