Just In
- 2 hrs ago
రేపటి నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- 8 hrs ago
టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయ ప్రముఖులు: రితేష్ దేశ్‌ముఖ్ నుంచి ముఖేష్ అంబానీ వరకు..
- 1 day ago
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- 1 day ago
సిట్రోయెన్ eC3 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్
Don't Miss
- News
వారి రాజకీయం.. 'నభూతో.. నభవిష్యతి'?
- Sports
భవిష్యత్తులో మూడు జట్లు.. టీమిండియాపై మాజీ లెజెండ్ కామెంట్స్
- Finance
Adani Group: శుభవార్త చెప్పిన గౌతమ్ అదానీ..! త్వరలోనే ప్రారంభం కానున్న 5 IPOలు..
- Movies
SSMB 28: మహేష్ బాబుతో పోటీకి సిద్ధమైన మరో ఇద్దరు సూపర్ స్టార్స్.. ఆ సమయంలో బిగ్ క్లాష్!
- Lifestyle
Weekly Horoscope22.01.2023-28.01.2023 - ఈ వారం ఈ రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి...
- Technology
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
ఇప్పటికీ తగ్గని మారుతి గ్రాండ్ విటారా క్రేజ్.. రోజు రోజుకి భారీగా పెరుగుతున్న బుకింగ్స్
ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి భారతీయ మార్కెట్లో గత సెప్టెంబర్ నెలలో కొత్త గ్రాండ్ విటారా విడుదల చేసిన విషయం తెలిసిందే. కంపెనీ ఈ మిడ్-సైజ్ SUV కోసం ఇప్పటి వరకు దాదాపు 87,953 బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం.
మారుతి సుజుకి తన కొత్త గ్రాండ్ విటారా కోసం 2022 జులై నుంచే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాగా ఇప్పటికి దాదాపు 87,953 బుకింగ్స్ స్వీకరించగలిగింది. నిజంగానే కంపెనీ బుకింగ్స్ ఈ అరుదైన విజయాన్ని కేవలం 6 నెలల కంటే తక్కువ సమయంలోనే తన ఖాతాలో వేసుకుంది. కాగా కంపెనీ ఈ SUV యొక్క డెలివరీలను కూడా ఇప్పటికే ప్రారంభించింది. అయితే 50,000 డెలివరీలు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

మారుతి సుజుకి డెలివరీలో భాగంగా మొదటి సారి 4,800 యూనిట్లను డెలివరీ చేసింది. కాగా రెండవ సారి డెలివరీలో భాగంగా 8,052 యూనిట్లకు డెలివరీలను చేసింది. కాగా రానున్న రోజుల్లో ఈ డెలివరీల సంఖ్య తప్పకుండా పెరిగే అవకాశం ఉంది. మారుతి గ్రాండ్ విటారా టాప్ మోడల్ ధర రూ. 19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ లేటెస్ట్ సూప్ ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది.
మారుతి గ్రాండ్ విటారా దేశీయ మార్కెట్లో రూ. 10.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైంది. కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ లాంచ్ చేయడానికి ముందునుంచి స్వీకరించడం ప్రారంభించింది. అయితే ఈ SUV మార్కెట్లో లాంచ్ అయ్యే సమయానికి 50,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందగలిగింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ కొత్త మోడల్ కి మార్కెట్లో ఎంత ఆదరణ ఉందొ అర్థమవుతోంది.
గ్రాండ్ విటారా మొత్తం 9-కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 6-మోనోటోన్ కలర్స్, మిగిలిన మూడు డ్యూయల్ టోన్ కలర్స్. మోనోటోన్ కలర్స్ లో నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, స్ప్లెండిడ్ సిల్వర్, గ్రాండ్యుర్ గ్రే, చెస్ట్నట్ బ్రౌన్ మరియు ఓపులెంట్ రెడ్ కలర్స్ ఉన్నాయి. డ్యూయెల్ టోన్ కలర్స్ లో ఆర్కిటిక్ వైట్ విత్ బ్లాక్, స్ప్లెండిడ్ సిల్వర్ విత్ బ్లాక్ మరియు ఓపులెంట్ రెడ్ విత్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి.
2022 గ్రాండ్ విటారా 1.5 లీటర్, 4 సిలిండర్ K15C స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్, 3 సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ అనే రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని మొదటి ఇంజిన్ 103 హెచ్‌పి పవర్ మరియు 136 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.
ఇక 1.5-లీటర్, 3-సిలిండర్ల అట్కిన్సన్ సైకిల్ TNGA పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 92 హెచ్‌పి మరియు 4,400 ఆర్‌పిఎమ్ వద్ద 122 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది AC సింక్రోనస్ మోటార్‌తో కలిపి 79 హెచ్‌పి మరియు 141 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మొత్తమ్ మీదుగా ఇది 115 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది 6-స్పీడ్ CVT తో జతచేయబడి ఉంటుంది.
ఇదిలా ఉండగా మారుతి గ్రాండ్ విటారా త్వరలోనే CNG రూపంలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. కావున గ్రాండ్ విటారా CNG వెర్షన్ లో 1.5-లీ K25C పెట్రోల్ ఇంజన్ మరియు CNG కిట్ ఉంటుంది. కాగా పవర్, టార్క్ వంటివి సాధారణ మోడల్ కంటే తక్కువగా ఉంటాయి. కానీ మైలేజ్ పెట్రోల్ ఇంజిన్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కంపెనీ త్వరలోనే వెల్లడిస్తుంది.