కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) యాక్ససరీస్ వివరాలు వెల్లడి

ఎస్‌యూవీలన్నింటికీ బిగ్ డాడీగా పిలువబడే మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio)లో కంపెనీ నిన్న (జూన్ 27న) ఓ కొత్త తరం మోడల్ ని మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్లు మరియు కొత్త పేరుతో వచ్చిన 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ కోసం కంపెనీ ఇప్పుడు యాక్ససరీల జాబితాను కూడా వెల్లడి చేసింది. ఈ అదనపు యాక్ససరీల సాయంతో కస్టమర్లు తమ స్కార్పియోని మరింత అందంగా మరియు స్పోర్టీగా తీర్చిదిద్దుకోవచ్చని కంపెనీ తెలిపింది.

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) యాక్ససరీస్ వివరాలు వెల్లడి

భారత మార్కెట్లో కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ప్రస్తుతానికి కంపెనీ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడి చేసింది. కొత్త స్కార్పియో-ఎన్ ఆటోమేటిక్ వేరియంట్ ధరలను జూలై 21న వెల్లడి చేయనుంది. భారత మార్కెట్లో కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ కోసం బుకింగ్‌లు జూలై 30, 2022వ తేదీ నుండి ప్రారంభమవుతాయి మరియు డెలివరీలు పండుగ సీజన్‌లో జరుగుతాయని కంపెనీ తెలిపింది.

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) యాక్ససరీస్ వివరాలు వెల్లడి

క్రోమ్ ప్యాక్

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ కోసం కంపెనీ అందిస్తున్న క్రోమ్ ప్యాక్‌లో, హెడ్‌లైట్, డోర్ హ్యాండిల్, ఫ్రంట్ అప్పర్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్, వీల్ ఆర్చ్‌లు మరియు అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ కోసం క్రోమ్‌ యాక్సెంట్స్ ను అందిస్తోంది. సైడ్ మరియు రియర్ ప్రొఫైల్స్ లో టెయిల్‌గేట్, టెయిల్ లైట్, డోర్ హ్యాండిల్ మరియు డోర్ క్లాడింగ్‌పై కూడా క్రోమ్ గార్నిష్ ఉంటుంది. కస్టమర్లు కావాలనుకుంటే దీనిని పూర్తి ప్యాక్‌గా నైనా కొనుగోలు చేయవచ్చు లేదా వీటిలో తమకు నచ్చిన వాటిని మాత్రమే విడిగా కొనుగోలు చేయవచ్చు.

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) యాక్ససరీస్ వివరాలు వెల్లడి

వెనుక బంపర్ కోసం కంపెనీ ఓ బంపర్ ప్రొటెక్టర్ ను కూడా అందిస్తోంది. కస్టమర్లు దీనిని ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ మరియు అల్యూమినియం మెటీరియల్స్ నుండి ఎంచుకోవచ్చు. మహీంద్రా దిగువ ట్రిమ్స్ కోసం స్టీల్ వీల్స్ మరియు అధిక ట్రిమ్‌ల కోసం డైమండ్ కట్ 17 ఇంచ్ లేదా 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ను కూడా అందిస్తుంది. అదే సమయంలో, స్టీల్ వీల్స్ ను రక్షించడానికి కంపెనీ వాటికి వీల్ కవర్లను కూడా అందిస్తుంది. వీటికి అదనంగా కారు బాడీ కవర్ ను కూడా కస్టమర్లు మహీంద్రా నుండి కొనుగోలు చేయవచ్చు.

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) యాక్ససరీస్ వివరాలు వెల్లడి

ఇంటీరియర్ యాక్ససరీస్

కొత్త 2022 స్కార్పియో-ఎన్ కోసం కంపెనీ అందిస్తున్న ఇంటీరియర్ యాక్ససరీలలో భాగంగా సీట్ కవర్లు ఉంటాయి. ఇందులో రెండు కంఫర్ట్ కిట్ ఇంపోజింగ్ థీమ్‌లు మరియు అపరిమిత థీమ్‌లు ఉన్నాయి. కస్టమర్లు థీమ్‌ల నుండి వివిధ రకాల మోడళ్లు మరియు కలర్ ఆప్షన్ల నుండి ఎంచుకోవచ్చు. నో లిమిట్ థీమ్‌లో నిజంగా పరిమితి ఉండదు. మహీంద్రా ఈ ప్యాక్ కింద వివిధ రకాల మెటీరియల్స్ మరియు విభిన్న కలర్స్ ను అందిస్తోంది, తద్వారా కస్టమర్ తనకు నచ్చిన సీట్ కవర్‌ను ఎంచుకోవచ్చు.

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) యాక్ససరీస్ వివరాలు వెల్లడి

ఇంకా ఈ కారు కోసం ఫ్లోర్ మ్యాట్స్ మరియు యాంటీ-స్కిడ్ మ్యాట్‌లను కూడా యాక్ససరీలుగా అందిస్తున్నారు. ఫ్లోర్ మ్యాట్‌లలో డిజైనర్ మ్యాట్‌లు, 7డి ఫ్లోర్ మ్యాట్స్, పియానో ​​బ్లాక్ కార్పెట్ మ్యాట్స్, 3డి ఫ్లోర్ మ్యాట్స్ మరియు ప్రింటెడ్ కార్పెట్ ఫ్లోర్ మ్యాట్‌లు ఉన్నాయి. స్కఫ్ ప్లేట్స్ కోసం కూడా యాక్ససరీలు ఉన్నాయి. వినియోగదారులు అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ మెటీరియల్స్ లో తమకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. దీనితో పాటు, సన్‌షేడ్ మరియు స్పోర్టీ పెడల్స్ యాక్ససరీలు కూడా ఉన్నాయి.

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) యాక్ససరీస్ వివరాలు వెల్లడి

కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ గురించి క్లుప్తంగా..

మహీంద్రా స్కార్పియో-ఎన్ Z2, Z4, Z6, Z8 మరియు Z8L అనే ఐదు ట్రిమ్ లలో 2-వీల్ డ్రైవ్ మరియు 4-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో 6-సీటర్ మరియు 7-సీటర్ ఎంపికలతో విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఒక పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. కేవలం డీజిల్ ఇంజన్ వేరియంట్లు మాత్రమే 4 వీల్ డ్రైవ్ ఎంపికను కలిగి ఉంటాయి. కంపెనీ ఈ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్ కు ఫోర్ఎక్స్‌ప్లోర్ (4XPLOR) అనే పేరును పెట్టింది మరియు ఇది ఎలక్ట్రిక్ షిఫ్ట్-ఆన్-ది-ఫ్లై 4వీల్ డ్రైవ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది.

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) యాక్ససరీస్ వివరాలు వెల్లడి

మహీంద్రా 4XPLOR యొక్క ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో ఎంచుకోదగిన టెర్రైన్ మోడ్‌లతో కూడిన ఇంటెలిజెంట్ 4x4 సిస్టమ్ ఉంటుంది. అలాగే, ఇది జిప్, జాప్, జూమ్ అనే డ్రైవ్ మోడ్‌లను మరియు మెకానికల్ మరియు బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ ను సపోర్ట్ చేస్తుంది. ఇక ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులోని డీజిల్ ఇంజన్ 175 పిఎస్ శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. కాగా, పెట్రోల్ ఇంజన్ 203 పిఎస్ శక్తిని మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. - స్కార్పియో-ఎన్ పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
New 2022 mahindra scorpio n accessories revealed
Story first published: Tuesday, June 28, 2022, 12:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X