"పెద్ద నాన్న" తిరిగొచ్చేశాడు.. ఇంకేం దిగుల్లేదని చెప్పండి..! పాత స్కార్పియో రీ-ఎంట్రీ, వేరియంట్ల వారీగా లభించే

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలే తమ కొత్త తరం (New Gen Mahindra Scorpio-N) ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసినదే. ఈ కొత్త స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీని అందరూ ఇష్టపడుతున్నప్పటికీ, పాత తరం స్కార్పియో (Old Gen Scorpio)ని ద్వేషించే వారు మాత్రం ఎవ్వరూ లేరు.

Recommended Video

దేశీయ మార్కెట్లో 'Scorpio Classic' ఆవిష్కరించిన Mahindra | వివరాలు

ఈ పాత మోడల్ స్కార్పియోకి ఇప్పటికీ అదే క్రేజ్ మరియు అంతే డిమాండ్ ఉంది. కాబట్టి, మహీంద్రా కూడా పాత స్కార్పియో ప్రేమికులను నిరుత్సాపరచడం ఇష్టం లేక, ఇదే మోడల్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్ (2022 Mahindra Scorpio Classic) పేరుతో రీలాంచ్ చేయనుంది.

ఎస్‌యూవీలు అన్నింటికీ 'పెద్ద నాన్న' (Big Daddy Of SUVs) పరిగణించబడే పాత మహీంద్రా స్కార్పియో ఇప్పుడు కొత్త పేరుతో తిరిగి మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా తమ స్కార్పియో క్లాసిక్ ను ఇటీవలే ఆవిష్కరించింది. ఈ సందర్భంగా, కంపెనీ స్కార్పియో క్లాసిక్ యొక్క వేరియంట్లను మరియు వేరియంట్ల వారీగా లభించే ఫీచర్ల వివరాలను కూడా వెల్లడి చేసింది. కొత్త స్కార్పియో క్లాసిక్ ఎస్‌యూవీ కంపెనీ ఇటీవలే విడుదల చేసిన స్కార్పియో-ఎన్ ఎస్‌యూవీతో పాటుగా విక్రయించనున్నారు.

కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ను కంపెనీ ఆగస్టు 20, 2022వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మోడల్‌ను ప్రస్తుత మహీంద్రా స్కార్పియో-ఎన్‌తో పాటుగా విక్రయించనున్నారు. స్కార్పియో క్లాసిక్ విషయంలో ఎక్స్‌క్లూజివిటీ మెయింటైన్ చేయడం మరియు కస్టమర్లను గందరగోళానికి గురికాకుండా చేయడం కోసం కంపెనీ ఈ ఎస్‌యూవీని కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే విక్రయించనుంది. కంపెనీ వెల్లడించిన దాని ప్రకారం, మహీంద్రా స్కార్పియో క్లాసిక్ S మరియు S11 అనే రెండు వేరియంట్‌లలో లభ్యం కానుంది. వీటి ధరలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, ఆయా వేరియంట్లలో అందించే ఫీచర్లను మాత్రం కంపెనీ తెలియజేసింది.

1. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్ ఫీచర్లు

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్ బేస్ వేరియంట్‌గా ఉండబోతోంది. ఈ వేరియంట్లో పెయింట్ చేయని బంపర్లు, బ్లాక్ క్లాడింగ్, నిలువుగా అమర్చిన ఎల్ఈడి టెయిల్‌లైట్లు, 17 ఇంచ్ స్టీల్ వీల్స్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, వినైల్ అప్‌హోలెస్ట్రీ, టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్ మొదలైన ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇంకా ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు సీట్-బెల్ట్ రిమైండర్ సిస్టమ్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

2. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్11 ఫీచర్లు

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్11 ఈ మోడల్‌లో టాప్-ఎండ్ వేరియంట్‌గా ఉంటుంది. ఈ వేరియంట్‌లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ లైట్లు, కొత్త 17 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, సైడ్ ఫుట్‌స్టెప్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, పెయింట్ చేయబడిన బంపర్లు, డ్యూయల్-టోన్ క్లాడింగ్, కొత్త ఫాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ మరియు ఎత్తు-సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

అంతేకాకుండా, ఈ వేరియంట్ లో ముందు మరియు వెనుక ఆర్మ్-రెస్ట్‌లు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్లు, వెనుక వైపర్ మరియు వాషర్, క్రూయిజ్ కంట్రోల్ మరియు గేర్ షిఫ్ట్ ఇండికేటర్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇందులోని S వేరియంట్ మధ్య వరుసలో బెంచ్ సీటుతో 7-సీట్లు మరియు 9-సీట్ల కాన్ఫిగరేషన్ తో లభిస్తుంది. కాగా, S11 వేరియంట్ మధ్య వరుసలో కెప్టెన్ సీట్లతో 7-సీట్ కెప్టెన్ సీట్స్ మరియు 7-సీట్ సైడ్ ఫేసింగ్ సీట్స్ ఆప్షన్‌తో లభిస్తుంది.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎక్స్టీరియర్ డిజైన్‌ను గమనిస్తే, ఇది పాత మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే, దీని ముందు భాగంలో బ్లాక్ మరియు క్రోమ్ ఫినిషింగ్ తో కూడిన కొత్త గ్రిల్‌, బంపర్ క్రింది భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్ మరియు ముందు భాగంలో మహీంద్రా యొక్క కొత్త ట్విన్ పీక్స్ లోగో వంటి మార్పులు కనిపిస్తాయి. ప్ంట్ బానెట్‌పై లైన్‌లు మరియు క్రీజ్‌లు ఇప్పుడు చాలా ప్రముఖంగా కనిపిస్తాయి మరియు ఇవి ఎస్‌యూవీ మరింత బలమైన రూపాన్ని తెచ్చిపెడుతాయి.

స్కార్పియో క్లాసిక్ వెనుక భాగంలో వెనుక టెయిల్ లైట్లు రెండు వైపులా నిలువుగా అమర్చబడి ఉంటాయి. అలాగే, వెనుక వైపు కూడా మధ్యలో మహీంద్రా యొక్క కొత్త లోగో కనిపిస్తుంది. ఇందులో రూఫ్ రెయిల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్లను కూడా పొందుతుంది. స్కార్పియో క్లాసిక్ కస్టమర్ చాయిస్ ను బట్టి 7-సీట్ల నుండి 9-సీట్ల కాన్ఫిగరేషన్ లలో లభిస్తుంది. పెరిగిన సీటింగ్ సామర్థ్యం కోసం కంపెనీ దీని సస్పెన్షన్ సెటప్ ను కూడా సర్దుబాటు చేసింది. ఇప్పుడు దీని వెనుక భాగంలో హైడ్రాలిక్ డబుల్ యాక్టింగ్ మరియు టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌లు అమర్చబడ్డాయి మరియు అన్ని చక్రాలపై 235/65 R17 ప్రొఫైల్ ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ లో కంపెనీ చేసిన మార్పుల చేర్పుల కారణంగా దీని వెయిట్ కూడా భారీగా తగ్గింది. ఫలితంగా ఇందులోని ఇంజన్ మునుపటి కన్నా 14 శాతం అధికంగా ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ఈ ఎస్‌యూవీలోని 2.2-లీటర్, టర్బో-డీజిల్, ఎమ్‌హాక్ ఇంజన్‌ గరిష్టంగా 132 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారులో 60-లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New 2022 mahindra scorpio classic variant wise features revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X