2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వర్సెస్ 2022 హ్యుందాయ్ వెన్యూ.. రెండింటిలో ఏది బెస్ట్..?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ విభాగంలో పెరుగుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు కార్ల తయారీ కంపెనీలు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నాయి. అలాగే, ఇప్పటికే ఈ విభాగంలో ఉత్పత్తులను విక్రయిస్తున్న కంపెనీలు వాటిని ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి కూడా తమ విటారా బ్రెజ్జాలో ఓ కొత్త 2022 మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వర్సెస్ 2022 హ్యుందాయ్ వెన్యూ.. రెండింటిలో ఏది బెస్ట్..?

కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (2022 Maruti Suzuki Vitara Brezza) ఈ విభాగంలో ఇటీవలే వచ్చిన కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ (2022 Hyundia Venue) కి గట్టి పోటీగా నిలుస్తుంది. మారుతి సుజుకి తమ కొత్త విటారా బ్రెజ్జా ఎస్‌యూవీని జూన్ 30వ తేదీన భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన అనేక వివరాలను కంపెనీ టీజర్ల రూపంలో వెల్లడి చేసింది. మరి ఈ కొత్తగా రాబోయే 2022 బ్రెజ్జా, ఇప్పుడే వచ్చిన కొత్త 2022 వెన్యూతో ఎలా పోటీ పడుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వర్సెస్ 2022 హ్యుందాయ్ వెన్యూ.. రెండింటిలో ఏది బెస్ట్..?

2022 మారుతి బ్రెజ్జా vs 2022 హ్యుందాయ్ వెన్యూ - డిజైన్

కొత్త 2022 మోడల్ మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో అనేక అప్‌డేట్‌లను పొందనుంది. ఇటీవల విడుదల చేయబడిన టీజర్ చిత్రాల ప్రకారం, కొత్త విటారా బ్రెజ్జా మునుపటి కంటే మరింత అగ్రెసివ్‌గా మరియు స్పోర్టివ్‌గా కనిపిస్తోంది. ఇందులో కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగి లైట్లు మరియు కొత్త ఎల్ఈడి టెయిల్‌ లైట్లతో ముందు వైపు పూర్తిగా రీడిజైన్ చేయబడింది. కొత్త బ్రెజ్జాలో కొత్త రూఫ్ రెయిల్‌లు, బూట్‌ లిడ్‌పై 'బ్రెజ్జా' అనే అక్షరాలు మరియు కాంట్రాస్టింగ్ స్కిడ్ ప్లేట్‌లు ఉన్నాయి.

2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వర్సెస్ 2022 హ్యుందాయ్ వెన్యూ.. రెండింటిలో ఏది బెస్ట్..?

ఇక 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ విషయానికి వస్తే, ఇది కూడా ఇటీవలే అప్‌డేట్ చేయబడింది కాబట్టి, దీని ఫ్రంట్ అండ్ ఇంటీరియర్ డిజైన్‌లో కూడా అనేక మార్పులు ఉన్నాయి. కొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు కొత్త బంపర్‌తో పాటుగా కియా సోనెట్ నుండి ప్రేరణ పొందిన కొత్త కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ లైట్‌ని కూడా కలిగి ఉంటుంది. బూట్‌లిడ్‌పై పెద్ద అక్షరాలతో వెన్యూ అనే బ్యాడ్జింగ్‌ ప్రధానంగా కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే, ఈ రెండు కార్లు కూడా మునుపటి కన్నా రిఫ్రెష్డ్ స్టైలింగ్ ను కలిగి ఉంటాయి.

Dimensions 2022 Hyundai Venue Maruti Brezza
Length 3,995 mm 3,995 mm
Width 1,770 mm 1,790 mm
Height 1,617 mm 1,640 mm
Wheelbase 2,500 mm 2,500 mm
Ground Clearance 195 mm 198 mm
2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వర్సెస్ 2022 హ్యుందాయ్ వెన్యూ.. రెండింటిలో ఏది బెస్ట్..?

2022 మారుతి బ్రెజ్జా vs 2022 హ్యుందాయ్ వెన్యూ - ఇంటీరియర్ ఫీచర్లు

కొత్త మారుతి సుజుకి విటారా బ్రెజ్జా యొక్క 2022 మోడల్ దాని పాత మోడల్‌తో పోలిస్తే అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో కొత్త మారుతి సుజుకి బాలెనో మాదిరిగానే కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన లేటెస్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు 360 డిగ్రీ కెమెరా సెగ్మెంట్ ఫీచర్‌లో మొదటిగా ఇవ్వబడ్డాయి. కొత్త మారుతి బ్రెజ్జా యొక్క మరిన్ని ఫీచర్ల వివరాలను కంపెనీ జూన్ 30న లాంచ్ సమయంలో వెల్లడి చేయనుంది.

2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వర్సెస్ 2022 హ్యుందాయ్ వెన్యూ.. రెండింటిలో ఏది బెస్ట్..?

ఇక హ్యుందాయ్ వెన్యూ యొక్క 2022 మోడల్ లో లభిస్తున్న ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 2-స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్, కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన 8 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, అమేజాన్ అలెక్సా మరియు గూగుల్ వాయిస్ అసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రియర్ ఏసి వెంట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లను పొందుతుంది.

2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వర్సెస్ 2022 హ్యుందాయ్ వెన్యూ.. రెండింటిలో ఏది బెస్ట్..?

2022 మారుతి బ్రెజ్జా vs 2022 హ్యుందాయ్ వెన్యూ - ఇంజన్

ఇంజన్ విషయానికి వస్తే, ఈ రెండు మోడళ్లలో ఎలాంటి మార్పులు లేవు. ఇవి పాత ఇంజన్లనే కొనసాగిస్తాయి. అయితే, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా యొక్క 2022 మోడల్ కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను పొందే అవకాశం ఉంది. ఇదే ఇంజన్ ను ఇటీవలే విడుదల చేసిన కొత్త మారుతి ఎర్టిగాలో ఉపయోగించారు. బ్రెజ్జాలో ఉపయోగించిన 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్ ను మరియు 136 న్యూటన్ మీటర్ల టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో రానుంది మరియు దీని డ్రైవింగ్ అనుభూతిని మరింత ఉత్తేజపరిచేందుకు, కంపెనీ ఇప్పుడు ఇందులో ప్యాడిల్ షిఫ్టర్‌ను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

Specifications Venue Petrol Venue Diesel Maruti Brezza
Displacement 1.2 L / 1.0 L 1.5 L 1.5 L
Power 82 bhp / 118 bhp 99 bhp 103 bhp
Torque 113 Nm / 172 Nm 240 Nm 123 Nm
Gearbox 5MT / 7DCT, iMT 6MT 5MT / 6AT
2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వర్సెస్ 2022 హ్యుందాయ్ వెన్యూ.. రెండింటిలో ఏది బెస్ట్..?

ఇక హ్యుందాయ్ వెన్యూ 2022 మోడల్ విషయానికి వస్తే, ఇది మునుపటి మాదిరిగానే మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. వీటి పవర్, టార్క్ గణాంకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు మరియు ఇవి మునుపటి మాదిరిగానే ఉంటాయి. అలాగే, వీటి గేర్‌బాక్స్ ఆప్షన్లలో కూడా ఎలాంటి మార్పులు లేవు. ఈ మూడు ఇంజన్లు కూడా మ్యాన్యువల్, ఐఎమ్‌టి ఆటోమేటిక్ మరియు డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి.

2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వర్సెస్ 2022 హ్యుందాయ్ వెన్యూ.. రెండింటిలో ఏది బెస్ట్..?

2022 మారుతి బ్రెజ్జా vs 2022 హ్యుందాయ్ వెన్యూ - సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ విషయంలో మారుతి సుజుకి అవసరమైన ఫీచర్లను మాత్రమే అందిస్తుంది. అయితే, ఈ విషయంలో హ్యుందాయ్ వెన్యూలో మరిన్ని ఎక్కువ ఫీచర్లు లభిస్తాయి. భారత ప్రభుత్వం ఇటీవల ప్రతి కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రవేశపెట్టాలని ఆదేశించిన తర్వాత కార్ల పరిశ్రమలో సేఫ్టీపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త నిబంధనల ప్రకారం, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా మరిన్ని ఇతర ఫీచర్లు లభించే అవకాశం ఉంది.

2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా వర్సెస్ 2022 హ్యుందాయ్ వెన్యూ.. రెండింటిలో ఏది బెస్ట్..?

హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌లో రియర్ పార్కింగ్ కెమెరా, కార్నరింగ్ ల్యాంప్స్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, హిల్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. కాగా, కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జాకి సంబంధించిన మరిన్ని వివరాలు జూన్ 30న వెల్లడి కానున్నాయి. అప్పటి వరకూ తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New 2022 maruti suzuki vitara brezza vs new 2022 hyundai venue comparison
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X