భారత్‌లో విడుదలైన Lexus NX 350h: ధర రూ. 64.90 లక్షలు

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'లెక్సస్' (Lexus) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన కొత్త 'ఎన్ఎక్స్ 350హెచ్' (NX 350h) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్' ధర రూ. 64.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన Lexus NX 350h: ధర రూ. 64.90 లక్షలు

ఈ కొత్త 'లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్' పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ తో లభిస్తుంది. ఇది మార్కెట్లో మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి ఎక్స్‌క్విజిట్, లగ్జరీ మరియు ఎఫ్-స్పోర్ట్ వేరియంట్స్. వీటి ధరల విషయానికి వస్తే..

భారత్‌లో విడుదలైన Lexus NX 350h: ధర రూ. 64.90 లక్షలు
Lexus NX Price
Exquisite ₹64,90,000
Luxury ₹69,50,000
F-Sport ₹71,60,000
భారత్‌లో విడుదలైన Lexus NX 350h: ధర రూ. 64.90 లక్షలు

2022 లెక్సస్ NX 350h అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది సింగిల్-పీస్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త బంపర్‌లు, పొడవాటి హుడ్ మరియు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్‌ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకూండా కారు హుడ్ నుండి బంపర్ వరకు పెద్ద గ్రిల్‌ ఉంటుంది. అదే రేడియేటర్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. బూట్ డోర్‌పై 'లెక్సస్' బ్యాడ్జింగ్ కూడా మీరు చూడవచ్చు. మొత్తానికి ఇది చూడగానే ఆకర్షించే విధంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన Lexus NX 350h: ధర రూ. 64.90 లక్షలు

కొత్త Lexus NX 350h SUV యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 4,661 మిమీ పొడవు, 1,865 మిమీ వెడల్పు, 1,661 మిమీ ఎత్తు మరియు 2690 మిమీ వీల్‌బేస్ కలిగి ఉంటుంది. కావున వాహనం వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది.

భారత్‌లో విడుదలైన Lexus NX 350h: ధర రూ. 64.90 లక్షలు

ఇందులో 9.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ పొందుతుంది. అంతే కాకూండా ఇందులో 14 ఇంచెస్ నావిగేషన్ సిస్టమ్, 10-స్పీకర్ లెక్సస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు కొత్త స్టీరింగ్ వీల్ పొందుతుంది.

భారత్‌లో విడుదలైన Lexus NX 350h: ధర రూ. 64.90 లక్షలు

2022 లెక్సస్ NX 350h ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా, ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు వైపర్‌లు, కలర్ హుడ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రిక్ ఫ్రంట్ సీట్లు మరియు ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ రియర్ సీట్లను కలిగి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన Lexus NX 350h: ధర రూ. 64.90 లక్షలు

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టం (ఏబీఎస్), ఈబిడి, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లను కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధరిస్తాయి.

భారత్‌లో విడుదలైన Lexus NX 350h: ధర రూ. 64.90 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా, కొత్త లెక్సస్ NX 350h హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో జతచేయబడిన 2.5-లీటర్, 4-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 192 బిహెచ్‌పి పవర్ విడుదల చేస్తుంది, అయితే ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ 244 బిహెచ్‌పి పవర్ మిశ్రమ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ 6-స్పీడ్ CVT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

భారత్‌లో విడుదలైన Lexus NX 350h: ధర రూ. 64.90 లక్షలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త లెక్సస్ ఎన్ఎక్స్ 350హెచ్' (Lexus NX 350h) ఆడి Q5, బిఎండబ్ల్యు ఎక్స్3 ఫేస్‌లిఫ్టెడ్, Mercedes-Benz GLC మరియు Volvo XC60 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. మొత్తం మీద లెక్సస్ యొక్క కొత్త కారు దేశీయ మార్కెట్లో విడుదలైంది, కావున ఇది మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
New lexus 350h launched in india price features engine details
Story first published: Wednesday, March 9, 2022, 13:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X