త్వరలో విడుదలకానున్న Toyota Glanza యొక్క వేరియంట్స్, ఇవే

ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా (Toyota) భారతీయ మార్కెట్లో కొత్త కొత్త 'టయోటా గ్లాంజా' (Toyota Glanza) ను ఈ నెల 15 న అధికారికంగా విడుదల చేయనుంది. అయితే ఇది దేశీయ మార్కెట్లో విడుదలకాకముందే దీని గురించి కొంత సమాచారం వెలువడింది. దీని ప్రకారం కంపెనీ దీనిని E, S, G మరియు V అనే ట్రిమ్స్ లో తీసుకురానుంది. అయితే ఇందులోని బేస్ E ట్రిమ్ లో మినహా అన్ని వేరియంట్‌లలో మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ఆప్సన్స్ పొందుతుంది.

త్వరలో విడుదలకానున్న Toyota Glanza యొక్క వేరియంట్స్, ఇవే

టయోటా కంపెనీ కొత్త గ్లాంజా యొక్క బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. కొనుగోలుదారులు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో లేదా కంపెనీ యొక్క డీలర్‌షిప్‌ను సందర్శించి రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మొత్తం 7 వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది.

త్వరలో విడుదలకానున్న Toyota Glanza యొక్క వేరియంట్స్, ఇవే

టొయోటా గ్లాంజా యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది కొత్త హెడ్‌లైట్ యూనిట్, అప్‌డేట్ చేయబడిన డిఆర్ఎల్, రీస్టైల్ చేసిన ఫ్రంట్ గ్రిల్ మరియు టయోటా బ్యాడ్జ్‌తో పాటు కొత్త ఫ్రంట్ లుక్‌ పొందుతుంది. అంతే కాకుండా దీని వెనుక భాగంలో కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్, కొత్తగా డిజైన్ చేయబడిన బాడీ ప్యానెల్స్ కూడా పొందుతుంది.

త్వరలో విడుదలకానున్న Toyota Glanza యొక్క వేరియంట్స్, ఇవే

అంతే కాకూండా ఇది కొత్త హెడ్స్ అప్ డిస్‌ప్లే యూనిట్, అప్‌డేట్ చేయబడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, రీడిజైన్ చేయబడిన డ్యాష్‌బోర్డ్, కొత్త ఏసీ వెంట్స్ పొందుతాయి. ఇందులోని డ్యాష్‌బోర్డ్ కొత్త బాలెనో మాదిరిగానే ఉన్నప్పటికీ, అపోల్స్ట్రే కొత్త కలర్ లో ఉంటుంది. ఇందులో కంట్రోల్ బటన్‌లు, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ బటన్‌లు ఉంటాయి.

త్వరలో విడుదలకానున్న Toyota Glanza యొక్క వేరియంట్స్, ఇవే

కంపెనీ దీనిని మిడ్ మరియు టాప్ వేరియంట్స్ ఆప్సన్స్ లో తీసుకురానుంది. అంతే కాకుండా ఇది రెడ్, బ్లూ, గ్రే, వైట్ మరియు సిల్వర్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అయితే ఇప్పటికే ఉన్న బీజ్ కలర్ ఆప్సన్ మాత్రమే తొలగించబడుతుంది. అయితే ఇందులో డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజ్ ఆప్షన్ ఇవ్వబడుతుంది.

త్వరలో విడుదలకానున్న Toyota Glanza యొక్క వేరియంట్స్, ఇవే

టయోటా గ్లాంజా 360-డిగ్రీ కెమెరా, కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, 360-డిగ్రీల సరౌండ్-వ్యూ కెమెరా, హిల్-హోల్డ్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఐసోఫిక్స్ యాంకరింగ్ పాయింట్లు వంటి వాటిని పొందుతుంది. కావున ఇది తప్పకుండా వాహన వినియోగదారులకు సురక్షితమైన వాహనం అవుతుంది.

త్వరలో విడుదలకానున్న Toyota Glanza యొక్క వేరియంట్స్, ఇవే

టయోటా గ్లాంజా అనేది కంపెనీ దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్న అత్యంత తక్కువ ధర కలిగిన మోడల్ కానుంది. కావున ఇది తప్పకుండా ఎక్కువమంది కొనుగోలుదారులను తప్పకుండా ఆకర్షిస్తుంది. ఇది 89 బిహెచ్‌పి పవర్ అందించే శక్తివంతమైన కె-సిరీస్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్సన్ పొందుతుంది. కావున ఇది మంచి పరిధిని కూడా అందిస్తుంది.

త్వరలో విడుదలకానున్న Toyota Glanza యొక్క వేరియంట్స్, ఇవే

సాధారణంగా కంపెనీ యొక్క 'టొయోటా గ్లాంజా' 2019 లో ప్రవేశపెట్టబడింది, ఇది మార్కెట్లో అడుగుపెట్టినప్పటినుంచి దాదాపు 66,000 కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించగలిగింది. అయితే ప్రస్తుత కాలంలో కొనుగోలుదారులు అప్డేటెడ్ మోడల్స్ కొనుగోలుచేయడానికి ఆసక్తి చూపుతున్నారు, కావున ఇది త్వరలో అప్డేటెడ్ మోడల్ గా దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది.

త్వరలో విడుదలకానున్న Toyota Glanza యొక్క వేరియంట్స్, ఇవే

టొయోటా గ్లాంజా అనేది కంపెనీ యొక్క విజయవంతమైన మోడల్. ఇది కంపెనీ యొక్క అమ్మకలకు చాలా దోహదపడింది. అయితే ఈ మోడల్ ఇప్పుడు ఆధునిక నవీనీకరణలు పొందుతుంది. కావున దేశీయ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుంది, మునుపటిలాగే ప్రజాదరణ పొందటంలో తప్పకుండా విజయం సాధిస్తుందా అనే విషయాలన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి.

త్వరలో విడుదలకానున్న Toyota Glanza యొక్క వేరియంట్స్, ఇవే

ప్రస్తుతం కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. కావునా ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు మీకు ఇష్టమైన గ్లాంజాను బుక్ చేసుకోవచ్చు. ఇది త్వరలో విడుదలవుతుంది. డెలివరీలు విడుదలైన తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ధర మొదలైన వివరాలు అప్పుడు అధికారికంగా ప్రకటించబడతాయి.

మొత్తం మీద ఈ కొత్త టయోటా గ్లాంజా అనేది తప్పకుండా భారతీయ మార్కెట్లో తన మునుపటి వైభవాన్ని తప్పకుండా తిరిగి తీసుకురానుంది. ఈ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఇక ఎలాంటి బుకింగ్స్ పొందగలుగుతుంది అనే విషయాలు కూడా రానున్న రోజుల్లో తెలుస్తాయి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
New toyota glanza variant revealed ahead of launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X