2021లో మార్కెట్లో విడుదలైన టాప్ 7 కార్లు.. డిసెంబర్ నెలలో వాటి పనితీరు..

గతేడాది భారత మార్కెట్లో అనేక కొత్త కార్లు విడుదల చేయబడ్డాయి. వీటిలో మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎమ్‌జి ఆస్టర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మరియు కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో మోడళ్లు ఉన్నాయి. ప్రస్తుతం, ఈ కార్లకు మార్కెట్లో హై డిమాండ్ ఉంది మరియు వీటికి బుకింగ్స్ కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. వినియోగదారుల నుండి ఈ కొత్త కార్లకు ఏవిధమైన ఆదరణ లభిస్తోంది మరియు గడచిన డిసెంబర్ నెలలో వీటి పనితీరు ఎలా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

2021లో మార్కెట్లో విడుదలైన టాప్ 7 కార్లు.. డిసెంబర్ నెలలో వాటి పనితీరు..

1. మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700)

మహీంద్రా నుండి గతేడాది మార్కెట్లోకి వచ్చిన అద్భుతమైన మోడళ్లలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఒకటి. ఈ కారు కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన మొదటి రెండు రోజుల్లోనే 50,000 యూనిట్లకు పైగా ఆర్డర్లను దక్కించుకుంది. ప్రస్తుతం, ఈ మోడల్ కోసం 70,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు వచ్చాయి. కాగా, గత డిసెంబర్ 2021 నెలలో కంపెనీ మొత్తం 3,980 యూనిట్లను విక్రయించింది. ఈ మోడల్ కోసం హై డిమాండ్ ఉన్నప్పటికీ, సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా ఉత్పత్తి ఆలస్యం అవుతుంది. అధిక వెయిటింగ్ పీరియడ్ కారణంగా కస్టమర్లు తమ బుకింగ్స్ ను రద్దు చేసుకునే ఆస్కారం కూడా కనిపిస్తోంది.

2021లో మార్కెట్లో విడుదలైన టాప్ 7 కార్లు.. డిసెంబర్ నెలలో వాటి పనితీరు..

2. ఎమ్‌జి ఆస్టర్ (MG Astor)

ఎమ్‌జి మోటార్ ఇండియా గతేడాది దేశీయ విపణిలో ప్రవేశపెట్టిన మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఆస్టర్ కూడా అమ్మకా రేసులో ముందంజలో ఉంది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో భారత మార్కెట్లోకి వచ్చిన మొట్టమొదటి మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఇది. గడచిన డిసెంబర్ నెలలో మొత్తం 1,125 యూనిట్ల ఆస్టర్ కార్లు అమ్ముడయ్యాయి. కంపెనీ గత సంవత్సరానికి గాను కేవలం 5,000 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచింది మరియు వీటిలో దాదాపు 2,500 యూనిట్లు పంపిణీ చేయబడ్డాయి. సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా ఎమ్‌జి మోటార్ ఇండియా కూడా ఈ కారుని డిమాండ్ కి తగినట్లుగా సప్లయ్ చేయలేకపోతోంది.

2021లో మార్కెట్లో విడుదలైన టాప్ 7 కార్లు.. డిసెంబర్ నెలలో వాటి పనితీరు..

3. మారుతి సెలెరియో (Maruti Celerio)

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, గడచిన సంవత్సరం చివర్లో తమ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో కారులో ఓ కొత్త తరం మోడల్ ని మార్కెట్లో విడుదల చేసింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అధునాతన డిజైన్ మరియు రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్‌తో కంపెనీ ఈ కారును పూర్తిగా రీడిజైన్ చేసింది. గత నెలలో మారుతి సుజుకి మొత్తం 5,656 యూనిట్లను విక్రయించింది, అయితే ఇది గత సంవత్సరం విక్రయించిన 6,600 యూనిట్లతో పోలిస్తే 15 శాతం తక్కువ. అయినప్పటికీ, ఈ కొత్త మోడల్ కోసం డిమాండ్ అధికంగానే ఉంది.

2021లో మార్కెట్లో విడుదలైన టాప్ 7 కార్లు.. డిసెంబర్ నెలలో వాటి పనితీరు..

4. టాటా పంచ్ (Tata Punch)

సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ మినీ రేంజ్ రోవర్ ఎవోక్ కారులా టాటా మోటార్స్ ప్రవేశపెట్టిన బుజ్జి కారు టాటా పంచ్. ఈ మోడల్ చిన్న కార్ సెగ్మెంట్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది. గత నెలలో టాటా మోటార్స్ మొత్తం 8,008 యూనిట్ల పంచ్ కార్లను విక్రయించింది. నవంబర్ 2021లో విక్రయించిన 6,110 యూనిట్లతో పోలిస్తే, ఈ మోడల్ అమ్మకాలు 31 శాతం వృద్ధిని సాధించాయి. టాటా పంచ్ కోసం భారీ బుకింగ్‌లు వచ్చాయి, ఈ నెలలో చిప్ కొరతను కంపెనీ మెరుగైన మార్గంలో నిర్వహించగలిగింది. మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో వేచి చూడాలి.

2021లో మార్కెట్లో విడుదలైన టాప్ 7 కార్లు.. డిసెంబర్ నెలలో వాటి పనితీరు..

5. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volksvagen Taigun)

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ కూడా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ విభాగంలో తన సత్తా ఏంటో చాటేందుకు టైగన్ అనే మిడ్ సైజ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 2,828 యూనిట్లుగా ఉన్నాయి. నవంబర్ 2021 నెలలో విక్రయించిన 2849 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు స్వల్పంగా 1 శాతం తగ్గాయి. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ వినియోగదారుల నుండి మంచి ఆదరణ పొందుతోంది. గత కొన్ని నెలలుగా ఇది కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా అగ్రస్థానంలో నిలుస్తోంది.

2021లో మార్కెట్లో విడుదలైన టాప్ 7 కార్లు.. డిసెంబర్ నెలలో వాటి పనితీరు..

6. స్కోడా కుషాక్ (Skoda Kushaq)

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ రెండూ కూడా కజిన్ బ్రదర్స్ లాంటోళ్లు అని చెప్పుకోవచ్చు. ఈ రెండు మోడళ్లు ఒకే ప్లాట్‍ఫామ్ పై తయారు చేయబడ్డాయి. కాబట్టి, ఈ రెండు మోడళ్లలోని అనేక కాంపోనెంట్స్ కూడా ఒకేలా ఉంటాయి. గత నెలలో స్కోడా కుషాక్ అమ్మకాలు 2,840 యూనిట్లుగా ఉన్నాయి. నవంబర్ 2021 నెలలో విక్రయించిన 1,876 యూనిట్లతో పోలిస్తే, డిసెంబర్ 2021 నెలలో ఈ మోడల్ అమ్మకాలు 51 శాతం వృద్ధిని నమోదు చేశాయి. స్కోడా కూడా చిప్ కొరతను ఎదుర్కుంటోంది, ఫలితంగా కంపెనీ ఈ మోడల్ ఆశించిన స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది.

2021లో మార్కెట్లో విడుదలైన టాప్ 7 కార్లు.. డిసెంబర్ నెలలో వాటి పనితీరు..

7. రెనో కైగర్ (Renault Kiger)

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో అందిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్ అమ్మకాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి. ఈ కంపెనీ గత నెలలో మొత్తం 2,117 యూనిట్ల కైగర్ ఎస్‌యూవీలను విక్రయించింది. నవంబర్ 2021 నెలలో 2,062 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో రెనో కైగర్ అమ్మకాలు స్వల్పంగా 3 శాతం వృద్ధిని సాధించాయి. రెనో తన కైగర్ మోడల్ ద్వారా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మంచి పట్టు సాధించగలిగింది.

Most Read Articles

English summary
Newly launched car sales trend in december 2021 xuv700 punch astor kushaq tiguan and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X