టొయోట కస్టమర్లకు అప్పుడే పండుగ వచ్చేసింది.. హైరైడర్ డెలివరీలు మొదలయ్యాయ్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం 'టొయోట' (Toyota) దేశీయ విఫణిలో ఒక కొత్త హైబ్రిడ్ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఇటీవల అన్ని వేరియంట్ల ధరలను అధికారికంగా వెల్లడించింది. అంతకంటే ముందే ఈ కొత్త హైబ్రిడ్ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా ఇప్పుడు డెలివరీలు కూడా ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హైరైడర్ డెలివరీలు మొదలయ్యాయ్.. టొయోట కస్టమర్లకు ఇక పండుగే

టొయోట కంపెనీ విడుదల చేసిన కొత్త 'అర్బన్ క్రూయిజర్ హైరైడర్' (Urban Cruiser Hyryder) డెలివరీలు ఈ నవరాత్రుల సమయంలో విజయదశమి కంటే ముందే ప్రారభమయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెల్లడయ్యాయి.

హైరైడర్ డెలివరీలు మొదలయ్యాయ్.. టొయోట కస్టమర్లకు ఇక పండుగే

దేశీయ మార్కెట్లో టొయోట హైరైడర్ ధరలు రూ. 10.48 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 18.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇప్పటికే కంపెనీ ఈ SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కావున కొనుగోలుదారులు ముందస్తుగా రూ. 25,000 చేసుకోవచ్చు.

హైరైడర్ డెలివరీలు మొదలయ్యాయ్.. టొయోట కస్టమర్లకు ఇక పండుగే

కొత్త టొయోట 7 మోనోటోన్ కలర్స్, 4 డ్యూయెల్ టోన్ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. కావున ఇది మొత్తం 11 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇది డిజైన్ పరంగా కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. కావున ఇందులో సన్నని డబుల్-లేయర్ డేటైమ్ రన్నింగ్ లైట్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. డోర్స్ మీద హైబ్రిడ్ బ్యాడ్జ్‌ వంటి వాటిని చూడవచ్చు. వెనుక వైపు సి-ఆకారంలో ఉండే టెయిల్ లైట్స్ ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఇప్పుడు పరిమాణం పరంగా కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. కావున ఇది 4365 మిమీ పొడవు, 1795 మిమీ వెడల్పు, 1645 మిమీ ఎత్తు మరియు 2600 మిమీ వీల్ బేస్ ఉంటుంది. దీని వల్ల క్యాబిన్ విశాలంగా ఉంటుంది, సుదూర ప్రయాణాలకు కూడా ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుంది.

హైరైడర్ డెలివరీలు మొదలయ్యాయ్.. టొయోట కస్టమర్లకు ఇక పండుగే

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. డ్యాష్‌బోర్డ్‌లో 7-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే కూడా ఉంది. అంతే కాకుండా ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, రిమోట్ ఇగ్నిషన్ ఆన్/ఆఫ్, రిమోట్ ఏసీ కంట్రోల్, డోర్ లాక్/అన్‌లాక్, స్టోలెన్ వెహికల్ ట్రాకర్ మరియు ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

హైరైడర్ డెలివరీలు మొదలయ్యాయ్.. టొయోట కస్టమర్లకు ఇక పండుగే

హైరైడర్ SUV లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, వెనుక ప్రయాణీకుల కోసం 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

హైరైడర్ డెలివరీలు మొదలయ్యాయ్.. టొయోట కస్టమర్లకు ఇక పండుగే

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందిన మొదటి మిడ్-సైజ్ SUV. ఇది టొయోటా యొక్క 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 92 హెచ్‌పి పవర్ మరియు 122 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 79 హెచ్‌పి పవర్ మరియు 141 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడి ఉంటుంది.

హైరైడర్ డెలివరీలు మొదలయ్యాయ్.. టొయోట కస్టమర్లకు ఇక పండుగే

హైరైడర్ మారుతి సుజుకి నుండి మైల్డ్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కూడా పొందుతుంది. కావున ఇందులో 1.5-లీటర్ K15C ఇంజిన్‌ కూడా ఉంటుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 న్యూటన్ మీటర్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

హైరైడర్ డెలివరీలు మొదలయ్యాయ్.. టొయోట కస్టమర్లకు ఇక పండుగే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

టొయోట కంపెనీ యొక్క హైరైడర్ డెలివరీలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. కావున మొదట బుక్ చేసుకున్న కస్టమర్లు ఈ SUV డెలివరీలను పొందవచ్చు. అయితే రానున్న దీపావళి పండుగలోపు మరిన్ని ఎక్కువ డెలివెరీలు జరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని కథనాలతో పాటు కొత్త కార్లు మరియు కొత్త బైకులను గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New toyota urban cruiser hyryder deliveries start details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X