Eeco ప్రియులకు గుడ్ న్యూస్.. ఎందుకో ఇక్కడ చూడండి

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) దేశీయ మార్కెట్లో తన ఉనికిని నిరంతరం చాటుకోవడానికి ఎప్పటికప్ప్పుడు కొత్త కొత్త వాహనాలను విడుదల చేస్తోంది. అంతే కాకుండా కంపెనీ తన పాత మోడళ్లను కూడా అప్డేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే 'మారుతి ఈకో' (Maruti Eeco) ఎమ్‌పివి ని కూడా అప్డేట్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

కొత్త అవతార్‌లో రావడానికి సిద్దమవుతున్న 'మారుతి ఈకో'.. వివరాలు

భారతీయ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ తో ముందుకు సాగిన 'మారుతి ఈకో' ఈ జులైలో నిలిపివేయబడే అవకాశం ఉంది. అయితే కంపెనీ దీనిని మరిన్ని అధునాతన హంగులతో మళ్ళీ రానున్న పండుగ సీజన్ లో విడుదల చేసే అవకాశం ఉంది. 'మారుతి ఈకో' 2010 లో భారతీయ విఫణిలో ప్రారంభమైంది.

కొత్త అవతార్‌లో రావడానికి సిద్దమవుతున్న 'మారుతి ఈకో'.. వివరాలు

మారుతి ఈకో భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా విపరీతమైన అమ్మకాలు చేపట్టగలిగింది. ఈ MPV ఎక్కువ అమ్మకాలు పొందటానికి ప్రధాన కారణం, ఇది 'మల్టీ పర్పస్ వెహికల్'. ఇది చూడటానికి పెద్దదిగా ఉండటమే కాకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

కొత్త అవతార్‌లో రావడానికి సిద్దమవుతున్న 'మారుతి ఈకో'.. వివరాలు

మారుతి ఈకో ఎక్కువగా డెలివరీ చేయడానికి మరియు ట్రావెల్ సెగ్మెంట్‌లోని కస్టమర్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇది తక్కువ ధర వద్ద లభ్యమవుతుంది మరియు మంచి మైలేజ్ కూడా అందిస్తుంది. కావున మార్కెట్లో మంచి విజయం పొందింది.

కొత్త అవతార్‌లో రావడానికి సిద్దమవుతున్న 'మారుతి ఈకో'.. వివరాలు

మారుతి యొక్క ఈకో MPV ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంగా రూపొందించబడింది. కావున ఇది బలమైన లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ కలిగి ఉంది. ఇది 7-సీట్, రియర్ వీల్ డ్రైవ్ మరియు రెస్పాన్సివ్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఈకోను సిఎన్‌జి మోడల్‌లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

కొత్త అవతార్‌లో రావడానికి సిద్దమవుతున్న 'మారుతి ఈకో'.. వివరాలు

మారుతి ఈకో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ సేఫ్టీ ఫీచర్స్ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. అయితే ఇందులో పవర్ స్టీరింగ్, సీట్ హైట్ అడ్జస్టబుల్, స్టీరింగ్ హైట్ అడ్జస్టబుల్ వంటివి ప్రస్తుత ఈకో మోడల్‌లో ప్రామాణికంగా అందుబాటులో లేదు. అయితే ఇవన్నీ రానున్న కొత్త మోడల్ లో అందుతులో ఉండే అవకాశం ఉంది.

కొత్త అవతార్‌లో రావడానికి సిద్దమవుతున్న 'మారుతి ఈకో'.. వివరాలు

మారుతి సుజుకి కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనున్న లేటెస్ట్ ఈకో మోడల్ ని ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది. కావున ఇద్న్హులో మరిన్ని ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. అయితే డిజైన్ మొదలైన ఫీచర్స్ అన్నీ కూడా ప్రస్తుతము అందుబాటులో ఉన్న ఈకో మాదిరిగానే ఉంటుంది.

కొత్త అవతార్‌లో రావడానికి సిద్దమవుతున్న 'మారుతి ఈకో'.. వివరాలు

రానున్న కొత్త మారుతి ఈకోలో ఉండే ఇంజిన్ గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. ప్రస్తుతం ఉన్న ఈకో మోడల్ లోనే ఇంజిన్ తో వచ్చే అవకాశం ఉంది, కానీ పవర్ మరియు టార్క్ వంటివి కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత తరం ఈకోలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడింది. ఈ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్ మరియు 98 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. మొత్తం మీద దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే అందుబటులోకి వస్తుంది.

కొత్త అవతార్‌లో రావడానికి సిద్దమవుతున్న 'మారుతి ఈకో'.. వివరాలు

ఇదిలా ఉండగా కంపెనీ ఇప్పుడు తన కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన విటారా బ్రెజ్జాను కూడా అప్‌గ్రేడ్ చేస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఈ 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా భారతీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఇప్పటికే బయటపడ్డాయి. ఈ ఫోటోల ప్రకారం కొత్త 2022 మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ వంటి వాటిలో ఎక్కువ మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
New maruti suzuki eeco to launch in festive season details
Story first published: Sunday, May 29, 2022, 14:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X