మహీంద్రా స్కార్పియో-ఎన్ (2022 Mahindra Scorpio-N) యొక్క పవర్‍‌ట్రైన్ ఆప్షన్స్ వెల్లడి

మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త ఎస్‌యూవీ స్కార్పియో-ఎన్ కు సంబంధించి కంపెనీ ఎప్పటికప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ వస్తోంది. తాజాగా, ఈ ఎస్‌యూవీకి సంబంధించిన పవర్‌ట్రైన్ ఆప్షన్స్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్స్ వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. ఓ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు పోస్ట్ చేసిన ప్రశ్నకు సమాధానంగా రాబోయే స్కార్పియో-ఎన్ వివరాలను కంపెనీ ధృవీకరించింది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (2022 Mahindra Scorpio-N) యొక్క పవర్‍‌ట్రైన్ ఆప్షన్స్ వెల్లడి

ఇన్‌స్టాగ్రామ్ లో ఓ యూజర్ "ఇది (స్కార్పియో-ఎన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 4x4 వస్తుందా" అనే ప్రశ్నను పోస్ట్ చేసారు. దీనికి సమాధానంగా, రాబోయే మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో "సరికొత్త స్కార్పియో-ఎన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్స్, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ మరియు 2WD (2-వీల్ డ్రైవ్), 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) ఆప్షన్లతో అందించబడుతుంది" అని సమాధానం ఇచ్చారు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (2022 Mahindra Scorpio-N) యొక్క పవర్‍‌ట్రైన్ ఆప్షన్స్ వెల్లడి

అంతే కాకుండా, రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్ ఆఫ్-రోడ్ మోడ్‌లతో పాటు 4-హై మరియు 4-లో గేర్ నిష్పత్తులను కూడా పొందుతుందని అధికారికంగా వెల్లడించిన చిత్రాలు ధృవీకరిస్తున్నాయి. ఇంతకుముందు లీక్ అయిన పత్రాల ప్రకారం, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మహీంద్రా యొక్క ట్రేడ్‌మార్క్ చేసిన '4Xplore' ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌లో భాగంగా ఉంటుంది మరియు ఇది నాలుగు ప్రీ-సెట్ మోడ్‌లతో వస్తుంది. వీటిలో రఫ్, స్నో, మడ్ మరియు వాటర్ మోడ్స్ ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (2022 Mahindra Scorpio-N) యొక్క పవర్‍‌ట్రైన్ ఆప్షన్స్ వెల్లడి

అలాగే, కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క ఆల్-వీల్-డ్రైవ్ వెర్షన్‌ యోక్క ఆఫ్-రోడ్ పరాక్రమాన్ని మరింత మెరుగుపరచడానికి దీనిని లాక్ చేయగల రియర్ డిఫరెన్షియల్‌తో అమర్చినట్లు లీక్ అయిన పత్రాలు వెల్లడిస్తున్నాయి. పవర్‌ట్రెయిన్ ఎంపికల విషయానికి వస్తే, రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఒక పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజన్‌తో వస్తుందని సమాచారం.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (2022 Mahindra Scorpio-N) యొక్క పవర్‍‌ట్రైన్ ఆప్షన్స్ వెల్లడి

ఇందులోని 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 172 బిహెచ్‌పి శక్తిని మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన వేరియంట్‌లో 370 ఎన్ఎమ్ టార్క్ ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ (గేర్‌బాక్స్) విషయానికి వస్తే, మహీంద్రా స్కార్పియో ఎన్‌లోని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ రూపంలో ఉంటుంది. కాగా, ఇందులోని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రం 6-స్పీడ్ యూనిట్ గా ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (2022 Mahindra Scorpio-N) యొక్క పవర్‍‌ట్రైన్ ఆప్షన్స్ వెల్లడి

ఇక పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ లో 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పి పవర్ ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతుంది. గతంలో లీకైన ఓనర్ మాన్యువల్ ప్రకారం, రాబోయే మహీంద్రా స్కార్పియో-ఎన్ 4,662 మిమీ పొడవు, 1,917 మిమీ వెడల్పు, 1,870 మిమీ ఎత్తు మరియు 2,750 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (2022 Mahindra Scorpio-N) యొక్క పవర్‍‌ట్రైన్ ఆప్షన్స్ వెల్లడి

సీటింగ్ ఆప్షన్స్ విషయానికి వస్తే, రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ 2+2+2 (6 సీటర్) లేదా 2+2+3 సీటింగ్ (7 సీటర్) ఆప్షన్లతో అందించబడుతుంది. ఇందులో మొదటిది 50:50 స్ప్లిట్ సీట్లు మరియు రెండోది 60:40 స్ప్లిట్ సీట్లను పొందుతుంది. మహీంద్రా ఇటీవలే రాబోయే కొత్త స్కార్పియో N యొక్క ఇంటీరియర్ చిత్రాలను కూడా వెల్లడించింది. ఈ చిత్రాలు రాబోయే 3-వరుసల ఎస్‌యూవీలో అనేక ఫీచర్లను వెల్లడి చేస్తాయి. కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ మంచి ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ మరియు బ్లాక్ లెదర్ సీట్లు పొందుతుంది.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (2022 Mahindra Scorpio-N) యొక్క పవర్‍‌ట్రైన్ ఆప్షన్స్ వెల్లడి

రాబోయే కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క అధికారిక అంతర్గత చిత్రాల ప్రకారం, ఈ పెద్ద ఎస్‌యూవీలో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్స్, సోనీ స్పీకర్ సెటప్, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, ఆఫ్-రోడ్ కోసం రోటరీ డయల్, డ్రైవ్ సెలక్టర్ మోడ్స్ మరియు ఎలక్ట్రిక్ రూఫ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయని వెల్లడిస్తున్నాయి.

మహీంద్రా స్కార్పియో-ఎన్ (2022 Mahindra Scorpio-N) యొక్క పవర్‍‌ట్రైన్ ఆప్షన్స్ వెల్లడి

ఈ ఫీచర్లే కాకుండా, రాబోయే మహీంద్రా స్కార్పియో-ఎన్ లో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, బహుళ USB పోర్ట్‌లు, ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. అయితే, కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 వలె కాకుండా, రాబోయే కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)తో అందించబడదని తెలుస్తోంది.

Most Read Articles

English summary
New 2022 mahindra scorpio n will get 4wd powertrain options officially confirmed
Story first published: Saturday, June 18, 2022, 13:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X