అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'నిస్సాన్' (Nissan) కంపెనీ తన 2022 జూన్ నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022 జూన్ నెలలో మొత్తమ్ 3,515 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు 2021 జూన్ కంటే కూడా స్వల్ప వృద్దని నమోదు చేయగలిగింది. కంపెనీ యొక్క మొత్తం అమ్మకాలను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

నిస్సాన్ ఇండియా విడుదల చేసిన గణాంకాలను 2022 జూన్ నెలలో అమ్మకాలు మునుపటికంటే (2021 జూన్) కూడా 0.3 శాతం పెరుగుదలను నమోదు చేశాయి, అంటే 2022 జూన్ నెలలో కంపెనీ యొక్క అమ్మకాలు 3,503 యూనిట్లు అని తెలుస్తోంది.

అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

నిస్సాన్ ఇండియా యొక్క ఎగుమతుల విషయానికి వస్తే, 2022 జూన్ నెలలో కంపెనీ ఎగుమతి చేసిన మొత్తం యూనిట్లు 4,497. అయితే ఇదే నెల 2021 లో కంపెనీ 5,661 యూనిట్లను భారతీయ మార్కెట్ నుంచి ఎగుమతి చేసినట్లు తెలిసింది. దీని బట్టి చూస్తే కంపెనీ యొక్క అమ్మకాలు 2021 కంటే కూడా 20.5 శాతం తక్కువ అని తెలిస్తుంది. ఎగుమతుల పరంగా కంపెనీ కొంత వృద్దని నమోదు చేసినప్పటికీ, ఎగుమతుల్లో మాత్రం కంపెనీ ఊహించని తగ్గుదలను నమోదు చేసింది.

అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

నిస్సాన్ కంపెనీ తన నిస్సాన్ మ్యాగ్నైట్ SUV ని మార్కెట్లో విడుదల చేయినప్పటినుంచి మంచి స్థాయిలో అమ్మకాలను పొందుతూ ఉంది. కంపెనీ ఇప్పటివరకు కూడా ఈ SUV ని 50,000 యూనిట్ల వరకు విక్రయించినట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ మాగ్నైట్ ఏ స్థాయిలో డిమాండ్ ఉందొ స్పష్టంగా అర్థమవుతుంది. అంతే కాకుండా కంపెనీ ఈ SUV కోసం ఏకంగా 1 లక్షకు పైగా బుకింగ్స్ పొందగలిగింది.

అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

2020 లో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ SUV కంపెనీకి ఆశించిన రీతిలో మంచి అమ్మకాలను కల్పించగలిగింది. అయితే గత నెలలో కంపెనీ యొక్క అమ్మకాలు కొంత తగ్గుముఖం పట్టాయి. దీని గురించి నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శ్రీవస్తవ మాట్లాడుతూ.. కంపనీ మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొంటూ మంచి అమ్మకాలను పొందింది. కానీ ప్రస్తుతం అమ్మకాలు కొంత తగ్గాయి. కంపెనీ యొక్క అమాంకాలను పెంచడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు.

అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన నిస్సాన్ మ్యాగ్నైట్ కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడానికి తోడ్పడుతుందని కూడా అయన అన్నారు. ఇప్పటికే ఈ SUV కోసం 16,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ లో ఉన్న బుకింగ్స్ అన్నీ కూడా త్వరలోనే పూర్తి చేయడానికి కంపెనీ కృషి చేస్తోంది.

అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

నిస్సాన్ మాగ్నైట్ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుకున్న కంపెనీ బ్రాండ్. అయితే కంపెనీ ఈ SUV ధరలను ఇప్పటికే పెంచింది. అంతే కాకుండా ఇందులో నాలుగు వేరియంట్‌ల అమ్మకాలను కూడా నిలిపివేసింది. ఇందులో నిస్సాన్ మాగ్నైట్ యొక్క XV ప్రీమియం టర్బో (O), XV ప్రీమియం టర్బో (O) డ్యూయల్-టోన్, XV ప్రీమియం టర్బో (O) CVT, మరియు XV ప్రీమియం టర్బో (O) CVT డ్యూయల్-టోన్ వేరియంట్‌లు ఉన్నాయి.

అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

కంపెనీ యొక్క ఈ SUV ప్రారంభ ధర ఇప్పుడు రూ. 5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. దేశీయ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది. అవి XE, XL, XV మరియు XV వేరియంట్లు. ఇందులో XE బేస్ వేరియంట్ కాగా XL అనేది మిడ్ సైజ్ వేరియంట్, అదేవిధంగా XV అనేది హై ఎండ్ మోడల్. ఇవన్నీ కూడా అద్భుతమైన ఫీచర్స్ పొందుతాయి.

అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

కొత్త నిస్సాన్ మాగ్నైట్ రెండు ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది. మొదటిది 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది 71 బిహెచ్‌పి మరియు 96 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇక రెండవది 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, ఇది 99 బిహెచ్‌పి మరియు 160 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది.

అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

నిస్సాన్ మాగ్నైట్ మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందటమే కాకుండా, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులతో నిండి ఉంది, ఎబిఎస్ విత్ ఇబిడి, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. సేఫ్టీలో ఇది 4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. కావున ఎక్కువమంది కొనుగోలుదారులు ఈ SUV కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

అంతంత మాత్రంగానే అమ్మకాలు.. ఎగుమతుల్లో తగ్గుదల: నిస్సాన్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

నిస్సాన్ కంపెనీ గత కొన్ని నెలలుగా మంచి అమ్మకాలతో ముందుకెళ్తోంది. అయితే 2022 జూన్ నెలలో కేవలం 0.3 శాతం మాత్రమే వృద్దని నమోదు చేసినప్పటికీ, ఎగుమతుల్లో చాలా తగ్గుదలను నమోదు చేసింది. కావున కంపెనీ అమ్మకాలను వృద్ధి చేసుకోవడానికి తప్పకుండా తగిన సన్నాహాలను సిద్ధం చేసే అవకాశం ఉంది. ఇక రానున్న రోజుల్లో తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Nissan india sales june 2022 8012 units details
Story first published: Monday, July 4, 2022, 9:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X