కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కోసం యాక్ససరీ ప్యాక్స్.. వీటితో మీ కారు అందంగా కనిపిస్తుంది..!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai), ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ కొత్త 2022 మోడల్ వెన్యూ (2022 Hyundai Venue) కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం కంపెనీ ఇప్పుడు కొత్త యాక్ససరీ ప్యాక్స్‌ను వెల్లడి చేసింది. కొత్త వెన్యూ కొనుగోలుదారులు ఈ ప్రత్యేకమైన యాక్ససరీలతో కారును మరింత ప్రీమయంగా మరియు అందంగా మార్చుకోవచ్చని కంపెనీ చెబుతోంది. కొత్త మోడల్ వెన్యూ కోసం హ్యుందాయ్ అందిస్తున్న యాక్ససరీ ప్యాక్ వివరాలు ఇలా ఉన్నాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కోసం యాక్ససరీ ప్యాక్స్.. వీటితో మీ కారు అందంగా కనిపిస్తుంది..!

సాధారణంగా మీ కొత్త కారుకు ఉపకరణాలను (యాక్ససరీలను) జోడించడం అనేది కారు కొనుగోలు అనుభవంలో ఓ భాగంగా ఉంటుంది. ఈ విషయంలో కొందరు ఆఫ్టర్ మార్కెట్లో లభించే థర్డ్ పార్టీ యాక్ససరీలను కొనుగోలు చేస్తుంటారు. అయితే, చాలా మంది తమ కారుకి సరైన యాక్సెసరీలను జోడించడం కొన్నిసార్లు కొంచెం గందరగోళానికి గురవుతూ ఉంటారు. అవసరమైన వాటిని మరియు అవసరం లేని వాటిని కొనుగోలు చేసి చేతి చమురు వదిలించుకోవడమే కాకుండా కారును వికారంగా మార్చుకుంటారు.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కోసం యాక్ససరీ ప్యాక్స్.. వీటితో మీ కారు అందంగా కనిపిస్తుంది..!

ఈ గందరగోళానికి తెర వేసేందుకు కార్ కంపెనీలే ఇప్పుడు యాక్ససరీలను ప్యాకేజ్‌ల రూపంలో అందిస్తున్నాయి. ఈ ప్యాకేజ్‌లు కస్టమర్ల అవసరాలను బట్టి డిజైన్ చేయబడి ఉంటాయి. హ్యుందాయ్ కూడా తమ 2022 మోడల్ వెన్యూ కోసం మూడు రకాల యాక్ససరీ ప్యాకేజ్‌ లను అందిస్తోంది. వీటిలో బేసిక్ ప్యాక్, అడ్వాన్స్ ప్యాక్ మరియు సుప్రీం ప్యాక్ లు ఉన్నాయి. ఇవి కొనుగోలుదారు యాక్ససరీ కొనుగోలు ప్రక్రియను చాలా సులభతరం చేస్తాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కోసం యాక్ససరీ ప్యాక్స్.. వీటితో మీ కారు అందంగా కనిపిస్తుంది..!

బేసిక్ ప్యాక్

హ్యుందాయ్ వెన్యూ 2022 మోడల్ కోసం అందిస్తున్న బేసిక్ ప్యాక్ ధర రూ. 14,943 గా ఉంది. కంపెనీ ఈ ప్యాక్‌ లో భాగంగా ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ ఇన్సర్ట్‌లు, క్రోమ్ ఇన్సర్ట్‌లు, బ్లాక్ బంపర్ కార్నర్ ప్రొటెక్టర్లు, డోర్ సిల్ గార్డ్ (టూ-టోన్), డోర్ ఎడ్జ్ గార్డ్, ఫింగర్ గార్డ్, 3డి మరియు డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్, హెడ్‌రెస్ట్ కుషన్, కార్ పెర్ఫ్యూమ్, ఒక నెక్ కుషన్, ఒక దిండు మరియు ఒక టిష్యూ బాక్స్ ను అందిస్తుంది. పేరుకి తగినట్లుగా కారులో ప్రాథమికంగా అవసరమయ్యే అన్ని వస్తువులు ఈ ప్యాకేజీలో ఉంటాయి మరియు ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కోసం యాక్ససరీ ప్యాక్స్.. వీటితో మీ కారు అందంగా కనిపిస్తుంది..!

అడ్వాన్స్ ప్యాక్

అడ్వాన్స్ ప్యాక్ ధర రూ. 21,040 గా ఉంది. కంపెనీ ఈ ప్యాకేజీలో క్రోమ్ డోర్ వైజర్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ ఇన్‌సర్ట్‌లు, క్రోమ్ విండో బెల్ట్‌లైన్, డార్క్ క్రోమ్ హెడ్‌లైట్ మరియు టెయిల్‌లైట్ గార్నిష్, డోర్ ఎడ్జ్ గార్డ్, ఫింగర్ గార్డ్, 3D ఫ్లోర్ మరియు బూట్ మ్యాట్స్, స్పోర్ట్స్ పెడల్, కార్ కవర్, హెడ్‌రెస్ట్ కుషన్, కార్ పెర్ఫ్యూమ్, టూ-టోన్ డోర్ సిల్ గార్డ్, ఒక నెక్ కుషన్, ఒక దిండు మరియు ఒక టిష్యూ బాక్స్ ను అందిస్తోంది. ఈ ప్యాక్ బూట్ వంటి ఇతర యుటిలిటీ ప్రాంతాలను మరియు కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌ని కూడా కవర్ చేస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కోసం యాక్ససరీ ప్యాక్స్.. వీటితో మీ కారు అందంగా కనిపిస్తుంది..!

సుప్రీం ప్యాక్

ఇది హ్యుందాయ్ వెన్యూ కోసం అందించబడుతున్న ప్రీమియం యాక్ససరీ ప్యాకేజ్. ఈ సుప్రీం ప్యాక్ ధర రూ. 39,339 గా ఉంది. ఈ ప్యాక్‌లో క్రోమ్ ఇన్సర్ట్‌తో కూడిన డోర్ వైజర్, క్రోమ్ విండో బెల్ట్‌లైన్, సైడ్ స్టెప్, డార్క్ క్రోమ్ సైడ్ మిర్రర్స్, హెడ్‌లైట్ మరియు టెయిల్‌లైట్ గార్నిష్, డోర్ సిల్ గార్డ్ (టూ-టోన్), డోర్ ఎడ్జ్ గార్డ్, ఫింగర్ గార్డ్, స్పోర్ట్స్ పెడల్ కవర్, ఫ్లోర్ మరియు బూట్ మ్యాట్స్, హెడ్‌రెస్ట్ కుషన్, కార్ పెర్ఫ్యూమ్, ఒక నెక్ కుషన్, ఒక దిండు మరియు టిష్యూ బాక్స్ మొదలైనవి లభిస్తాయి. ఈ సుప్రీం ప్యాక్ ఖరీదైనదిగా అనిపించినప్పటికీ, ఇది కొత్త 2022 వెన్యూ కి సంబంధించిన అన్ని అవసరమైన వస్తువులు మరియు కాస్మెటిక్ యాక్ససరీలను కవర్ చేస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కోసం యాక్ససరీ ప్యాక్స్.. వీటితో మీ కారు అందంగా కనిపిస్తుంది..!

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ వేరియంట్లు, ధరలు

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ (2022 Hyundai Venue) విషయానికి వస్తే, ఇది పాత మోడల్ తో పోలిస్తే రిఫ్రెష్డ్ డిజైన్ మరియు రివైజ్డ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దేశీయ విపణిలో ఈ కొత్త హ్యుందాయ్ వెన్యూ మూడు రకాల ఇంజన్లతో లభిస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి వాటి ప్రారంభ ధరలు ఇలా ఉంటాయి:

*2022 వెన్యూ 1.2 లీటర్ పెట్రోల్ (ఎమ్‌టి) - రూ.7.53 లక్షలు

*2022 వెన్యూ 1.0 లీ టర్బో పెట్రోల్ (ఐఎమ్‌టి) - రూ.9.99 లక్షలు

*2022 వెన్యూ 1.5 లీటర్ డీజిల్ (ఎమ్‌టి) - రూ.9.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కోసం యాక్ససరీ ప్యాక్స్.. వీటితో మీ కారు అందంగా కనిపిస్తుంది..!

కంపెనీ ఈ కొత్త 2022 మోడల్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసింది. వీటిలో ముందు వైపు పెద్ద పారామెట్రిక్ జ్యువెల్ గ్రిల్, స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో కూడిన కొత్త ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, బానెట్ క్రింది భాగంలో ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు మరియు సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్మోక్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, బంపర్ క్రింది భాగంలో సిల్వర్ స్కఫ్ ప్లేట్, వెనుక వైపు కొత్త L-ఆకారపు ర్యాప్‌రౌండ్ ఎల్ఈడి టెయిల్ లైట్లు మరియు ఈ రెండు టెయిల్ ల్యాంప్స్ ను కలుపుతూ పోయే సన్నటి ఎల్ఈడి లైట్ స్ట్రిప్, రీప్రొఫైల్ చేయబడిన రియర్ బంపర్, కొత్త 16 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ మొదలైన మార్పులు ఉన్నాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కోసం యాక్ససరీ ప్యాక్స్.. వీటితో మీ కారు అందంగా కనిపిస్తుంది..!

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో ప్రధానంగా లభించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్రైవ్ మోడ్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్, అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌తో కూడిన హోమ్ టు కార్ ఫంక్షన్, 10 ప్రాంతీయ భాషలతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మెనూ, 60 కి పైగా బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్లు, 360-డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, రిక్లైనింగ్ రియర్ సీట్లు మొదలైనవి చాలానే ఉన్నాయి. - పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
New 2022 hyundai venue accessory pack details revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X