2022 జులై అమ్మకాల్లో 'నిస్సాన్ మాగ్నైట్' హవా.. మునుపటికంటే పెరిగిన కంపెనీ సేల్స్

ఉందిలే మంచి కాలం ముందు.. ముందునా.. అన్నట్టు, వాహన తయారీదారులందరూ దాదాపుగా ఇప్పుడు మంచి అమ్మకాలతో ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగానే దాదాపు అన్ని కంపెనీల అమ్మకాల గణాంకాలు వెలువడ్డాయి. ఇందులో నిస్సాన్ ఇండియా కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ కథనంలో 'నిస్సాన్ ఇండియా' (Nissan India) సేల్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

2022 జులై అమ్మకాల్లో 'నిస్సాన్ మాగ్నైట్' హవా.. మునుపటికంటే పెరిగిన సేల్స్

నిస్సాన్ ఇండియా అందించిన గణాంకాల ప్రకారం, 2022 జులై నెలలో మొత్తం 8,337 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిసింది. ఈ అమ్మకాలు 2021 జులై కంటే కూడా 2 శాతం ఎక్కువ. కంపెనీ 2021 జులైలో మొత్తం 8,156 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అమ్మకాలు మరింత ఎక్కువ వృద్ధిని సాధించలేదని అర్థమవుతోంది.

2022 జులై అమ్మకాల్లో 'నిస్సాన్ మాగ్నైట్' హవా.. మునుపటికంటే పెరిగిన సేల్స్

కంపెనీ యొక్క మొత్తం అమ్మకాలలో 8,012 యూనిట్లు కేవలం నిస్సాన్ మాగ్నైట్ మాత్రమే ఉంది. అంటే కంపెనీ యొక్క ఈ SUV ఉత్తమ అమ్మకాలను పొందుతోంది, భారతీయ మార్కెట్లో 2020 న నిస్సాన్ యొక్క మాగ్నైట్ ప్రారభించబడింది. అప్పటి నుంచి కూడా కంపెనీ 50,000 యూనిట్లను విక్రయించగలిగింది. అంటే నిస్సాన్ మాగ్నైట్ బ్రాండ్ యొక్క అత్యధిక అమ్మకాలు పొందుతున్న SUV గా ఉంది. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది.

2022 జులై అమ్మకాల్లో 'నిస్సాన్ మాగ్నైట్' హవా.. మునుపటికంటే పెరిగిన సేల్స్

కంపెనీ యొక్క అమ్మకాలను గురించి నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ 'రాకేష్ శ్రీవాస్తవ' మాట్లాడుతూ.. 2022 జులైలో కంపెనీ మంచి స్థాయిలో అమ్మకాలను పొందగలిగింది, ఈ అమ్మకాలకు నిస్సాన్ మాగ్నైట్ చాలా సహకరించింది. అయితే ఇక పండుగ సీజన్ రానుంది కావున తప్పకుండా కంపెనీ మరింత మంచి అమ్మకాలను పొందుతుంది అని ఆశిస్తున్నామన్నారు.

2022 జులై అమ్మకాల్లో 'నిస్సాన్ మాగ్నైట్' హవా.. మునుపటికంటే పెరిగిన సేల్స్

భారతదేశంలో త్వరలోనే వినాయక చవితి, విజయదశమి వంటి పండుగలు రానున్నాయి. ఈ పండుగల సమయంలో ఎక్కువమంది కొనుగోలుదారులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కావున తప్పకుండా రానున్న రోజుల్లో కంపెనీ మంచి అమ్మకాలను పొందుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఉత్పత్తిని పెంచడంతోపాటు సరఫరా గొలుసును మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది.

2022 జులై అమ్మకాల్లో 'నిస్సాన్ మాగ్నైట్' హవా.. మునుపటికంటే పెరిగిన సేల్స్

ఇదిలా ఉండగా, కంపెనీ ఆదాయాన్ని పెంచడానికి, తన కార్లపై సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రారంభించింది. దీని కింద కంపెనీ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపు ఆధారంగా వినియోగదారులకు వాహనాన్ని అందిస్తుంది. కస్టమర్ ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం ద్వారా కారును కొనుగోలు చేయకుండా కారును ఉపయోగించవచ్చు.

2022 జులై అమ్మకాల్లో 'నిస్సాన్ మాగ్నైట్' హవా.. మునుపటికంటే పెరిగిన సేల్స్

ఈ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌లో కారు యొక్క నిర్వహణ మరియు బీమాకు సంబంధించిన మొత్తం కూడా ఉంటుంది. నిస్సాన్ కార్లపై సబ్‌స్క్రిప్షన్ ఆఫర్‌ ఢిల్లీ, హైదరాబాద్‌, ముంబై, చెన్నై, పూణే మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కావున ఈ నగరాల్లోని కస్టమర్లు దీనిని ఉపయోగిన్చుకోవచ్చు.

2022 జులై అమ్మకాల్లో 'నిస్సాన్ మాగ్నైట్' హవా.. మునుపటికంటే పెరిగిన సేల్స్

నిస్సాన్ ఇండియా ఇటీవల ఏకంగా 10 లక్షల వాహనాలను ఎగుమతి చేసి ఎగుమతుల్లో ఒక గొప్ప రికార్డ్ సృష్టించింది. కంపెనీ 2010 లో ఎగుమతులను ప్రారంభించినప్పటినుంచి ఎగుమతుల్లో అరుదైన మైలురాయిని చేరుకోగలిగింది.

2022 జులై అమ్మకాల్లో 'నిస్సాన్ మాగ్నైట్' హవా.. మునుపటికంటే పెరిగిన సేల్స్

నిస్సాన్ ఇండియా చెన్నైలోని కామరాజ్ పోర్ట్ నుండి మిడిల్ ఈస్ట్, యూరప్, లాటిన్ అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్-ఈస్ట్ ఆసియా, సార్క్ దేశాలు, సబ్-సహారా మరియు ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేసేది, అయితే ఇటీవల నిస్సాన్ ఇండియా తన ప్రాథమిక ఎగుమతి మార్కెట్‌ను యూరప్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, బహ్రెయిన్ మరియు కువైట్ వంటి మధ్యప్రాచ్య దేశాలకు మార్చింది. మొత్తం మీద కంపెనీ తన ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ మంచి ప్రాచుర్యం పొందుతోంది.

2022 జులై అమ్మకాల్లో 'నిస్సాన్ మాగ్నైట్' హవా.. మునుపటికంటే పెరిగిన సేల్స్

నిస్సాన్ కంపెనీ తన మాగ్నైట్ SUV ప్రారభించినప్పటినుంచి కూడా మంచి ఆదరణ పొందుతూ ఇప్పటికే 1,00,000 బుకింగ్స్ స్వీకరించగలిగింది. ఇంత ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందటానికి ప్రధాన కారణం ఈ SUV యొక్క డిజైన్, ఆధునిక ఫీచర్స్ మరియు మంచి పనితీరు అనే చెప్పాలి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఆనిస్తూ నిస్సాన్ కంపెనీ 2021 జులై కంటే 2022 జులైలో 2 శాతం వృద్ధిని నమోదు చెసింది. ఇంత వృద్ధి సాధించడానికి మాగ్నైట్ చాలా సహకరించింది. అయితే రానున్న పండుగ సీజన్లో ఈ అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ ఆశిస్తోంది.

Most Read Articles

English summary
Nissan india july 2022 sales 8337 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X