ఇదుగిదిగో.. ఇదే సరికొత్త 2022 మారుతి విటారా బ్రెజ్జా, చిన్నసైజు రేంజ్ రోవర్‌లా ఉంది కదూ..!

మారుతి సుజుకి ఇటీవలి కాలంలో తమ కార్లను అప్‌గ్రేడ్ చేసే పనిలో చాలా బిజీగా ఉంది. ఇప్పటికే బాలెనో, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 వంటి మోడళ్లలో అప్‌గ్రేడెడ్ వెర్షన్లను విడుదల చేసిన కంపెనీ, ఇప్పుడు తమ పాపులర్ మరియు ఏకైక కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన విటారా బ్రెజ్జాను అప్‌గ్రేడ్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (2022 Maruti Suzuki Brezza) మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో, కొత్త బ్రెజ్జా టెలివిజన్ కమర్షియల్‌ను షూట్ చేస్తుండగా, కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి.

ఇదుగిదిగో.. ఇదే సరికొత్త 2022 మారుతి విటారా బ్రెజ్జా, చిన్నసైజు రేంజ్ రోవర్‌లా ఉంది కదూ..!

ఈ లీకైన స్పై చిత్రాలను గమనిస్తే, కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో భారీ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి చూపులో ఇది చూడటానికి ఓ చిన్న సైజు రేంజ్ రోవర్ కారులా అనిపిస్తుంది. కొత్త బ్రెజ్జా టెలివిజన్ కమర్షియల్ కోసం రెడ్ కలర్ లో ఉండే ఓ టాప్-ఎండ్ వేరియంట్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇందులో కారు విండో లైన్ నుండి క్రింది భాగం వరకూ బాడీ కలర్ లో ఉంది మరియు విండో లైన్ నుండి పై భాగం అంతా బ్లాక్ కలర్ లో ఉంది. డ్యూయెల్ టోన్ వేరియంట్ లో ఇది చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది.

ఇదుగిదిగో.. ఇదే సరికొత్త 2022 మారుతి విటారా బ్రెజ్జా, చిన్నసైజు రేంజ్ రోవర్‌లా ఉంది కదూ..!

కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఫ్రంట్ డిజైన్ పూర్తిగా మార్చబడింది. ముందు వైపు డ్యూయెల్ టోన్ బంపర్, సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్, స్ప్లిట్ క్రోమ్ గ్రిల్ మరియు వాటి మధ్యలో పెద్ద సుజుకి లోగో, పియానో బ్లాక్ ఫినిష్ ట్రిమ్, దీర్ఘచతురస్రాకారపు ఫాగ్ లైట్స్, వంటి మార్పులు ముందు వైపు కనిపిస్తాయి. ఇందులో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కొత్త ట్విన్-పాడ్ ఎల్ఈడి హెడ్‌లైట్‌ యూనిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఇదుగిదిగో.. ఇదే సరికొత్త 2022 మారుతి విటారా బ్రెజ్జా, చిన్నసైజు రేంజ్ రోవర్‌లా ఉంది కదూ..!

సైడ్ డిజైన్‌లో పెద్దగా మార్పులు లేనప్పటికీ, కొత్తగా డిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్, పియానో బ్లాక్ ఫినిష్ లో ఉండే సైడ్ మిర్రర్స్ మరియు వాటిపై అమర్చిన టర్న్ ఇండికేటర్స్, బ్లాక్ అవుట్ చేయబడిన బి, సి పిల్లర్స్, సైడ్ డోర్ ప్యానెళ్లపై బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, పెద్ద వీల్ ఆర్చెస్ మరియు వాటిపై ప్లాస్టిక్ క్లాడింగ్ వంటి మార్పులు కనిపిస్తాయి. కారు పైభాగం మొత్తం కూడా పియానో బ్లాక్ ఫినిష్‌లో పెయింట్ చేయబడి ఉంటుంది, వెనుక వైపు షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు రూఫ్ మౌంటెడ్ రియర్ స్పాయిలర్‌లు హైలైట్ గా నిలుస్తాయి.

ఇదుగిదిగో.. ఇదే సరికొత్త 2022 మారుతి విటారా బ్రెజ్జా, చిన్నసైజు రేంజ్ రోవర్‌లా ఉంది కదూ..!

ముందు మరియు వెనుక వైపు ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌లతో కూడిన రివైజ్డ్ బంపర్స్, కొత్త 16-ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, కారు బాడీ చుట్టూ పెద్ద బ్లాక్ కలర్ ప్లాస్టిక్ క్లాడింగ్ తో ఇది మంచి రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉంటుంది. కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వెనుక వైపు టెయిల్ ల్యాంప్‌ క్లస్టర్ కూడా పూర్తిగా రీడిజైన్ చేయబడింది మరియు ఈ కొత్త లైట్లు చాలా షార్ప్ గా కనిపిస్తాయి. ఓవరాల్ గా ఎక్స్టీరియర్ లో చేసిన మార్పులు అన్నీ కూడా ఈ కారుని మునుపటి కన్నా చాలా స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.

ఇదుగిదిగో.. ఇదే సరికొత్త 2022 మారుతి విటారా బ్రెజ్జా, చిన్నసైజు రేంజ్ రోవర్‌లా ఉంది కదూ..!

కొత్త 2022 బ్రెజ్జా ఇంటీరియర్స్ గురించి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ, కంపెనీ ఈ కారులో ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్ ను అందిస్తుందని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం, కొత్త విటారా బ్రెజ్జాలో లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, 360 డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 9.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, టెంపరేచర్ కంట్రోల్, ఈబిడితో కూడిన ఏబిఎస్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఇందులో లభించే అవకాశం ఉంది.

ఇదుగిదిగో.. ఇదే సరికొత్త 2022 మారుతి విటారా బ్రెజ్జా, చిన్నసైజు రేంజ్ రోవర్‌లా ఉంది కదూ..!

మారుతి సుజుకి నుండి రాబోయే ఈ కొత్త 2022 మోడల్ విటారా బ్రెజ్జాలో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే ఉంటాయని తెలుస్తోంది, ఇందులో మెకానికల్ గా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా లో ఉపయోగించిన అదే K15C న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని ఈ కొత్త విటారా బ్రెజ్జాలో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. కొత్త ఎర్టిగా ఎమ్‌పివిలోని ఈ ఇంజన్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ గరిష్టంగా 101.6 బిహెచ్‌పి పవర్ ను మరియు 136.8 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

ఇదుగిదిగో.. ఇదే సరికొత్త 2022 మారుతి విటారా బ్రెజ్జా, చిన్నసైజు రేంజ్ రోవర్‌లా ఉంది కదూ..!

కొత్త ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 యొక్క 2022 మోడళ్లలో కంపెనీ వాటి మునుపటి 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానాల్లో కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ను ఉపయోగించింది. కాబట్టి, కొత్తగా రాబోయే విటారా బ్రెజ్జాలో కూడా ఇదే విధమైన పవర్‌ట్రైన్ సెటప్ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో పాటుగా స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉంటుంది. కొత్త బ్రెజ్జా పెట్రోల్ ఇంజన్ తో పాటుగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ తో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. అయితే, ఇవి కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభ్యమయ్యే అవకాశం ఉంది.

Source: Rushlane

Most Read Articles

English summary
New 2022 maruti suzuki vitara brezza spied during tvc shoot first look photos
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X