Just In
- 31 min ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 1 hr ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 3 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
- 4 hrs ago
సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!
Don't Miss
- Sports
India Playing XI vs ZIM 1st ODI: రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! ఇసాన్ కిషన్ డౌట్!
- Technology
ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్వేర్ అప్డేట్ని పిక్సెల్ ఫోన్ల కోసం విడుదల చేసిన గూగుల్...
- News
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రఘాతుకం.. యాపిల్ తోటలో కాశ్మీరీ పండిట్ హత్య, సోదరుడికి తీవ్రగాయాలు
- Movies
Sita Ramam 11 Days Collections: ఫస్ట్ డే రేంజ్ లో 11వ రోజు కలెక్షన్స్.. మొత్తం ప్రాఫిట్ ఎంతంటే?
- Finance
SBI: ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు.. ఆ కస్టమర్లకు నెలకు మూడుసార్లు.. 10 రకాల సేవలు ఉచితంగా..
- Lifestyle
Exercise and Sleep: నిద్రపై వ్యాయామ ప్రభావం.. పడుకునే ముందు చేయవచ్చా?
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
కొత్త 2022 కియా సెల్టోస్ టెలివిజన్ కమర్షియల్ రిలీజ్.. ఇది భారత మార్కెట్లో విడుదలయ్యేనా?
కొరియన్ ఆటోమొబైల్ బ్రాండ్ కియా (Kia) విక్రయిస్తున్న సెల్టోస్ (Seltos) ఎస్యూవీ ఇప్పుడు సరికొత్త అవతారంలో మన ముందుకు రాబోతోంది. కియా తమ సెల్టోస్ ఎస్‌యూవీని భారత మార్కెట్లోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తోంది. ఈ మిడ్-సైజ్ ఎస్యూవీ మనదేశంలో మాదిరిగానే విదేశీ మార్కెట్లలో కూడా మంచి ప్రాచుర్యం పొందింది. కియా తమ సెల్టోస్‌కి మరింత బూస్ట్ ఇచ్చేందుకు ఇప్పుడు ఈ ఎస్యూవీ కొత్తగా అప్‌గ్రేడ్ చేసింది. రిఫ్రెష్డ్ డిజైన్ మరియు సరికొత్త ఫీచర్లతో రూపుదిద్దుకున్న కొత్త 2022 కియా సెల్టోస్ త్వరలోనే మార్కెట్లోకి రానుంది.

గ్లోబల్ మార్కెట్లను ఉద్దేశించి కియా తయారు చేసిన కొత్త 2022 కియా సెల్టోస్ (2022 Kia Seltos) ఎస్‌యూవీకి సంబంధించిన టెలివిజన్ కమర్షియల్ (TVC)ని కంపెనీ తాజాగా విడుదల చేసింది. కొత్త టీజర్ వీడియో రాబోయే ఫేస్‌లిఫ్టెడ్ సెల్టోస్ ఎస్యూవీ గురించి అనేక వివరాలను వెల్లడిస్తుంది. కియా ఇండియా త్వరలో ఈ అప్డేట్ చేయబడిన మోడల్‌ను భారతదేశంలో ప్రవేశపెడుతుందని మేము ఆశిస్తున్నాము.

ముందుగా కొత్త 2022 కియా సెల్టోస్ ఎక్స్టీరియర్ డిజైన్ ను గమనిస్తే, ఈ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ఇప్పుడు మరింత ప్రీమియం మరియు ఇతర అంతర్జాతీయ మోడళ్లకు అనుగుణంగా కనిపిస్తుంది. కొత్త 2022 కియా సెల్టోస్ ఎస్యూవీ ముందు భాగంలో ప్రధానంగా గుర్తించదగిన మార్పులు ఏమిటంటే, ఇంందులోని కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, చతురస్రాకారపు ఫ్రంట్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్‌లతో కూడిన రీప్రొఫైల్డ్ ఫ్రంట్ బంపర్, కొత్త ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు కొత్త ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్.

కొత్త 2022 కియా సెల్టోస్ యొక్క ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ దాని అవుట్గోయింగ్ మోడల్ తో దాదాపు సమానంగా ఉన్నందున, సైడ్ డిజైన్ లో మార్పులు చాలా తక్కువగా కనిపిస్తాయి. అయితే, ఇక్కడ కొత్త 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆసక్తికరంగా కనిపిస్తాయి మరియు ఇవి సెల్టోస్ యొక్క స్పోర్టీ క్యారెక్టర్‌ను కూడా పెంచడంలో సహకరిస్తాయి. ఇక వెనుక డిజైన్ ను గమనిస్తే, కొత్త కియా సెల్టోస్ ఇప్పుడు మరింత ప్రముఖంగా కనిపించే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్‌లను కలిగి ఉంటుంది, ఇవి కొంచెం దిగువకు విస్తరించి ఉంటాయి.

అలాగే, వెనుకవైపు ఉన్న ఎల్ఈడి లైట్ బార్ రెండు టెయిల్ ల్యాంప్‌లను కలుపుతునట్లుగా ఉంటుంది. ఈ లైట్ బార్ ఇప్పుడు మధ్యలో కొత్త కియా లోగోను కలిగి ఉంటంది మరియు సెల్టోస్ యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌లోని ఎగ్జాస్ట్ టిప్స్ వెనుక బంపర్ కింద చక్కగా ఉంచబడినట్లు కనిపిస్తాయి. ఇంటీరియర్ లో కూడా మంచి అప్ మార్కెట్ ఫీల్ ను అందించే మార్పులు చేయబడ్డాయి.

కొత్త 2022 కియా సెల్టోస్‌లో ట్యాన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో కూడిన క్యాబిన్ లేఅవుట్ ఉంటుంది. ఇంకా ఇందులో లెదర్‌తో కవరే చేయబడిన డ్యాష్‌బోర్డ్, రెండు పెద్ద 10.25 ఇంచ్ స్క్రీన్లు (ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం, మరొకటి అప్డేట్ చేయబడిన ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ కోసం), రోటరీ-స్టైల్ గేర్ సెలెక్టర్ నాబ్ మరియు కొత్త స్విచ్ గేర్ లేఅవుట్ మొదలైనవి ప్రధానంగా గమనించవచ్చు.

అలాగే, అప్డేట్ చేయబడిన 2022 కియా సెల్టోస్ ఎస్‌యూవీలో కంపెనీ గ్లోబల్ మార్కెట్ల కోసం అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఈ ఫీచర్లలో ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC), యాక్టివ్ లేన్ అసిస్టెన్స్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, డ్రౌవర్ డ్రౌజీనెస్ అలెర్ట్ వంటి యాక్టివ్ సేఫ్టీ సిస్టమ్‌లతో కూడిన అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ కారులోని ఇతర గుర్తించదగిన ఫీచర్లలో 8 స్పీకర్లతో కూడిన BOSE ప్రీమియం ఆడియో సిస్టమ్, హెడ్స్-అప్ డిస్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్, వైర్లెస్ Apple CarPlay మరియు Android Auto కనెక్టివిటీ, బ్రాండ్ యొక్క లేటెస్ట్ యువో కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా మొదలైనవి చాలానే ఉండనున్నాయి.

కియా తమ ఇంటర్నేషనల్ వెర్షన్ సెల్టోస్ ఎస్‌యూవీలో 2.0-లీటర్ న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను మరియు మరింత శక్తివంతమైన 1.6-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను అందిస్తోంది. కాగా, భారత మార్కెట్ విషయానికి వస్తే, కంపెనీ దీని తయారీ ఖర్చును అదుపులో ఉంచేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న అవే మూడు ఇంజన్ ఆప్షన్లను కొనసాగించే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో కియా సెల్టోస్ ప్రస్తుతం 113bhp గరిష్ట శక్తిని మరియు 144Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5-లీటర్ న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా సివిటి లేదా ఐఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అలాగే, ఇందులో 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఈ యూనిట్ గరిష్టంగా 138 బిహెచ్పి శక్తిని మరియు 242 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డిసిటి లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

ఇక మూడవ ఇంజన్ ఆప్షన్ 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ యూనిట్. ఇది గరిష్టంగా 113 బిహెచ్పి గరిష్ట శక్తిని మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లు ఉన్నాయి. కియా కొత్త పెట్రోల్-హైబ్రిడ్ యూనిట్‌కు అనుకూలంగా ఓ ఇంజన్‌ను తీసుకురావచ్చని, ఆ తర్వాత ఈ 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను నిలిపివేయవచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, భారత మార్కెట్లో డీజిల్ కార్లకు ఇంకా గిరాకీ ఉన్న నేపథ్యంలో, కంపెనీ ఆ పని చేయకపోవచ్చని తెలుస్తోంది.