భారత్‌లో కొత్త Land Rover SV బుకింగ్స్ మొదలయ్యాయి.. చూసారా!!

ప్రముఖ లగ్జరీ కార్ తయారీ సంస్థ ల్యాండ్ రోవర్ ఇండియా (Land Rover India) భారతీయ మార్కెట్లో కొత్త రేంజ్ రోవర్ SV (Range Rover SV) కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించిది. ఈ SUV అధూరిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది త్వరలోనే దేశీయ విఫణిలో అడుగుపెట్టనుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో కొత్త Land Rover SV బుకింగ్స్ మొదలయ్యాయి.. చూసారా!!

భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ SUV ధరలు రూ. 2.32 కోట్ల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ రేంజ్ రోవర్ SV అనేది వేరియంట్ పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్‌షిప్ SUV. ఇది ఐదు సీట్ల LWB కాన్ఫిగరేషన్‌తో స్టాండర్డ్ మరియు లాంగ్ వీల్‌బేస్ (LWB) వెర్షన్‌లలో మొదటిసారిగా అందుబాటులో ఉంటుంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో కొత్త Land Rover SV బుకింగ్స్ మొదలయ్యాయి.. చూసారా!!

ఈ నాలుగు-సీట్ల రేంజ్ రోవర్ SV సిగ్నేచర్ సూట్‌ను ఎలక్ట్రికల్‌గా ఉంచిన క్లబ్ టేబుల్ మరియు ఇంటిగ్రేటెడ్ రిఫ్రిజిరేటర్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీని గురించి జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా ప్రెసిడెంట్ 'ఎండీ రోహిత్ సూరి' వెల్లడించారు.

భారత్‌లో కొత్త Land Rover SV బుకింగ్స్ మొదలయ్యాయి.. చూసారా!!

అంతే కాకూండా ఇతడు కొత్త రేంజ్ రోవర్ SV మరింత లగ్జరీ మరియు వ్యక్తిగతీకరణ ఎంపికలతో మార్కెట్లోకి ప్రవేశపెట్టబడుతుందని, మా కస్టమర్‌లు వారి స్వంత ఉపయోగం కోసం ఇవి చాలా అనుకూలంగా ఉంటాయని, అది మాత్రమే కాకుండా ఇది అద్భుతమైన లగ్జరీ అనుభూతిని కూడా అందిస్తుందని తెలిపాడు.

భారత్‌లో కొత్త Land Rover SV బుకింగ్స్ మొదలయ్యాయి.. చూసారా!!

కొత్త రేంజ్ రోవర్ SV అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇందులో భాగంగానే ఇది విభిన్నమైన బంపర్, కొత్త ఫైవ్-బార్ గ్రిల్ డిజైన్‌తో పాటు స్మూత్ సెరామిక్స్, మెరిసే పూతతో కూడిన లోహాలతో సహా అద్భుతమైన మెటీరియల్‌లను కలిగి ఉంది. ఇవన్నీ చూడగానే ఆకర్షించే విధంగా ఉంటాయి.

భారత్‌లో కొత్త Land Rover SV బుకింగ్స్ మొదలయ్యాయి.. చూసారా!!

కొత్త రేంజ్ రోవర్ SV మోడల్ 13.1 ఇంచెస్ రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది వెనుక ప్రయాణికులకు చాలా వరకు ఎంటర్టైమ్నెట్ చేస్తుంది. ఇది కొత్త సిరామిక్ SV రౌండల్ మరియు సరళీకృత SV పేరును ఉపయోగించడానికి అందిస్తుంది.

భారత్‌లో కొత్త Land Rover SV బుకింగ్స్ మొదలయ్యాయి.. చూసారా!!

కొత్త రేంజ్ రోవర్ SV లో కొత్త 4.4-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ ఉపయోగించబడింది. ఇది 523 బిహెచ్‌పి పవర్ మరియు 750 న్యూటన్ మీటర్ టార్క్‌ అందిస్తుంది. అదే సమయంలో ఇది 3.0-లీటర్ స్ట్రెయిట్-సిక్స్ డీజిల్ ఇంజన్‌తో కూడా అందుబటులో ఉంటుంది. ఈ ఇంజన్ 346 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ రెండు ఇంజన్లు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని ఉపయోగిస్తుంది.

భారత్‌లో కొత్త Land Rover SV బుకింగ్స్ మొదలయ్యాయి.. చూసారా!!

ఇదిలా ఉండగా బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) తమ ఐదవ తరం 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ (2022 Land Rover Range Rover) ఎస్‌యూవీని ఇప్పటికే అధికారికంగా ఆవిష్కరించింది. కంపెనీ ఈ ఎస్‌యూవీని కొత్త స్టైల్ మరియు కొత్త ఇంజన్ ఆప్షన్‌లతో పరిచయం చేసింది.

భారత్‌లో కొత్త Land Rover SV బుకింగ్స్ మొదలయ్యాయి.. చూసారా!!

కొత్త 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీలో కొత్త డిజైన్ మరియు కొత్త ఇంజన్ ఆప్షన్లే కాకుండా, కంపెనీ ఇందులో అనేక ఆధునిక ఫీచర్లను కూడా జోడించింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ 2022 రేంజ్ రోవర్ కారును తమ కొత్త ఎమ్ఎల్ఏ ఫ్లెక్స్ (MLA Flex) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించింది.

ల్యాండ్ రోవర్ ఈ కొత్త ఎస్‌యూవీని ఆవిష్కరించడంతో పాటుగా, తమ ఈవీ ప్లాన్స్ గురించి కూడా కంపెనీ వెల్లడి చేసింది. కొత్త 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ రాబోయే రెండేళ్లలో ప్రత్యేక ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ ను కూడా పొందుతుందని కంపెనీ ధృవీకరించింది.

భారత్‌లో కొత్త Land Rover SV బుకింగ్స్ మొదలయ్యాయి.. చూసారా!!

కొత్త 2022 ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎస్‌యూవీ గురించి చెప్పాలంటే, దీని పొడవు 5 మీటర్ల కంటే ఎక్కువగా ఉంచబడింది మరియు వీల్‌బేస్ కూడా కూడా మునుపటి కన్నా పొడవుగా ఉంటుంది. ఇందులో లాంగ్ వీల్‌బేస్ వెర్షన్ పొడవు 5.25 మీటర్లు, వెడల్పు 2.20 మీటర్లు, ఎత్తు 1.87 మీటర్లు మరియు వీల్‌బేస్ 3.19 మీటర్లుగా ఉంటుంది. స్టాండర్డ్ వెర్షన్ యొక్క వీల్‌బేస్ 3 మీటర్లుగా ఉంటుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ 6-సిలిండర్ మరియు 8-సిలిండర్ ఇంజన్‌ల శ్రేణితో అందించబడుతుంది. ముఖ్యంగా, ఈ కారులో రెండు ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజన్లు P440e మరియు P510e, మూడు పెట్రోల్ ఇంజన్లు (P360, P400 మరియు P530) మరియు మూడు డీజిల్ (D250, D300, D350) ఇంజన్లు అందించబడ్డాయి. ఇందులో 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
New range rover sv suv pre booking started features engine price details
Story first published: Thursday, January 27, 2022, 18:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X