కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో సేఫ్టీపై అంచనాలు పెంచేస్తున్న టీజర్..

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వాహనాలలో తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) స్కార్పియో కూడా ఒకటి. వివిధ కారణాల వల ఈ ఎస్‌యూవీ లాంచ్ దాదాపు రెండేళ్లకు పైగా వాయిదా పడింది. ఈ గ్యాప్ లో మహీంద్రా నుండి నెక్స్ట్ జనరేషన్ థార్ ఎస్‌యూవీ మరియు సరికొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ700 మోడళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. అంతేకాదు, ఇవి రెండూ మహీంద్రా తీసుకురాబోయే కొత్త వాహనాలపై అంచనాలను కూడా పెంచేశాయి.

కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో సేఫ్టీపై అంచనాలు పెంచేస్తున్న టీజర్..

మహీంద్రా తమ కొత్త తరం స్కార్పియో ఎస్‌యూవీకి సంబంధించిన టీజర్లను విడుదల చేయడం చూస్తుంటే, ఇక ఎస్‌యూవీ మార్కెట్లోకి రావడానికి ఎంతో సమయం పట్టదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా విడుదలైన మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio) టీజర్ వీడియోని చూస్తే, ఈ పాపులర్ ఎస్‌యూవీలో సేఫ్టీ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని తెలుస్తోంది.

కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో సేఫ్టీపై అంచనాలు పెంచేస్తున్న టీజర్..

మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవలి సంవత్సరాలలో దేశంలో కెల్లా అత్యంత సురక్షితమైన వాహనాలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మహీంద్రా నుండి వచ్చిన తాజా ఆవిష్కరణ మహీంద్రా XUV700 కూడా పెద్దల రక్షణ కోసం గ్లోబల్-ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్‌ను స్కోర్ చేసింది. అలాగే, మహీంద్రా అందిస్తున్న చిన్న ఎస్‌యూవీ XUV300 కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేప్టీ రేటింగ్‌ను సాధించింది.

కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో సేఫ్టీపై అంచనాలు పెంచేస్తున్న టీజర్..

ఆ తర్వాత కొత్త తరం మహీంద్రా థార్ మరియు మహీంద్రా మరాజ్జో ఎమ్‌పివిలు వాటి కంటే ఒక స్టార్ తక్కువగా, అంటే అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయంలో ఇవి గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. ఈ నేపథ్యంలో, మహీంద్రా విడుదల చేసిన కొత్త స్కార్పియో టీజర్ లో కంపెనీ "కొత్త మహీంద్రా ఎస్‌యూవీ క్రాష్ డమ్మీని కూడా సురక్షితంగా భావించేలా చేస్తుంది" అనే క్యాప్షన్‌ను హైలైట్ చేసింది. అంటే, ఇది కూడా దాదాపుగా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ తో వస్తుందని తెలుస్తోంది.

కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో సేఫ్టీపై అంచనాలు పెంచేస్తున్న టీజర్..

విడుదలకు ఓ తెలుపు రంగు మహీంద్రా స్కార్పియో 2022 మోడల్ చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. మహీంద్రా ప్రొడక్షన్ ప్లాంట్ నుండి వచ్చిన తెల్లటి మహీంద్రా స్కార్పియో చిత్రం కూడా కొత్త తరం స్కార్పియో యొక్క ఉత్పత్తి విడుదలకు ముందే ప్రారంభించబడిందని ధృవీకరిస్తోంది. అంతేకాకుండా, ఎస్‌యూవీ యొక్క 20వ వార్షికోత్సవంతో అనుబంధించబడిన వేడుకలో భాగంగా జూన్ నెలలో మహీంద్రా కొత్త స్కార్పియోను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు.

కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో సేఫ్టీపై అంచనాలు పెంచేస్తున్న టీజర్..

డిజైన్ పరంగా చూస్తే, రాబోయే కొత్త 2022 మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీ కంపెనీ విక్రయిస్తున్న ఇతర ఎక్స్‌యూవీ లైనప్ ఎస్‌యూవీ యొక్క మునుపటి జనరేషన్ మోడళ్ల నుండి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది. కొత్త తరం స్కార్పియో అన్ని విషయాలలో సరికొత్తగా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో ఫ్రేమ్ నుండి ఇంజన్ వరకూ అన్నీ మారే అవకాశం ఉంటుంది. సమాచారం ప్రకారం, ఈ లేటెస్ట్ ఎస్‌యూవీని బాడీ-ఆన్-ఫ్రేమ్ ఛాసిస్‌ పై తయారు చేసే అవకాశం ఉంది.

కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో సేఫ్టీపై అంచనాలు పెంచేస్తున్న టీజర్..

కొత్త తరం థార్ మరియు ఎక్స్‌యూవీ700 మోడళ్ల మాదిరిగానే ఈ కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో కూడా రెండు ఇంజన్ ఆప్షన్లతో రావచ్చని సమాచారం. వీటిలో 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు కొత్త 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. అయితే, మహీంద్రా ఇదే ఇంజన్లను ఎక్స్‌యూవీ700లో కూడా ఉపయోగిస్తున్న నేపథ్యంలో, ఈ రెండు మోడళ్ల మధ్య ఎదురు కాబోయే ప్రత్యక్ష పోటీని నివారించడానికి XUV700లోని యూనిట్‌తో పోలిస్తే కొత్త స్కార్పియోలో ఉపయోగించబోయే 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ మరియు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లను కంపెనీ రీట్యూన్ చేసే అవకాశం ఉంది.

కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో సేఫ్టీపై అంచనాలు పెంచేస్తున్న టీజర్..

మహీంద్రా ఆల్-వీల్ డ్రైవ్ వాహనాలను డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, ఈ కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో యొక్క టాప్-ఎండ్ వేరియంట్ లలో కంపెనీ మరింత ధృడమైన మరియు అధునాతనమైన షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను అందించవచ్చని భావిస్తున్నారు. కేవలం సేఫ్టీ విషయంలోనే కాకుండా, ఫీచర్ల విషయంలో కూడా మహీంద్రా స్కార్పియో చాలా లేటెస్ట్ గా ఉంటోదని తెలుస్తోంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, కనెక్టింగ్ టెక్నాలజీ, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మరెన్నో ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు. ధర విషయానికి వస్తే, మహీంద్రా తమ కొత్త స్కార్పియో ధరను రూ. 12 లక్షలకు (ఎక్స్-షోరూమ్‌) చేరువలో ఉంచుతుందని అంచనా.

Most Read Articles

English summary
New gen mahindra scorpio latest teaser hints high safety standards
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X