'నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్' బుకింగ్స్ స్టార్ట్: ఇక లాంచ్ ఎప్పుడంటే?

నిస్సాన్ (Nissan) కంపెనీ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న వాహన తయారీ సంస్థ. ఈ కంపెనీ యొక్క 'మ్యాగ్నైట్' (Magnite) ఎస్‌యువి కంపెనీకి మంచి అమ్మకాలను చేకూర్చుతూ ఇటీవల 1,00,000 యూనిట్ల బుకింగ్స్ పొంది కంపెనీకి గొప్ప కీర్తిని తీసుకువచ్చింది. అదే సమయంలో కంపెనీ ఇప్పటికే 50,000 యూనిట్ల డెలివరీని కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

దీనిని పురస్కరించుకుని నిస్సాన్ కంపెనీ ఇప్పుడు త్వరలో తన 'నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్' ను తీసుకురావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఈ కొత్త ఎడిషన్ కోసం కంపెనీ ఇప్పుడు బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది.

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్: ఇక లాంచ్ ఎప్పుడంటే?

నిస్సాన్ కంపెనీ తన 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' ను ఈ నెల 18 న (2022 జులై) దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. అయితే దీని కోసం బుకింగ్స్ ఇప్పుడే మొదలయ్యాయి. ఈ కొత్త ఎడిషన్ XV ట్రిమ్‌పై ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో ఇది మొత్తం మూడు వేరియంట్స్ లో అందుబాటులోకి రానుంది. అవి XV మ్యాన్యువల్ ఎడిషన్, టర్బో మ్యాన్యువల్ ఎడిషన్ మరియు టర్బో XV సివిటి ఎడిషన్.

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్: ఇక లాంచ్ ఎప్పుడంటే?

నిస్సాన్ విడుదలచేయనున్న ఈ కొత్త రెడ్ ఎడిషన్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది. కావున ఇది మునుపటికంటే కూడా చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. దీని ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, ఇది 16-ఇంచెస్ డైమండ్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. అదే సమయంలో డోర్‌పైన సిల్వర్ కలర్ సైడ్ క్లాడింగ్‌ చూడవచ్చు.

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్: ఇక లాంచ్ ఎప్పుడంటే?

అంతే కాకుండా ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ క్లాడింగ్, వీల్ ఆర్చ్ మరియు బాడీ సైడ్ క్లాడింగ్‌ వంటివి రెడ్ కలర్ యాక్సెంట్స్ పొందుతాయి. కావున ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బోల్డ్ బాడీ గ్రాఫిక్స్, టెయిల్ డోర్ గార్నిష్, ఎల్ఈడీ స్కఫ్ ప్లేట్ మరియు రెడ్ ఎడిషన్ బ్యాడ్జ్ వంటి వాటిని పొందుతుంది.

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్: ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో వైఫై కనెక్టివిటీతో 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 7.0 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్, వెనుక సీట్ ఆర్మ్‌రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, రియర్ ప్యాకెట్స్ మరియు 60:40 స్ప్లిట్ సీట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, వెహికల్ డైనమిక్స్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్: ఇక లాంచ్ ఎప్పుడంటే?

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ లో రెండు ఇంజిన్ ఆప్సన్స్ ఉన్నాయి. అవి న్యాచురల్లీ ఆస్పిరేటడ్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.

ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటడ్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 71 బిహెచ్‌పి పవర్ మరియు 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక రెండవ ఇంజిన్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 99 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్: ఇక లాంచ్ ఎప్పుడంటే?

నిజానికి నిస్సాన్ కంపెనీ తన 'మాగ్నైట్' ఎస్‌యువిని 2020 డిసెంబర్ నెలలో భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో విడుదలైనప్పుడు, దీని ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఇప్పుడు నిస్సాన్ మాగ్నైట్ ధర రూ. 5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. నిస్సాన్ మాగ్నైట్ టర్బో వేరియంట్‌ ధర రూ. 7.88 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టర్బో సివిటి ధర రూ. 8.86 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్: ఇక లాంచ్ ఎప్పుడంటే?

దేశీయ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది. అవి XE, XL, XV మరియు XV వేరియంట్లు. ఇవన్నీ కూడా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. కావున ఇందులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ ఎంకరేజెస్ ఉన్నాయి. ఈ ఎస్‌యువి NCAP క్రాష్ టెస్ట్ లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొంది సురక్షితమైన వాహనంగా నిలిచింది. ఈ కారణంగానే ఎక్కువయింది దీనిని కొనుగోలు చేయాడానికి ఆసక్తి చూపుతారు.

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ బుకింగ్స్ స్టార్ట్: ఇక లాంచ్ ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

మార్కెట్లో నిస్సాన్ కంపెనీ యొక్క అమ్మకాలు పెరగటానికి మాగ్నైట్ ఎస్‌యువి ప్రధాన కారణం. నిస్సాన్ మాగ్నైట్ అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందటం కలిగి సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ పొందటం వల్ల మార్కెట్లో చాలావేగంగా అమ్ముడవుతోంది. అయితే కంపెనీ ఇప్పుడు త్వరలోనే 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' ను తీసుకురానుంది. కావున కంపెనీ యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Nissan magnite red edition booking starts design features update details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X