వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన నిస్సాన్ ఇండియా (Nissan India) బ్రాండ్ నిస్సాన్ మ్యాగ్నైట్ (Nissan Magnite) ఇప్పుడు కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో దాదాపు 15 దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి చేస్తోంది. ఒక్క బ్రాండ్ కారు 15 దేశాలకు ఎగుమతి చేయడం అంటే నిజంగా కంపెనీ సాధించిన గొప్ప విజయం మరియు ప్రశంసనీయం.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

దేశీయ విఫణిలో నిస్సాన్ మాగ్నైట్ 2020 డిసెంబర్ నెలలో విడుదలైంది. విడుదలైనప్పటినుంచి ఇప్పటి వరకు భారతదేశంలో 78,000 యూనిట్ల బుకింగ్‌లను కస్టమర్ల నుంచి పొందగలిగింది. అదే సమయంలో దాదాపు 6,344 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఈ సంఖ్య రానున్న కాలంలో మరింత పెరుగుతుంది.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

నిస్సాన్ కంపెనీ యొక్క ఎగుమతులు గత సంవత్సరం దక్షిణాఫ్రికా మరియు ఇండోనేషియా వంటి దేశాల్లో ప్రారంభించిన తరువాత, ఇప్పుడు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రూనై, ఉగాండా, కెన్యా, సీషెల్స్, మొజాంబిక్, జాంబియా, మారిషస్, టాంజానియా మరియు మలావి వంటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

దీన్ని బట్టి చూస్తే ప్రపంచంలోని ఈ దేశాల్లో కూడా నిస్సాన్ మాగ్నైట్ కి విపరీతమైన డిమాండ్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మాగ్నైట్ నిస్సాన్ యొక్క అద్భుతమైన ఆధునిక ఉత్పత్తి. ఇది అతి తక్కువకాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. అయితే ఇప్పటికీ కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సవాళ్లు మరియు కొనసాగుతున్న సెమీకండక్టర్ కొరత వంటి సమయంలో కూడా కంపెనీ మంచి అమ్మకాలను పొందగలిగింది.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

ఈ ఘనతకు గాను నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్‌కు కంపెనీ గ్లోబల్ ప్రెసిడెంట్ అవార్డును పొందింది. ఆఫ్రికా, భారతదేశం, యూరప్ మరియు ఓషియానియా ప్రాంతానికి చెందిన నిస్సాన్ ఛైర్‌పర్సన్ గుయిలౌమ్ కార్టియర్ మాట్లాడుతూ.. నిస్సాన్ కంపెనీ యొక్క మాగ్నైట్ ఒక అసాధారణమైన కారు. ఇది మంచి ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంది. రాబోయే రోజుల్లో దీని ఉనికి మరింత పెరుగుదల దిశవైపు తప్పకుండా పరుగులు తీస్తుందన్నారు.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

నిస్సాన్ మాగ్నైట్ ఇప్పటికే భారతదేశంలో BBC టాప్ గేర్ ఇండియా, కార్ & బైక్ మరియు ఆటోకార్ ఇండియాతో సహా అనేక హై-ప్రొఫైల్ ఆటోమోటివ్ అవార్డులను గెలుచుకుంది మరియు ఇటీవల 'ది రేస్ మంకీ కార్ ఆఫ్ ది ఇయర్ 2021'గా ఎంపికైంది. మొత్తానికి నిస్సాన్ యొక్క ఈ కారు కంపెనీ యొక్క అమ్మకాలను పెంచడంలో సహాయపడుతోంది.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

దేశీయ మార్కెట్లో Nissan Magnite నాలు వేరియంట్లలో అందించబడుతుంది. అవి XE, XL, XV మరియు XV వేరియంట్లు. ఇందులో XE బేస్ వేరియంట్ కాగా XL అనేది మిడ్ సైజ్ వేరియంట్, అదేవిధంగా XV అనేది హై ఎండ్ మోడల్. ఇవన్నీ కూడా చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నాయి.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

Nissan Magnite ఎస్‌యూవీలో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో ఉన్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్‌తో అందించబడుతుంది, టర్బో పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి గేర్‌బాక్స్ తో అందించబడ్డాయి.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

Magnite యొక్క 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 98.63 బిహెచ్‌పి శక్తిని మరియు 152 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారులో మంచి ఇంధన సామర్థ్యం కోసం ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టం ఉపయోగించబడింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో Nissan సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి క్రాష్ టెస్ట్ లో మాగ్నైట్ కి 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇవ్వబడింది. ఈ కారణంగా దాని బుకింగ్‌లు కూడా పెరుగుతున్నాయి.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

ఇదిలా ఉండగా నిస్సాన్ కంపెనీ త్వరలో భారతదేశంలో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల కోసం మూడు భాగాల సమ్మేళనంలో చేరింది, ఇందులో ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ మరియు జపాన్‌కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కూడా ఉన్నాయి.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

మూడు కంపెనీల గ్రూప్ 2030 నాటికి సంయుక్తంగా 30 వాహనాలను విడుదల చేయనుంది. ఈ వాహనాలు భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లలో ప్రారంభించబడతాయి. నిస్సాన్ యొక్క భారతీయ విభాగం భారతదేశం ఎలక్ట్రిక్ కార్లకు తదుపరి అతిపెద్ద సంభావ్య మార్కెట్ అని పేర్కొంది. కంపెనీ ప్రకారం, భారతదేశంలోని ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్ రాబోయే కొన్నేళ్లలో మూడు రెట్లు వృద్ధి చెందుతుంది.

వారెవ్వా.. 15 దేశాలకు ఎగుమతవుతున్న Nissan Magnite: దీని క్రేజ్ మామూలుగా లేదు

కంపెనీ విడుదల చేయనున్న ఈ ఎలక్ట్రిక్ కారు కొత్త CMF B-EV ఆర్కిటెక్చర్‌పై ఆధారపడి ఉంటుందని కార్ల తయారీ సంస్థ ప్రకటించింది, ఇది ప్రారంభంలో యూరోపియన్ మార్కెట్‌లలో ప్రారంభించబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు రెనాల్ట్-నిస్సాన్-మిత్సుబిషి కూటమి యొక్క 2030 వ్యూహంలో భాగంగా ఉంటుందని కంపెనీ నివేదించింది. మొత్తానికి త్వరలో నిస్సాన్ నుంచి ఎలక్ట్రిక్ కారు భారతీయ రోడ్లమీద కనిపించనుంది.

Most Read Articles

English summary
Nissan magnite suv export begins to 15 countries from india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X