కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

భారతదేశపు వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కి ఉన్న ఘనత ప్రపంచంలో దాదాపు చాలా దేశాలకు తెలుసు. అయితే ఇటీవల మరో అరుదైన గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ టాటా మోటార్స్ సొంతం చేసుకున్న ఆ ఘనత ఏమిటి మరియు అది రావడటానికి కారణం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, టాటా మోటార్స్ యొక్క 'నెక్సాన్ ఈవి మ్యాక్స్' (Nexon EV MAX) సముద్రమట్టానికి దాదాపు 19,024 అడుగుల ఎత్తులో లడఖ్‌లో ఉన్న 'ఉమ్లింగ్ లా పాస్' వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటరబుల్ రహదారిని విజయవంతంగా చేరుకుంది. ఇది నిజంగానే కంపెనీ సాధించిన గొప్ప రికార్డ్. దీనికి గాను 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌'లో స్థానం సంపాదించింది.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

టాటా నెక్సాన్ ఈవీ అనేది ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఉత్తమమైన అమ్మకాలు పొందుతున్న కారు. ఇది కేవలం రోజువారీ ఉపయోగానికి మాత్రమే కాకుండా.. ఎత్తైన ప్రదేశాలలో కూడా తిరగటానికి అనుకూలంగా ఉంటుందని ఇప్పుడు రుజువైంది. ఈ రికార్డును 2022 సెప్టెంబర్ 18 న సాధించింది. దీనికోసం నిపుణులైన డ్రైవర్లు పాల్గొన్నారు.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్ సాధించిన ఈ విజయం గురించి టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీస్ స్ట్రాటజీ హెడ్ 'వివేక్ శ్రీవత్స' మాట్లాడుతూ.. నెక్సాన్ ఇవి అమ్మకాలపరంగా మాత్రమే కాకుండా దాని సామర్త్యాలను నిరూపించుకోవడంలో కూడా గొప్ప రికార్డ్ సొంతం చేసుకుంది. ఒక పూర్తి ఛార్జింగ్ తో ఎక్కువ పరిధిని అందించడమే కాకుండా, అత్యధిక ఎత్తు, గాలి మరియు టాక్కువ పీడనామ్ కలిగిన ప్రాంతాల్లో కూడా తనకు తానే సాటిగా నిలిచింది. ఇది రాబోయే రోజుల్లో మరింత మంది కస్టమర్లను తాపకుండా ఆకర్సింస్తుందని ఆయన అన్నారు.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

టాటా నెక్సాన్ ఈవి మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన SUV. అయితే ఇందులో మరింత ఎక్కువ రేంజ్ అందించే వాహనం కావాలనుకునే వినియోగదారుల కోసం కంపెనీ 2022 మే 17 న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్' విడుదల చేసింది. విడుదల సమయంలో ఈ ఎలక్ట్రిక్ SUV ప్రారంభ ధర రూ. 17.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు ఈ ధరలు పెరిగాయి, కావున వీటి ధరలు ఇప్పుడు రూ. 18.34 లక్షల నుంచి రూ. 20.04 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ అనేది రెండు వేరియంట్లు మరియు రెండు రకాల చార్జర్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. అవి XZ+ మరియు XZ+ Lux అనే వేరియంట్లు, అదే సమయంలో ఇవి 3.3kW చార్జర్ మరియు 7.2kW ఏసి ఫాస్ట్ చార్జర్‌తో విక్రయించబడుతున్నాయి. కొనుగోలుదారుడు ఎంచుకునే ఛార్జింగ్ ఆప్సన్ ని బట్టి ధరలు ఉంటాయి.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో ఇప్పుడు పెద్ద 40.5kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. కావున ఇది ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో ఏకంగా 437 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా సర్టిఫైడ్ చేయబడింది. అయితే వాస్తవ ప్రపంచంలో, వివిధ వాతావరణ పరిస్థితుల్లో తప్పకుండా 312 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. అంటే రేంజ్ విషయంలో స్టాండర్డ్ మోడల్ కంటే కూడా 125 కిమీ ఎక్కువ రేంజ్ ఈ SUV కొనుగోలుచేయడం వల్ల పొందవచ్చు.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

అందుబాటులో ఉన్న స్టాండర్డ్ నెక్సాన్ ఈవీలో 141 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ అందించే ఒకే ఎలక్ట్రిక్ AC మోటార్ ఉంటుంది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో కూడా ఇదే సెటప్ ఉంటుంది. కానీ బ్యాటరీ ప్యాక్ పెద్దదిగా ఉంటుంది. అయినప్పటికీ ఇది కేవలం 9 సెకన్లలోనే గంటకు 0-100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ SUV గరిష్ట వేగం గంటకు 140 కిమీ వరకు ఉంటుంది.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో మల్టీ-మోడ్ రీజెనరేటివ్ బ్రేకింగ్‌ సిస్టం కూడా ఉంది. ఇందులో రీజెన్ బ్రేకింగ్ యొక్క నాలుగు వేర్వేరు స్థాయిలు ఉన్నాయి, ఇవి రీజెన్ లేని స్థాయి నుండి వన్-పెడల్ మోడ్ వరకు ఉంటాయి. ఫలితంగా, ఇది కేవలం 1 పెడల్‌తో డ్రైవ్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కారణంగా, బ్రేక్ వేసిన ప్రతిసారి వచ్చే పవర్, బ్యాటరీను చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా అనుకూలమైన ఫీచర్.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

నెక్సాన్ ఈవి మ్యాక్స్ లోని బ్యాటరీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జర్లను సపోర్ట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ SUV లోని 40.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ను ఫాస్ట్ 50kW DC ఛార్జర్‌కి కనెక్ట్ చేసినప్పుడు కేవలం 56 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. 7.2kWh AC ఛార్జర్‌ సాయంతో బ్యాటరీని ఇంటి వద్దనే పూర్తిగా చార్జ్ చేయడానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లో ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. నిజానికి దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఇందులో 30 అదనపు ఫీచర్లు ఉన్నాయి. కావున ఇందులో మల్టీ-లెవల్ రీజెన్ బ్రేకింగ్‌ సిస్టమ్, యాక్టివ్ మోడ్ డిస్‌ప్లేతో కూడిన కంట్రోల్ నాబ్, సరికొత్త మకరనా బేజ్ ఇంటీరియర్స్, ముందు ప్రయాణికుల కోసం వెంటిలేషన్‌తో కూడిన లెథెరెట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మరియు క్రూయిజ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

నెక్సాన్ ఈవి మ్యాక్స్ యొక్క డిజైన్ దాదాపుగా దాని స్టాండర్డ్ మోడర్న్ ని గుర్తుకు తెస్తుంది. అయితే ఇందులో కొన్ని అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్స్ చూడవచ్చు. అవి ఫ్రంట్ గ్రిల్‌కు ఇరువైపులా ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఎక్స్టీరియర్‌లో లైట్ బ్లూ కలర్ హైలైట్‌లు కనిపిస్తాయి. నెక్సాన్ EV MAX ఇప్పుడు కొత్త ఇంటెన్సి-టీల్ అనే సిగ్నేచర్ బాడీ కలర్‌లో లభిస్తుంది. ఇక ఇందులోని ఇతర కలర్ ఆప్షన్లలో డేటోనా గ్రే మరియు ప్రిస్టీన్ వైట్ ఉన్నాయి. డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

కొత్త రికార్డ్ కైవసం చేసుకున్న 'నెక్సాన్ ఈవి మ్యాక్స్'.. ఇక టాటా మోటార్స్‌కి తిరుగే లేదుగా..

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం ఏకత్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది, అయితే ఇప్పుడు కూడా ఎక్కువమందికి ఉన్న అనుమానం రేంజ్, అయితే వారి అనుమానాలన్నింటికీ చక్కటి సమాధానం ఇప్పుడు నెక్సాన్ ఈవి మ్యాక్స్ రూపంలో లభించింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన మార్గాల్లో ప్రయాణించి తనకుతానే సాటిగా నిలిచింది. ఇది కంపెనీ చరిత్రలోనే మరచిపోలేని గొప్ప విజయం.

Most Read Articles

English summary
New tata nexon ev max reaches indias highest motorable road details
Story first published: Saturday, September 24, 2022, 9:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X