'టాటా పంచ్ క్యామో ఎడిషన్' లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

'టాటా మోటార్స్' (Tata Motors) యొక్క వాహనాలకు దేశీయ మార్కెట్లో ఎంత ఆదరణ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకర్షణీయమైన డిజైన్, అప్డేట్ ఫీచర్స్ మాత్రమే కాకుండా, అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ టాటా వాహనాల యొక్క సొంతం. ఈ కారణాల వల్ల బ్రాండ్ వాహనాలు ఇప్పటికి కూడా అద్భుతమైన అమ్మకాలు పొందుతూ ముందుకు సాగుతున్నాయి.

టాటా పంచ్ క్యామో ఎడిషన్: ధర, ఫీచర్స్ & పర్ఫామెన్స్

టాటా మోటార్స్ యొక్క 'టాటా పంచ్' మైక్రో SUV మార్కెట్లో విడుదలైనప్పటినుంచి కూడా ఉత్తమమైన అమ్మకాలు పొంది అతి తక్కువ కాలంలోనే బ్రాండ్ యొక్క బెస్ట్ SUV గా నిలిచిపోయింది. అయితే కంపెనీ ఇప్పుడు ఇందులో క్యామో ఎడిషన్ అనే స్పెషల్ ఎడిషన్ విడుదల చెసింది. ఈ కొత్త ఎడిషన్ యొక్క ధరలు మాత్రమే కాకుండా తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా పంచ్ క్యామో ఎడిషన్: ధర, ఫీచర్స్ & పర్ఫామెన్స్

టాటా పంచ్ క్యామో ఎడిషన్ ధరలు:

టాటా పంచ్ క్యామో ఎడిషన్ అనేది కేవలం అడ్వెంచర్ మరియు అకాంప్లిష్డ్ ట్రిమ్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. ధరలు ఈ కింద చూడవచ్చు..

 • టాటా పంచ్ క్యామో అడ్వెంచర్ (MT): రూ. 6.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)
 • టాటా పంచ్ క్యామో అడ్వెంచర్ (AMT): రూ. 7.45 లక్షలు (ఎక్స్-షోరూమ్)
 • టాటా పంచ్ క్యామో అడ్వెంచర్ రిథమ్ (MT): రూ. 7.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)
 • టాటా పంచ్ క్యామో అడ్వెంచర్ రిథమ్ (AMT): రూ. 7.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)
 • టాటా పంచ్ క్యామో అకాంప్లిష్డ్ (MT): రూ. 7.65 లక్షలు (ఎక్స్-షోరూమ్)
 • టాటా పంచ్ క్యామో అకాంప్లిష్డ్ (AMT): రూ. 8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)
 • టాటా పంచ్ క్యామో అకాంప్లిష్డ్ డాజిల్ (MT): రూ. 8.03 లక్షలు (ఎక్స్-షోరూమ్)
 • టాటా పంచ్ క్యామో అకాంప్లిష్డ్ డాజిల్ (AMT): రూ. 8.63 లక్షలు (ఎక్స్-షోరూమ్)
 • టాటా పంచ్ క్యామో ఎడిషన్: ధర, ఫీచర్స్ & పర్ఫామెన్స్

  ఎక్స్టీరియర్ డిజైన్:

  భారతీయ మార్కెట్లో వివలైన కొత్త 'టాటా పంచ్ క్యామో ఎడిషన్' ఇప్పుడు ఫోలేజ్ గ్రీన్ అనే కొత్త కలర్ లో విడుదలైంది. కావున ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా భిన్నంగా కనిపిస్తుంది. అంతే కాకుండా రూఫ్ కూడా బ్లాక్ మరియు వైట్ కలర్ లో వస్తుంది. కావున కొనుగోలుదారులు తమకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.

  టాటా పంచ్ క్యామో ఎడిషన్: ధర, ఫీచర్స్ & పర్ఫామెన్స్

  గ్రిల్‌కి కింది భాగంలో క్రోమ్ ట్రిమ్ బ్లాక్ అవుట్ చేయబడి, ఫ్రంట్ బంపర్‌లో కొత్త సిల్వర్ స్కిడ్ ప్లేట్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పూర్తిగా బ్లాక్ కలర్ లోనే ఉన్నాయి. ఫ్రంట్ పెండర్ పైన 'CAMO' బ్యాడ్జింగ్‌ చూడవచ్చు. మొత్తం మీద ఎక్స్టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

  టాటా పంచ్ క్యామో ఎడిషన్: ధర, ఫీచర్స్ & పర్ఫామెన్స్

  ఇంటీరియర్ ఫీచర్స్:

  టాటా పంచ్ క్యామో ఎడిషన్ యొక్క ఇంటీరియర్ కూడా దాని మునుపటి మోడల్ కి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే సీట్లు ఒక ప్రత్యేకమైన మిలిటరీ గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇది ఎక్స్టీరియర్ కి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉంటుంది. అయితే ఫీచర్స్ దాదాపుగా మునుపటి మోడల్ మాదిరిగానే ఉన్నాయి.

  టాటా పంచ్ క్యామో ఎడిషన్: ధర, ఫీచర్స్ & పర్ఫామెన్స్

  ఇందులో 7 ఇంచెస్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హర్మాన్ ఆడియో సిస్టం కూడా ఉన్నాయి. ఇందులోని 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తుంది. కూల్డ్ గ్లోవ్ బాక్స్, లెదర్ స్టీరింగ్ మరియు గేర్ నాబ్ వంటివి అలాగే ఉన్నాయి.

  టాటా పంచ్ క్యామో ఎడిషన్: ధర, ఫీచర్స్ & పర్ఫామెన్స్

  ఇంజిన్ & పర్ఫామెన్స్:

  కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్ లో మెకానికల్ అప్డేట్స్ లేవు, కావున అదే 1.2-లీటర్, నేచురల్‌ ఆస్పిరేటెడ్, 3-సిలిండర్, రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 84.48 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

  టాటా పంచ్ క్యామో ఎడిషన్: ధర, ఫీచర్స్ & పర్ఫామెన్స్

  సేఫ్టీ ఫీచర్స్:

  టాటా కంపెనీ యొక్క వాహనాలంటేనే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యతను కల్పిస్తారని ప్రజల నమ్మకం. కావున కంపెనీ ఈ టాటా పంచ్ క్యామో ఎడిషన్ లో కూడా స్టాండర్డ్ మోడల్ లో మాదిరిగానే అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ అందించారు. ఇది గ్లోబల్-NCAP నుంచి 5 స్టార్ రేటింగ్ పొంది మార్కెట్లో కొనుగోలు చేయగలిగిన అత్యుత్తమ సురక్షితమైన కార్లలో ఒకటిగా ఉంది.

  టాటా పంచ్ క్యామో ఎడిషన్: ధర, ఫీచర్స్ & పర్ఫామెన్స్

  ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబీఎస్ విత్ ఈబిడి, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్లు, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు ఐడిల్ స్టార్ట్ స్టాప్ టెక్నాలజీ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం మీద ఇది భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సురక్షితమైన వాహనాలలో ఒకటి.

  టాటా పంచ్ క్యామో ఎడిషన్: ధర, ఫీచర్స్ & పర్ఫామెన్స్

  డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

  టాటా పంచ్ క్యామో ఎడిషన్ చూడటానికి కొత్తగా ఉండటమే కాదు, దాని మునుపటి మోడల్ మాదిరిగానే అదే పనితీరుని, అవే సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటాయి. ఈ కొత్త ఎడిషన్ దేశీయ మార్కెట్లో ఈ పండుగ సీజన్లో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
New tata punch camo edition all details
Story first published: Friday, September 23, 2022, 14:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X