సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన 'హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్'.. పూర్తి వివరాలు

ఆధునిక కాలంలో సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కావున వాహన తయారీ సంస్థలు కూడా తమ వాహనాలలో ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తోంది. ఇటీవల ASEAN NCAP క్రాష్ టెస్ట్‌లో 'హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్' 5-స్టార్ రేటింగ్ సాధించింది.

అసోసియేషన్ ఆఫ్ సౌతెస్ట్ ఆసియన్ నేషన్ (ASEAN) NCAP క్రస్ట్ టెస్ట్ కోసం ఉపయోగించిన మోడల్ ఇండోనేషియాలో తయారు చేయబడినట్లు తెలిసింది. ఒక సంవత్సరం క్రితం ఇండోనేషియాలో మార్కెట్లో అడుగుపెట్టిన క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఫిలిప్పీన్స్, థాయిలాండ్ మరియు వియత్నాం వంటి ఆసియా దేశాలలో కూడా విక్రయించబడింది. ఆగ్నేయాసియా దేశాల్లో మంచి అమ్మకాలు పొందుతున్న ఈ మోడల్ ఇప్పుడు సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ పొందటం వల్ల మరింత ఎక్కువ ఆదరణ పొందుతుంది.

సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ పొందిన క్రెటా ఫేస్‌లిఫ్ట్

క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ అడల్ట్ సేఫ్టీ విషయంలో 32 పాయింట్లకు గాను 27.78 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్‌లో ఈ మోడల్ డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఇద్దరి మంచి రక్షణను అందించింది. అయితే డ్రైవర్ లెగ్ ప్రాంతానికి తగిన రక్షణ లేదని ఇందులో తెలిసింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో కూడా డ్రైవర్ కి మంచి రక్షణ అందిస్తుందని నిర్దారించబడింది.

పిల్లల సేఫ్టీ విషయంలో క్రెటా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 51 పాయింట్లకు గాను 39.67 పాయింట్లను సాధించింది. టెస్టింగ్ సమయంలో ఈ SUV రెండు చైల్డ్ డమ్మీలను ఉపయోగించింది. ఇందులో ఒకటిన్నర సంవత్సరాల మరియు మూడు సంవత్సరాల పిల్లల కోసం సీట్లు వెనుక వైపుకు ఉన్నాయి. మొత్తం మీద హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ అడల్ట్ సేఫ్టీలో మరియు పిల్లల సేఫ్టీలో 5 స్టార్ట్ రేటింగ్ పొందగలిగింది.

సేఫ్టీ అసిస్ట్ సిస్టమ్స్ విషయానికొస్తే, క్రెటా ఫేస్‌లిఫ్ట్ 21 పాయింట్లకు 14.79 పాయింట్లను స్కోర్ చేసింది. ఇది అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కోసం కూడా టెస్ట్ చేయబడింది. ఇందులో కూడా 5-స్టార్ రేటింగ్ పొందగలిగింది. క్రాష్ టెస్ట్ చేయడానికి ఉపయోగించిన మోడల్ బేస్-స్పెక్ యాక్టివ్ ట్రిమ్. ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌బెల్ట్ రిమైండర్, ESC మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటివి స్టాండర్డ్ గా ఉంటాయి.

ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ యొక్క క్రెటా భారతీయ మార్కెట్లో కూడా మంచి అమ్మకాలను పొందుతోంది. దేశీయ మార్కెట్లో విక్రయించబడుతున్న హ్యుందాయ్ క్రెటా కూడా గ్లోబల్ NCAP ద్వారా టెస్ట్ చేయబడింది. అయితే మన దేశంలో ఉన్న హ్యుందాయ్ క్రెటా మాత్రం సేఫ్టీలో 3 స్టార్ రేటింగ్ పొందింది. GNCAP యొక్క కఠినమైన టెస్టింగ్ ప్రోటోకాల్ అమలులోకి రాకముందే క్రెటా మన దేశంలో టెస్టింగ్ చేయబడింది.

అప్పుడు ఇండియా స్పెక్ క్రెటా సైడ్ ఇంపాక్ట్, సేఫ్టీ అసిస్ట్ సిస్టమ్‌ లేదా పాదచారుల రక్షణ కోసం టెస్ట్ చేయలేదు. అయితే ఆ సమయంలోనే హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ పెద్దల రక్షణ కోసం 3 స్టార్ రేటింగ్‌ను సాధించి, ఈ ఎస్‌యూవీ యొక్క బాడీ షెల్ అస్థిరంగా ఉన్నట్లు కనుగొనబడింది. అంతే కాకుండా, ఈ కారు యొక్క ఫుట్‌రెస్ట్ కూడా చాలా అస్థిరంగా ఉన్నట్లు కనుగొనబడింది.

ఇండోనేషియాలో విక్రయించబడుతున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ చాలా సురక్షితమైన వాహనంగా పరిగణించబడుతోంది. అయితే మన దేషములో కూడా హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ను లాంచ్ చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది 2023 మధ్య భాగంలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది తప్పకుండా దాని మునుపటి మోడల్ కంటే మంచి సేఫ్టీ ఫీచర్స్ కలిగి మరింత మెరుగ్గా ఉంటుందని ఆశించవచ్చు.

Most Read Articles

English summary
New hyundai creta get 5 stars in asean ncap test
Story first published: Friday, December 9, 2022, 10:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X