Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ప్రముఖ కార్ తయారీ సంస్థ 'హోండా కార్స్ ఇండియా' (Honda Cars India) ఈ మధ్య కాలంలోనే హోండా సిటీ యొక్క హైబ్రిడ్ వెర్షన్‌ 'హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ' (Honda City e:HEV) ను దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త హైబ్రిడ్ వెర్షన్ యొక్క ధర రూ.19.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే కంపెనీ ఇప్పుడు ఈ కొత్త కారు యొక్క డెలివరీలను ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఈ నెల ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త హైబ్రిడ్ కారు యొక్క మొదటి బ్యాచ్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడావచ్చు. ఇందులో హోండా కంపెనీ యొక్క టాప్ మేనేజ్‌మెంట్, ప్రెసిడెంట్ మరియు సీఈఓ తమ మొదటి కస్టమర్ కు 'హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ' యొక్క కీ అందించారు.

Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త 'హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ' ని కంపెనీ దాని ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ తయారు చేసింది. స్టాండర్డ్ మోడల్ టాప్-ఎండ్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లు ఈ హైబ్రిడ్ కారులో లభిస్తాయి.

Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఈ కొత్త వేరియంట్ యొక్క డిజైన్ దాని స్టాండర్డ్ మోడల్ టాప్ ఎండ్ వేరియంట్‌ మాదిరిగానే ఉంటుంది. అయితే, కంపెనీ హైబ్రిడ్ వేరియంట్‌ను హైలైట్ చేసేందుకు ఫ్రంట్ గ్రిల్ పైన మందపాటి క్రోమ్ స్ట్రిప్‌ మరియు ఆ గ్రిల్‌లో స్టాండర్డ్ మోడల్‌లో కనిపించే హారిజాంటల్ స్లాట్‌లకు బదులుగా ఉండే హనీకోంబ్ ప్యాటర్న్ లను ఉపయోగించింది. ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి, వీటిలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే, ఈ హైబ్రిడ్ వేరియంట్ యొక్క ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ పూర్తిగా రీడిజైన్ చేయబడి ఉంటుంది.

Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఈ కారు టాక్ ముందు వైపు కనిపించే మరొక ప్రధానమైన మార్పు ఏంటంటే, దాని ముందు భాగంలో ఉండే పెద్ద బ్రాండ్ లోగో. స్టాండర్డ్ సిటీ వేరియంట్లలో ఇది పూర్తి క్రోమ్‌లో ఉంటుంది, అయితే, హైబ్రిడ్ వేరియంట్‌లో మాత్రం ఇది బ్లూ కలర్ యాక్సెంట్‌లను కలిగి ఉండి, ఇది హైబ్రిడ్ వాహనం అని గుర్తు చేస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో ఎలాంటి మార్పులు లేవు. వెనుక వైపు బూట్ లిడ్‌పై లిప్ స్పాయిలర్‌ మరియు బ్లూ యాక్సెంట్స్‌తో కూడిన రియర్ హోండా లోగో వంటి మార్పులు ఇందులో ఉన్నాయి.

Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

'హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ' లో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మరియు హోండా వెబ్‌లింక్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ట్వీక్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి మరెన్నో ఆధునిక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

ఈ మోడల్ యొక్క స్టాండర్డ్ వేరియంట్‌ కంటే కూడా ఇందులో చాలా ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో అధునాతన అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందులో భాగంగానే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హై బీమ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు ఫ్రంట్ కొలైజన్ వార్నింగ్ సిస్టమ్ వంటివి పనిచేస్తాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

కొత్త 'హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ' లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ-యాంగిల్ రియర్-వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఇందులో డిస్క్ బ్రేకులు మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే

'హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ' 1.5 లీటర్ అట్కిన్సన్ i-VTEC పెట్రోల్ ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో కలిసి గరిష్టంగా 109 బిహెచ్‌పి పవర్ మరియు 253 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు కారు ముందు చక్రాలపై అమర్చబడి ఉంటాయి. ఇవి ఒకే ఫిక్స్‌డ్ రేషియో eCVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కావున ఇది లీటరుకు 26.5 కిమీ మైలేజీ అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది 40 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంద్ కావున, ఒక ఫుల్ ట్యాంక్ తో దాదాపు 1,000 కిమీ కంటే కూడా ఎక్కువ పరిధిని అందిస్తుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
New honda city e hev delivery starts price features engine details
Story first published: Wednesday, May 25, 2022, 13:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X