దేశీయ మార్కెట్లో విడుదలైన 'నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్'.. ఇప్పుడు మరింత బ్యూటిఫుల్, ధర ఎంతంటే?

నిస్సాన్ (Nissan) కంపెనీ దేశీయ మార్కెట్లో తన విజయవంతమైన మోడల్ 'మాగ్నైట్' యొక్క 'రెడ్ ఎడిషన్' ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. అయితే ఎట్టకేలకు కంపెనీ ఇప్పుడు ఈ కొత్త 'నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్' ను భారతీయ విఫణిలో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త ఎస్‌యువి ప్రారంభ ధర రూ. 7,86,500 . దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

నిస్సాన్ నుంచి బ్యూటిఫుల్ 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' వచ్చేసింది.. ధర రూ. 7.86 లక్షలు

నిస్సాన్ కంపెనీ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి XV మ్యాన్యువల్ ఎడిషన్, టర్బో మ్యాన్యువల్ ఎడిషన్ మరియు టర్బో XV సివిటి ఎడిషన్. వీటి ధరలు వరుసగా రూ. 7,86,500  (XV మ్యాన్యువల్ ఎడిషన్), రూ. 9,24,500  (టర్బో మ్యాన్యువల్ ఎడిషన్) మరియు రూ. 9,99,900 (టర్బో XV సివిటి ఎడిషన్). ఈ కొత్త ఎస్‌యువి రెండు కలర్ ఆప్సన్స్ పొందుతుంది. అవి ఒనిక్స్ బ్లాక్ మరియు స్టార్మ్ వైట్ కలర్స్.

నిస్సాన్ నుంచి బ్యూటిఫుల్ 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' వచ్చేసింది.. ధర రూ. 7.86 లక్షలు

నిస్సాన్ మాగ్నైట్ యొక్క రెడ్ ఎడిషన్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డిజైన్ పొందుతుంది. ఈ ఎస్‌యువి యొక్క ముందు భాగంలోని గ్రిల్, బంపర్ క్లాడింగ్, వీల్ ఆర్చెస్ మరియు బాడీ సైడ్ క్లాడింగ్‌ వంటివి రెడ్ కలర్ లో ఉంటాయి. ఇందులో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్ మరియు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 16 ఇంచెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

నిస్సాన్ నుంచి బ్యూటిఫుల్ 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' వచ్చేసింది.. ధర రూ. 7.86 లక్షలు

ఇంటీరియర్ కూడా ఎక్కువ భాగం రెడ్ కలర్ లోనే ఉంది. ఇందులో డ్యాష్‌బోర్డ్, డోర్ సైడ్ ఆర్మ్‌రెస్ట్ మరియు సెంటర్ కన్సోల్‌ వంటివి రెడ్ కలర్ పొందుతాయి.

మాగ్నైట్ యొక్క రెడ్ ఎడిషన్ లో 7.0 ఇంచెస్ టి‌ఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకూండా పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, వెహికల్ డైనమిక్స్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

నిస్సాన్ నుంచి బ్యూటిఫుల్ 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' వచ్చేసింది.. ధర రూ. 7.86 లక్షలు

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ లో రెండు ఇంజిన్ ఆప్సన్స్ ఉన్నాయి. అవి న్యాచురల్లీ ఆస్పిరేటడ్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.

ఇందులోని న్యాచురల్లీ ఆస్పిరేటడ్ 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 71 బిహెచ్‌పి పవర్ మరియు 91 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక రెండవ ఇంజిన్ 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 98 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

నిస్సాన్ నుంచి బ్యూటిఫుల్ 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' వచ్చేసింది.. ధర రూ. 7.86 లక్షలు

నిస్సాన్ (Nissan) కంపెనీ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న వాహన తయారీ సంస్థ. ఈ కంపెనీ యొక్క 'మ్యాగ్నైట్' (Magnite) ఎస్‌యువి కంపెనీకి మంచి అమ్మకాలను చేకూర్చుతూ ఇటీవల 1,00,000 యూనిట్ల బుకింగ్స్ పొంది కంపెనీకి గొప్ప కీర్తిని తీసుకువచ్చింది. అదే సమయంలో కంపెనీ ఇప్పటికే 50,000 యూనిట్ల డెలివరీని కూడా విజయవంతంగా పూర్తి చేసింది. దీనిని పురస్కరించుకుని నిస్సాన్ కంపెనీ ఇప్పుడు 'నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్' ను విడుదల చేసింది.

నిస్సాన్ నుంచి బ్యూటిఫుల్ 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' వచ్చేసింది.. ధర రూ. 7.86 లక్షలు

నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ లాంచ్ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ 'రాకేష్ శ్రీవాస్తవ' మాట్లాడుతూ.. మాగ్నైట్ ఎస్‌యువి కంపెనీ అమ్మకాలను తారా స్థాయికి తీసుకెళ్లడానికి ఎంతగానో సహకరించింది. అయితే దీనిని యువ కస్టమర్ల కోసం మరింత అందంగా అందించాలనే ఉద్దేశ్యంతో 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' తీసుకురావడం జరిగిందన్నారు. ఇది తప్పకుండా మార్కెట్లో ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షిస్తుంది మరియు మంచి విజయాన్ని పొందుతుంది అని ఆశిస్తున్నామన్నారు.

నిస్సాన్ నుంచి బ్యూటిఫుల్ 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' వచ్చేసింది.. ధర రూ. 7.86 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

నిస్సాన్ మాగ్నైట్ దేశీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ అమ్మకాల్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇప్పుడు విడుదలైన ఈ కొత్త 'మాగ్నైట్ రెడ్ ఎడిషన్' కూడా తప్పకుండా కస్టమర్లను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము. ఈ రెడ్ ఎడిషన్ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్ మరియు మారుతి సుజుకి బ్రెజ్జా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Nissan magnite red edition launched in india price exterior interior engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X