మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్న 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా.. హైబ్రిడ్ వేరియంట్స్ కూడా..

మారుతి సుజుకి (Maruti Suzuki) నుండి రాబోయే తర్వాతి కొత్త మోడల్ 2022 విటారా బ్రెజ్జా (2022 Vitara Brezza). కొత్తగా వచ్చిన 2022 హ్యుందాయ్ వెన్యూకి పోటీగా రాబోతున్న ఈ కొత్త మోడల్ గురించి తాజాగా మరో కొత్త సమాచారం లీకైంది. ఇటీవల లీక్ అయిన పత్రాల ప్రకారం, రాబోయే 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మొత్తం 10 వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది మరియు హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా కలిగి ఉంటుంది. జూన్ 30న ఇది అధికారికంగా మార్కెట్లో విడుదల కానుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి.

మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్న 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా.. హైబ్రిడ్ వేరియంట్స్ కూడా..

తాజా పత్రాల ప్రకారం, కొత్త 2022 విటారా బ్రెజ్జా ఎస్‌యూవీ 7 మాన్యువల్ వేరియంట్‌లు మరియు 3 ఆటోమేటిక్ వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. ఈ మాన్యువల్ వేరియంట్‌లలో LXI, LXI (O), VXI, VXI (O), ZXI, ZXI (O), మరియు ZXI+ ఉన్నాయి. కాగా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో ఇది VXI, ZXI మరియు ZXI+ ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉండనుంది. అలాగే, ఈ లీక్ అయిన పత్రాలు రాబోయే 2022 విటారా బ్రెజ్జా ఎస్‌యూవీ యొక్క వివిధ స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించాయి.

మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్న 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా.. హైబ్రిడ్ వేరియంట్స్ కూడా..

ఈ పత్రాల ప్రకారం, కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో అదే K15C నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. అంటే ఇంజన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టమవుతోంది. కంపెనీ ఇదే ఇంజన్‌ను ఇటీవలే అప్‌డేట్ చేసిన కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్‌పివిలో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ కూడిన 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ మరియు ఇది మొత్తంగా 104.6 బిహెచ్‌పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్న 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా.. హైబ్రిడ్ వేరియంట్స్ కూడా..

కాగా, ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ మాత్రమే దాదాపు 3 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ యధావిధిగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కాగా, దీని ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లోనే పెద్ద మార్పు ఉండబోతోంది. కంపెనీ తమ కొత్త ఎర్టిగాలో పరిచయం చేసిన అదే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా ఉపయోగించనున్నారు. ఇది మునుపటి 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానాన్ని భర్తీ చేస్తుంది.

మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్న 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా.. హైబ్రిడ్ వేరియంట్స్ కూడా..

కొలతల పరంగా చూస్తే, కొత్త 2022 విటారా బ్రెజ్జా 3,995 మిమీ పొడవు, 1,790 మిమీ వెడల్పు మరియు 1,685 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఎస్‌యూవీ యొక్క వీల్‌బేస్ 2,500 మిమీ గా ఉంటుంది. దీని ఆటోమేటిక్ వేరియంట్ స్థూల వాహనం బరువు 1,680 కేజీలుగా ఉంటే, మాన్యువల్ వెర్షన్ బరువు ఆటోమేటిక్ వేరియంట్ కన్నా 40 కేజీల తక్కువగా ఉంటుంది. అలాగే, ఈ లీకైన పత్రాలు 2022 బ్రెజ్జా ఎస్‌యూవీని గుర్గావ్ మరియు మానేసర్‌లోని ప్లాంట్ లో తయారు చేయనున్నట్లు వెల్లడిస్తున్నాయి.

మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్న 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా.. హైబ్రిడ్ వేరియంట్స్ కూడా..

కొత్త 2022 విటారా బ్రెజ్జా కోసం ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభించబడ్డాయి, ఆసక్తిగల కస్టమర్లు రూ.11,000 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కొత్త 2022 బ్రెజ్జా దాని పాత మోడల్ తో పోలిస్తే వివిధ డిజైన్ మరియు ఫీచర్ మార్పులను కలిగి ఉంటుంది. ఈ కొత్త మోడల్ లోని ఎక్స్టీరియర్ ఫీచర్లలో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్‌లతో కూడిన కొత్త ట్విన్-పాడ్ ఎల్ఈడి హెడ్‌లైట్లు, క్రోమ్ ఫినిషింగ్‌తో కూడిన కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త టెయిల్ ల్యాంప్స్, రివైజ్డ్ ఫాగ్ ల్యాంప్ యూనిట్లు, ముందు భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్, కొత్త 16 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, చంకియర్ బ్లాక్ క్లాడింగ్ వంటి మరికొన్ని కొత్త డిజైన్ ఎలిమెంట్స్‌ ఉన్నాయి.

మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్న 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా.. హైబ్రిడ్ వేరియంట్స్ కూడా..

అలాగే, కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఇంటీరియర్‌లో కూడా అనేక మార్పులు ఉన్నాయి. ఇందులో రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, అప్‌డేట్ చేయబడిన HVAC కంట్రోల్స్, కొత్త సీట్లు మరియు సీట్ అప్హోల్స్టరీ మొదలైనవి చాలానే ఉన్నాయి. అంతేకాకుండా, ఈ కారులో సన్‌రూఫ్, హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, పెద్ద 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వెనుక ప్రయాణీకుల కోసం AC వెంట్‌లు, ABS, EBD, 6 ఎయిర్‌బ్యాగ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

మొత్తం 10 వేరియంట్లలో విడుదల కానున్న 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా.. హైబ్రిడ్ వేరియంట్స్ కూడా..

చివరిగా కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త 2022 బ్రెజ్జా 6 మోనోటోన్ కలర్స్ మరియు 3 డ్యూయెల్ టోన్ కలర్స్ లో లభ్యం కానుంది. మోనోటోన్ కలర్ ఆప్షన్లలో పెర్ల్ ఆర్కిటిక్ వైట్, ప్రైమ్ స్ప్లెండిడ్ సిల్వర్, మెటాలిక్ మాగ్మా గ్రే, సిజ్లింగ్ రెడ్, ఎక్సుబరెంట్ బ్లూ మరియు పెర్ల్ బ్రేవ్ ఖాకీ ఉన్నాయి. అలాగే, డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో సిజ్లింగ్ రెడ్ అండ్ బ్లాక్, వైట్ అండ్ ఖాకీ బ్రేవ్ మరియు బ్లాక్ అండ్ స్ప్లెండిడ్ సిల్వర్ కలర్స్ ఉన్నాయి. ఈ కారుకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New 2022 maruti suzuki vitara brezza facelift will be available in 10 variants details
Story first published: Tuesday, June 28, 2022, 17:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X