మొత్తం 40 వేరియంట్‌లలో విడుదల కానున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ !?

ఎస్‌యూవీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) మరికాసేపట్లోనే మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, కొత్త స్కార్పియో-ఎన్ కి సంబంధించిన అనేక అంశాలు వెల్లడయ్యాయి. కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్‌కి సంబంధించి కొత్తగా లీక్ అయిన డాక్యుమెంట్‌ల ప్రకారం, ఈ ఎస్‌యూవీ మొత్తం 40 వేరియంట్‌లలో మార్కెట్లో విడుదల కానున్నట్లు వెల్లడించాయి. అంతేకాకుండా, సదరు వేరియంట్ల పేర్లు మరియు స్పెసిఫికేషన్లు కూడా వెల్లడయ్యాయి.

మొత్తం 40 వేరియంట్‌లలో విడుదల కానున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ !?

స్కార్పియో-ఎన్ వేరియంట్ పేర్లు మహీంద్రా స్కార్పియో యొక్క అవుట్‌గోయింగ్ వెర్షన్ (పాత మోడల్) మరియు ఇటీవల విడుదల చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ యొక్క వేరియంట్ల పేర్ల కన్నా భిన్నంగా ఉన్నాయి. లీకైన పత్రాల ప్రకారం కొత్త తరం 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ Z2, Z4, Z6, Z8 మరియు Z8L అనే ఐదు ట్రిమ్ లలో 2-వీల్ డ్రైవ్ మరియు 4-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో 6-సీటర్ మరియు 7-సీటర్ ఎంపికలతో మొత్తం 40 వేరియంట్లలో (4 క్లాసిక్ స్కార్పియో వేరియంట్లు కలిపి) అందుబాటులోకి రానుంది.

మొత్తం 40 వేరియంట్‌లలో విడుదల కానున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ !?

అంతేకాకుండా, కస్టమర్‌లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఎంపికల మధ్య కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ లీకైన పత్రాల ప్రకారం, డీజిల్ పవర్‌ట్రెయిన్ మాత్రమే 4WD (ఫోర్ వీల్ డ్రైవ్) ఆప్షన్ తో వస్తున్నట్లు వెల్లడిస్తోంది. ఈ మొత్తం 40 వేరియంట్లలో 23 డీజిల్ వేరియంట్లు, 13 పెట్రోల్ వేరియంట్లు మరియు 4 స్కార్పియో క్లాసిక్ (పాత మోడల్) వేరియంట్లు ఉన్నాయి.

మొత్తం 40 వేరియంట్‌లలో విడుదల కానున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ !?

దీన్నిబట్టి చూస్తుంటే, మహీంద్రా తమ కొత్త తరం స్కార్పియో-ఎన్ వివిధ కొనుగోలుదారుల అభిరుచికి మరియు అవసరాలకు అనుగుణంగా విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, పాత తరం స్కార్పియోకి ఇప్పటికీ బలమైన డిమాండ్ ఉండటం మరియు కస్టమర్లు ఈ మోడల్‌ను ఇంకా కోరుకుంటుండంతో కంపెనీ దానిని అలానే కొనసాగించేందుకు సిద్ధమైంది. అయితే, ఈ పాత తరం మోడల్ ను కంపెనీ ఇప్పుడు కేవలం నాలుగు వేరియంట్లకు మాత్రమే పరిమితం చేసింది మరియు దీనిని స్కార్పియో క్లాసిక్ పేరుతో విక్రయించనుంది.

మొత్తం 40 వేరియంట్‌లలో విడుదల కానున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ !?

కొత్త 2022 మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క లీక్ అయిన అప్రూవల్ సర్టిఫికేట్‌లు దాని ఇంజన్ ఆప్షన్లను కూడా నిర్ధారిస్తున్నాయి. వాటి ప్రపాకం, ఈ ఎస్‌యూవీని బేస్ డీజిల్ ఇంజన్ 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ రూపంలో లభిస్తుంది మరియు ఇది గరిష్టంగా 130 బిహెచ్‌పి శక్తిని మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఈ ఇంజన్ ప్రత్యేకంగా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

మొత్తం 40 వేరియంట్‌లలో విడుదల కానున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ !?

ఇకపోతే, రెండవ డీజిల్ ఇంజన్ మరింత శక్తివంతమైన 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ యూనిట్. ఇది గరిష్టంగా 172 బిహెచ్‌పి శక్తిని మరియు 370 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన వేరియంట్‌లో గరిష్టంగా 400 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే, ఇది 4WD (ఆల్-వీల్ డ్రైవ్)తో లభించే ఏకైక ఇంజన్ ఆప్షన్ ఇదే. అలాగే, 4WD ఆప్షన్ ను మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో ఎంచుకోవచ్చు.

మొత్తం 40 వేరియంట్‌లలో విడుదల కానున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ !?

ఇక చివరిది మరియు మూడవ ఇంజన్ ఆప్షన్ 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి శక్తిని మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదా 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. కాగా, తాజాగా లీకైన పత్రాల ప్రకారం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో 4WD (ఫోర్-వీల్ డ్రైవ్) ఆప్షన్ లేదని తెలుస్తోంది.

మొత్తం 40 వేరియంట్‌లలో విడుదల కానున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ !?

ఇదివరకు వెల్లడైన కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఇంటీరియర్ చిత్రాల ప్రకారం, ఈ ఎస్‌యూవీ యొక్క 4WD వెర్షన్ 4-హై మరియు 4-లో గేర్ నిష్పత్తులతో పాటు రఫ్, మడ్, స్నో మరియు వాటర్ అనే ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్స్ ని కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీ సైజ్ విషయానికి వస్తే, కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ 4,662 మిమీ పొడవు, 1,917 మిమీ వెడల్పు, 1,857 మిమీ ఎత్తు మరియు 2,750 మిమీ వీల్‌బేస్‌తో పాత మోడల్ కన్నా కాస్తంత పెద్దదిగా ఉంటుంది.

మొత్తం 40 వేరియంట్‌లలో విడుదల కానున్న మహీంద్రా స్కార్పియో-ఎన్ !?

అయితే, ఇందులో 18 ఇంచ్ వీల్స్ కి బదులుగా చిన్న 17 ఇంచ్ వీల్స్ ని అమర్చబడినప్పుడు దీని ఎత్తు 1,849 మిమీకి తగ్గుతుంది. కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ విలాసవంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు, పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్స్, సోనీ స్పీకర్ సెటప్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వెంటిలేటెడ్ సీట్లు, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి మరెన్నో అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New gen mahindra scorpio n to be launched in 36 variants engine specifications revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X