భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

భారతీయ వాహన తయారీ దిగ్గజం మరియు ప్రజలకు ఎంతగానో నమ్మికైనా వెహికల్ బ్రాండ్ 'మహీంద్రా అండ్ మహీంద్రా' మార్కెట్లో తన కొత్త పికప్ ట్రక్ విడుదల చేసింది. ఈ పికప్ ట్రక్ పేరు 'మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ సిటీ 3000' (Mahindra Bolero MaXX Pik-Up City 3000). దీని ప్రారంభ ధర రూ. 7,68 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కొత్త మహీంద్రా పికప్ ట్రక్కు గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

ఇప్పుడు భారతీయ విఫణిలో విడుదలైన కొత్త 'మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ సిటీ 3000' కొనుగోలు కోసం కంపెనీ ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్స్ కూడా అందిస్తుంది. దీని కింద కొనుగోలుదారులు రూ. 25,000 చెల్లించి వెహికల బుక్ చేసుకోవచ్చు.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

పనితీరు మరియు విశ్వసనీయత కోసం దాని విభాగంలో స్థిరమైన బెస్ట్ సెల్లర్‌గా ఉంది. నవీకరించబడిన ట్రక్‌ను ప్రారంభించడంతో, మహీంద్రా మార్కెట్లో పెద్ద సంఖ్యలను సంపాదించాలని చూస్తోంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ఇప్పుడు మంచి పనితీరుని అందించాడని మరియు మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి అనుకూలంగా అప్డేట్ చేయబడింది. కావున ఇది వాహన వినియోగదారులకు తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఈ పికప్ ట్రక్ 1300 కేజీల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే సమయంలో దీని డెక్ వెడల్పు 1700 మిమీ వరకు ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

ఈ అప్డేటెడ్ మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ఇప్పుడు ఆధునిక LCV కనెక్టెడ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది మహీంద్రా iMAX టెలిమాటిక్స్ సొల్యూషన్ సమర్థవంతమైన వాహన నిర్వహణను ఎనేబుల్ చేయడానికి మరియు వ్యాపార ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడుతుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

మహీంద్రా కొత్త పికప్ ట్రక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కొత్త హెడ్‌ల్యాంప్‌లు, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ మరియు సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కూడిన కొత్త డ్యాష్‌బోర్డ్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా డ్రైవర్ ప్లస్ టూ ఫ్రంట్ సీటింగ్ సెటప్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, టర్న్ సేఫ్ లైట్ వంటివి కూడా ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

మహీంద్రా పికప్ ట్రక్కులోని ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.5-లీటర్ m2Di యూనిట్‌ ఉంటుంది. ఇది 65 బిహెచ్‌పి పవర్ మరియు 195 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక లీటరుకు 17.2 కిమీ మైలేజ్ అందిస్తుంది. కంపెనీ ఇప్పుడు దీనిపైన మహీంద్రా 20,000 కిలోమీటర్ల సుదీర్ఘ సేవా విరామంతో 3 సంవత్సరాల/1,00,000 కిమీ వారంటీని కూడా అందిస్తోంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే, దీని ముందు మరియు వెనుక భాగంలో లీఫ్ స్ప్రింగ్‌లు ఉంటాయి. కావున ఇవి మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తాయి. ఈ కొత్త పికప్ ట్రక్కు అన్ని విధాలా అనుకూలంగా ఉండేలా ఇప్పుడు ఆధునిక డిజైన్ మరియు టెక్నాజీలతో విడుదల హేయడం జరిగింది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

మహీంద్రా యొక్క బొలెరో మ్యాక్స్ పిక్-అప్ సిటీ 3000 విడుదలసమయంలో కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ 'విజయ్ నక్రా' మాట్లాడుతూ.. కస్టమర్ల జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేయడానికి, వారు మరింత సంపాదించడానికి మరియు అభివృద్ధి చెందడానికి మేము నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాము. ఇందులో భాగంగానే ఈ పికప్ ట్రక్కు తీసుకురావడం జరిగిందన్నారు. ఇది తన విభాగంలో తప్పకుండా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటుందన్నారు.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

అదే సమయంలో మహీంద్రా ఆటోమోటివ్ టెక్నాలజీ అండ్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ 'ఆర్. వేలుసామి' మాట్లాడుతూ.. మార్కెట్‌లో ప్రస్తుతం పికప్ ట్రక్కులకు మంచి డిమాండ్ ఉంది. ఈ సమయంలో కంపెనీ లాంఛ్ చేసిన బొలెరో మ్యాక్స్ పిక్-అప్ సిటీ 3000 తప్పకుండా దాని ప్రత్యర్థులను ఎదుర్కొని కస్టమర్లను ఆకర్శించడం విజయం పొందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో మ్యాక్స్ పిక్-అప్ ట్రక్: ధర & పూర్తి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మహీంద్రా కంపెనీ ఇటీవల తన 'జీతో ప్లస్ సిఎన్‌జి చార్‌సౌ' విడుదల చేసింది. ఇప్పుడు 'బొలెరో మ్యాక్స్ పిక్-అప్ సిటీ 3000' విడుదల చేసింది. వాణిజ్య రంగంలో ప్రజలకు ఉపయోగకరంగా ఉండటానికి కంపెనీ నిరంతరం కృషి చేస్తూనే ఉంది. అంతే కాకుండా కంపెనీ యొక్క వాహనాలకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది, కావున ఈ కొత్త మహీంద్రా వెహికల్స్ మంచి అమ్మకాలు పొందుతాయని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
New mahindra maxx pick up city 3000 launched price features and details
Story first published: Thursday, August 11, 2022, 10:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X