భారతీయ మార్కెట్లో ఆడి క్యూ3 లాంచ్ అయిపోయింది.. ధర & బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'ఆడి' (Audi) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన క్యూ3 (Q3) ఎస్‌యువి లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎస్‌యువి ప్రారంభ ధర రూ. 44.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ దీని కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించింది. కావున డెలివరీలు ఈ సంవత్సరం చివరినాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Recommended Video

భారత్‌లో విడుదలైన 2022 Audi A8 L: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆడి క్యూ3 గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

ఆడి క్యూ3 లాంచ్ అయిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

ఆడి కంపెనీ తన క్యూ3 (Q3) ఎస్‌యువిని రెండు ట్రిమ్స్ లో విడుదల చేసింది. అవి ప్రీమియం ప్లస్ ట్రిమ్ మరియు టెక్నాలజీ ట్రిమ్. వీటి ధరలు వరుసగా రూ. 44.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 50.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇవి రెండూ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

ఆడి క్యూ3 లాంచ్ అయిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆడి Q3 దాని మునుపటి మోడల్స్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. కావున పొడవు మరియు వెడల్పు ఎక్కువగానే ఉంటుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఇప్పుడు మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి పల్స్ ఆరెంజ్, గ్లేసియర్ వైట్, క్రోనోస్ గ్రే, మైథోస్ బ్లాక్ మరియు నవర్రా బ్లూ కలర్స్.

ఆడి క్యూ3 లాంచ్ అయిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

క్యూ3 యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది సన్నటి ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పెద్ద ట్రైగోనల్ గ్రిల్ మరియు యాంగ్యులర్ బంపర్ క్రీజ్‌లను కలిగి ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరింత ఆకర్షణను పెంచుతాయి. రియర్ ప్రొఫైల్ లో టెయిల్ లైట్ ఉంటుంది. మొత్తం మీద డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

ఆడి క్యూ3 లాంచ్ అయిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇంటీరియర్ రెండు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి ఒకాపి బ్రౌన్ మరియు పెర్ల్ బీజ్ కలర్స్. ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, టు జోన్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ కెమెరాతో పార్క్ అసిస్ట్, 30-కలర్ యాంబియంట్ లైటింగ్, క్యాబిన్ స్పోర్ట్స్ అడ్జస్టబుల్ సీటింగ్, లెదర్ ర్యాప్డ్ 3 స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్టోరేజ్ మరియు లగేజ్ కంపార్ట్‌మెంట్లు మరియు ఫ్రేమ్‌లెస్ ఆటో-డిమ్మింగ్ ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ వంటివి ఉన్నాయి.

ఆడి క్యూ3 లాంచ్ అయిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

ఆడి క్యూ3 ఎస్‌యువి 2.0 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. కావున ఇది 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 190 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 ఆర్‌పిఎమ్ వద్ద 320 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతం అవుతుంది.

ఆడి క్యూ3 లాంచ్ అయిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, లేన్ కీపింగ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్ మరియు ఫ్రంట్ కొలిషన్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు బూట్ స్పేస్ 530 లీటర్ల వరకు ఉంది.

ఆడి క్యూ3 లాంచ్ అయిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే కంపెనీ తన కొత్త Q3 కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున అశక్యతి కలిగిన కస్టమర్లు రూ. 2 లక్షలు చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్ లో బుక్ చేసుకోవచ్చు. ఈ SUV కొనుగోలుపైనా కంపెనీ తన మొదటి 500 మంది కస్టమర్లకు 5-సంవత్సరాల వారంటీతో పాటు 3-సంవత్సరాల / 50,000కిమీ సర్వీస్ ప్యాకేజీని కూడా అందిస్తుంది.

ఆడి క్యూ3 లాంచ్ అయిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

ఇదిలా ఉండగా కంపెనీ ఈ SUV యొక్క డెలివరీలను ప్రారంభించకముందే పాన్-ఇండియా రోడ్‌షో ప్రారంభించనుంది. ఇందులో భాగంగానే ఈ SUV సెప్టెంబర్ 1 మరియు 2 తేదీలలో కంపెనీ యొక్క హైదరాబాద్ డీలర్‌షిప్‌లో మరియు సెప్టెంబర్ 3 మరియు 4 వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో కూడా ప్రదర్శించబడుతుంది. అంతే కాకూండా భారతదేశంలో ఇతర ప్రధాన నగరాల్లో కూడా ఈ రోడ్‌షో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కంపెనీ త్వరలోనే వెల్లడిస్తుంది.

ఆడి క్యూ3 లాంచ్ అయిపోయింది.. బుకింగ్ ప్రైస్ ఎంతంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఆడి కంపెనీ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందా.. అని ఎదురు చూస్తున్న కొత్త Q3 ఎట్టకేలకు భారతీయ విఫణిలో విడుదలయ్యింది. అయితే మార్కెట్లో ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుందో వేచి చూడాలి. ఆడి క్యూ3 మార్కెట్లో బిఎండబ్ల్యు ఎక్స్1,వోల్వో XC40 మరియు మెర్సిడెస్ బెంజ్ GLA వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
New audi q3 launched in india price features engine details
Story first published: Tuesday, August 30, 2022, 14:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X