దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

దేశీయ విఫణిలో 'టయోటా' (Toyota) కంపెనీ తన కొత్త 'టొయోటా గ్లాంజా' (Toyota Glanza) విడుదల చేయనుంది. అయితే కంపెనీ ఈ కొత్త మోడల్ యొక్క బుకింగ్స్ ఎట్టకేలకు ప్రారంభించింది. దీని కోసం కష్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో లేదా కంపెనీ యొక్క డీలర్‌షిప్‌ను సందర్శించి రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. త్వరలో భారతీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త టొయోటా గ్లాంజా గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

కొత్త టొయోటా గ్లాంజా నాలుగు వేరియంట్లలో విడుదల కానుంది. అయితే రెండు గేర్‌బాక్స్‌లతో (మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆప్సన్) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. టొయోటా గ్లాంజాలో కంపెనీ ఆధునిక డిజైన్, ఫీచర్లు మరియు సేఫ్టీ ఫీచర్స్ వంటి వాటిని అందిస్తుంది. కావున ఇది ఈ ఆధునిక కాలంలో ఉపయోగించదగినదిగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

టయోటా గ్లాంజా అనేది కంపెనీ దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్న అత్యంత తక్కువ ధర కలిగిన మోడల్ కానుంది. కావున ఇది తప్పకుండా ఎక్కువమంది కొనుగోలుదారులను తప్పకుండా ఆకర్షిస్తుంది. ఇది 89 బిహెచ్‌పి పవర్ అందించే శక్తివంతమైన కె-సిరీస్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్ పొందుతుంది. కావున ఇది మంచి పరిధిని కూడా అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

కంపెనీ ఈ కొత్త మోడల్ లో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా లేటెస్ట్ ఫీచర్స్ తో రానుంది. ఇందులో హెడ్స్-అప్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఐసోఫిక్స్ యాంకరింగ్ పాయింట్లు వంటి వాటిని పొందుతుంది. కావున ఇది తప్పకుండా వాహన వినియోగదారులకు సురక్షితమైన వాహనం అవుతుంది.

దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

టొయోటా గ్లాంజా యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది కొత్త హెడ్‌లైట్ యూనిట్, అప్‌డేట్ చేయబడిన డిఆర్ఎల్, రీస్టైల్ చేసిన ఫ్రంట్ గ్రిల్ మరియు టయోటా బ్యాడ్జ్‌తో పాటు కొత్త ఫ్రంట్ లుక్‌ పొందుతుంది. అంతే కాకుండా దీని వెనుక భాగంలో కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్, కొత్తగా డిజైన్ చేయబడిన బాడీ ప్యానెల్స్ కూడా పొందుతుంది.

దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

అంతే కాకూండా ఇది కొత్త హెడ్స్ అప్ డిస్‌ప్లే యూనిట్, అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, కొత్త ఏసీ వెంట్స్ పొందుతాయి. ఇందులోని డ్యాష్‌బోర్డ్ కొత్త బాలెనో మాదిరిగానే ఉన్నప్పటికీ, అపోల్స్ట్రే కొత్త కలర్ లో ఉంటుంది. ఇందులో కంట్రోల్ బటన్‌లు, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బటన్‌లు ఉంటాయి.

దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

కంపెనీ దీనిని మిడ్ మరియు టాప్ వేరియంట్స్ ఆప్సన్స్ లో తీసుకురానుంది. అంతే కాకుండా ఇది రెడ్, బ్లూ, గ్రే, వైట్ మరియు సిల్వర్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పటికే ఉన్న బీజ్ కలర్ ఆప్సన్ మాత్రమే తొలగించబడుతుంది. అయితే ఇందులో డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజ్ ఆప్షన్ ఇవ్వబడుతుంది.

దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

సాధారణంగా కంపెనీ యొక్క 'టొయోటా గ్లాంజా' 2019 లో ప్రవేశపెట్టబడింది, ఇది మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి దాదాపు 66,000 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించగలిగింది. అయితే ప్రస్తుత కాలంలో కొనుగోలుదారులు అప్డేటెడ్ మోడల్స్ కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు, కావున ఇది త్వరలో అప్డేటెడ్ మోడల్ గా దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది.

దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

టొయోటా గ్లాంజా అనేది కంపెనీ యొక్క విజయవంతమైన మోడల్. ఇది కంపెనీ యొక్క అమ్మకలకు చాలా దోహదపడింది. అయితే ఈ మోడల్ ఇప్పుడు ఆధునిక నవీనీకరణలు పొందుతుంది. కావున దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, మునుపటిలాగే ప్రజాదరణ పొందటంలో తప్పకుండా విజయం సాధిస్తుందా అనే విషయాలన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి.

దేశీయ మార్కెట్లో కొత్త Toyota Glanza బుకింగ్స్ మొదలయ్యాయ్.. త్వరపడండి

ప్రస్తుతం కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. కావునా ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు మీకు ఇష్టమైన గ్లాంజాను బుక్ చేసుకోవచ్చు. ఇది త్వరలో విడుదలవుతుంది. డెలివరీలు విడుదలైన తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ధర మొదలైన వివరాలు అప్పుడు అధికారికంగా ప్రకటించబడతాయి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
New toyota glanza bookings start design features engine mileage details
Story first published: Wednesday, March 9, 2022, 17:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X