ఇదేం విడ్డూరం సామీ.. ఈ కారు డెలివరీ కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేయాలా..?

కొత్త కారు కొనడం అనేది ఎవ్వరికైనా మనసుకు సంతోషాన్ని కలిగించే చాలా ఉత్తేజకరమైన విషయం. కస్టమర్లు తమకు నచ్చిన కారును బుక్ చేసినప్పటి నుండి ఆ కారు ఇంటికి డెలివరీ అయ్యే వరకూ వారు చెందే అనుభూతిని మాటల్లో వర్ణించలేము. ఈ ఎదురుచూపులు మరియు ఆ ఎదురుచూపుల తర్వాత వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. అయితే, ఈ వెయిటింగ్ పీరియడ్ పెరిగే కొద్దీ కస్టమర్లలో అసహనం కూడా పెరుగుతుంది. తద్వారా కస్టమర్లు కారును క్యాన్సిల్ చేసుకునే ఆస్కారం ఉంది.

ఇదేం విడ్డూరం సామీ.. ఈ కారు డెలివరీ కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేయాలా..?

కస్టమర్ కారు బుక్ చేసినప్పటి నుండి అది వారికి డెలివరీ అయ్యే వరకూ ఉండే సమయాన్ని వెయిటింగ్ పీరియడ్ అంటారు. సాధారణంగా కొన్ని కార్లకు వెయిటింగ్ పీరియడ్ 2 వారాల నుండి 2 నెలల వరకు ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో 12 నెలల వరకూ కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అయితే, ఈ కథనంలో మనం చెప్పుకోబోయే కారుకి మాత్రం నాలుగు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంది.

ఇదేం విడ్డూరం సామీ.. ఈ కారు డెలివరీ కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేయాలా..?

జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ ల్యాండ్ క్రూజర్ (land-cruiser) ఎస్‌యూవీ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీని డిమాండ్ ఎంతలా పెరిగిందంటే, ఇప్పుడు ఈ కారును బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీ తీసుకోవాలంటే మరో 4 సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సినంతగా డిమాండ్ పెరిగిపోయింది. కొత్త తరం టొయోటా ల్యాండ్ క్రూయిజర్ కోసం సుమారు 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్‌ ఉన్నట్లు మొదట్లో వార్తలు వినిపించాయి.

ఇదేం విడ్డూరం సామీ.. ఈ కారు డెలివరీ కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేయాలా..?

అయితే, ఇవన్నీ పుకార్లని కొట్టిపారేశారు, కానీ ఇప్పుడు టొయోటా కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. కొత్త తరం ల్యాండ్ క్రూయిజర్ కావాలంటే 4 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని టొయోటా పేర్కొంది. జపాన్ మార్కెట్లో టొయోటా 300 సిరీస్ ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీ కోసం ప్రస్తుత డిమాండ్‌ను తీర్చడానికి 4 సంవత్సరాల వరకు పడుతుందని ప్రకటించింది. అయితే, ఈ వెయిటింగ్ పీరియడ్‌ను వీలైనంత వరకూ తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇదేం విడ్డూరం సామీ.. ఈ కారు డెలివరీ కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేయాలా..?

మరి ఈ కారు కొనడానికి కస్టమర్లు అంత కాలం వేచి ఉంటారా? అనే సందేహం మీకు రావచ్చు. అయితే, ప్రత్యేకమైన టొయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి కార్ల కోసం కస్టమర్లు ఎంత కాలమైనా వేచి ఉండేందుకు సిద్ధంగా ఉంటారనేది వాస్తవం. కొత్త తరం టొయోటా ల్యాండ్ క్రూయిజర్ కారు గతేడాది జూన్‌ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అప్పటి నుంచి ఈ కారు స్థానిక జపాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల నుండి మంచి ఆదరణ పొందింది.

ఇదేం విడ్డూరం సామీ.. ఈ కారు డెలివరీ కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేయాలా..?

కస్టమర్లలో విపరీతమైన మద్దతు ఉంటే, అంటే డిమాండ్ పెరిగినప్పుడు, కార్ల కంపెనీలకు ఆ అవసరాన్ని తీర్చడం కష్టంగా మారుతుంది. డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని కూడా పెంచాల్సి ఉంటుంది. అప్పుడే సదరు వాహనం యొక్క నిరీక్షణ సమయాన్ని తగ్గించడం మరియు కస్టమర్లకు వేగంగా కార్లను డెలివరీ చేయడం సాద్యమవుతుంది. అయితే, సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా ప్రపంచవ్యాప్తంగా కార్ల ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితమైంది.

ఇదేం విడ్డూరం సామీ.. ఈ కారు డెలివరీ కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేయాలా..?

కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్‌ల కొరత ఏర్పడింది. ఇవి వాహనాల తయారీలో చాలా కీలకంగా ఉండే ఎలక్ట్రానిక్ చిప్స్. కొత్త తరం టొయోటా ల్యాండ్ క్రూయిజర్ యొక్క వెయిటింగ్ పీరియడ్ పెరగడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఈ కారు యొక్క వెయిటింగ్ టైమ్‌ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నందున, సమీప భవిష్యత్తులో ఈ కారు కోసం వెయిటింగ్ టైమ్ తగ్గుతుందని అంచనా వేయవచ్చు.

ఇదేం విడ్డూరం సామీ.. ఈ కారు డెలివరీ కోసం 4 సంవత్సరాలు వెయిట్ చేయాలా..?

కొత్త తరం టొయోటా 300 సిరీస్ ల్యాండ్ క్రూయిజర్ కారు డిజైన్ చాలా మెరుగ్గా ఉంటుంది. గతంతో పోల్చుకుంటే, టొయోటా ఈ కారులో అనేక కొత్త ఫీచర్లను కూడా జోడించింది. ఈ కారు 2 రకాల ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో మొదటిది 409 బిహెచ్‌పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే పెద్ద 3.5-లీటర్ ట్విన్-టర్బోఛార్జ్‌డ్ వి6 పెట్రోల్ ఇంజన్‌. మరొకటి 304.5 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 3.3 లీటర్ ట్విన్-టర్బో వి6 డీజిల్ ఇంజన్.

Most Read Articles

English summary
New generation 300 series land cruiser has 4 year of waiting period toyota japan confirms details
Story first published: Saturday, January 22, 2022, 17:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X