ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా "విటారా" హైబ్రిడ్ ఎస్‌యూవీ, జులై 20న లాంచ్!

భారత మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki) మరియు టొయోటా (Toyota) కంపెనీలు ఒకే కారుని రెండు వేర్వేరు పేర్లతో విక్రయించే వ్యాపారం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. వాస్తవానికి, మారుతి సుజుకి తయారు చేసిన కార్లను టొయోటా వేరే పేరుతో రీబ్యాడ్జ్ చేసి, డిజైన్ మరియు ఫీచర్లలో స్వల్ప మార్పులు చేసి భారత మార్కెట్ తో పాటుగా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తోంది. ఇలా మనదేశంలో ఇప్పటికే మారుతి బాలెనో-టొయోటా గ్లాంజా, మారుతి బ్రెజ్జా-టొయోటా అర్బన్ క్రూయిజర్ అనే వాహనాలు విక్రయించబడుతున్నాయి.

ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా

టొయోటా ఇవే కాకుండా, మారుతి ఎర్టిగా యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ టొయోటా రూమియన్ పేరుతో మరియు మారుతి సియాజ్ యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ ను టొయోటా బెల్టా పేరుతో కొన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లలో విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు రీబ్యాడ్జ్ బిజినెస్‌కు కొనసాగింపుగా మారుతి-టొయోటా కంపెనీల నుండి మరో రెండు కార్లు (నిజాకి ఒక్క కారే, రెండు వేర్వేరు పేర్లతో) మార్కెట్లోకి రాబోతున్నాయి.

ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా

టొయోటా ఇటీవలే అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Urban Cruiser Hyryder) పేరుతో ఓ హైబ్రిడ్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, మారుతి సుజుకి కూడా ఇప్పుడు (Vitara) పేరుతో అదే ఎస్‌యూవీని రీబ్యాడ్జ్ చేసి విడుదల చేసేందుకు సిద్ధమైంది. మారుతి సుజుకి ఇటీవలే తమ కొత్త 2022 బ్రెజ్జా (2022 Brezza) ను మార్కెట్లో విడుదల చేసింది. అంతకు ముందు కంపెనీ ఇదే కారును విటారా బ్రెజ్జా (Vitara Brezza) పేరుతో విక్రయించేది. అయితే, కొత్త అప్‌డేట్‌లో భాగంగా కంపెనీ దీని పేరును కేవలం బ్రెజ్జా గా మాత్రమే పరిచయం చేసింది.

ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా

అలా ఆ పేరులో తొలగించిన విటారా ను ఈ కొత్త మిడ్-సైజ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ కోసం ఉపయోగించబోతోంది. సమాచారం ప్రకారం కొత్త మారుతి సుజుకి విటారా (Maruti Suzuki Vitara) జులై 20, 2022వ తేదీన మార్కెట్లో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మాదిరిగానే మారుతి సుజుకి విటారా కూడా అదే విధమైన హైబ్రిడ్ పవర్‌ట్రైన్ (మైల్డ్-హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్) యూనిట్లను కలిగి ఉండనుంది. ఇందులోని ఫీచర్లు, పరికరాలు మరియు అనేక ఇతర భాగాలు కూడా హైరైడర్ మాదిరిగానే ఉండనున్నాయి.

ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా

భారత ఎస్‌యూవీ మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్ చాలా పోటీతో కూడుకున్నది. ఈ విభాగంలో ఇప్పటికే హ్యుందాయ్ క్రెట్, కియా సెల్టోస్, ఎమ్‌జి ఆస్టర్ వంటి చాలా కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మరియు ఇవన్నీ కూడా సెగ్మెంట్ లీడర్స్ గా మార్కెట్లో బలమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. అయితే, ఈ విభాగంలో మారుతి సుజుకి మరియు టొయోటా కంపెనీలకు ఎలాంటి ఉత్పత్తి అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో, ఇరు కంపెనీలు కలిసి విటారా బ్రెజ్జా-అర్బన్ క్రూయిజర్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించి ఓ మిడ్-సైజ్ ఎస్‌యూవీ తయారు చేశాయి.

ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా

ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీనే టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మరియు మారుతి సుజుకి విటారా పేర్లతో ఇరు కంపెనీలు విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. అయితే, మార్కెట్లో ఇతర మిడ్-సైజ్ ఎస్‌యూవీలతో పోల్చితే వీటిని మరింత భిన్నంగా ఉంచేందుకు కంపెనీలు వీటిలో రెండు రకాల హైబ్రిడ్ వ్యవస్థలను అందిస్తున్నాయి. ఇందులో ఒకటి మైల్డ్-హైబ్రిడ్ (మారుతి ఇప్పటికే చాలా కార్లలో ఈ సెటప్ అందిస్తోంది) మరొకటి స్ట్రాంగ్ హైబ్రిడ్ (సెల్ఫ్ చార్జింగ్ కలిగిన కొత్త హైబ్రిడ్ యూనిట్).

ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా

ఈ రెండు హైబ్రిడ్ యూనిట్లు కూడా కొత్త 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో లింక్ చేయబడి ఉంటాయి. ఈ కొత్త ఇంజన్‌ను కంపెనీ ఇటీవలే విడుదల చేసిన కొత్త 2022 ఎర్టిగా ఫేస్‌లిఫ్ట్ మరియు 2022 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడళ్లలో ఉపయోగిస్తోంది. ఇప్పుడు ఇదే ఇంజన్ ను కొత్త టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ లో కూడా ఉపయోగించారు. కాగా, రాబోయే కొత్త మారుతి సుజుకి విటారాలో కూడా ఇదే ఇంజన్ సెటప్ కనిపిస్తుంది. కాబట్టి, దీని పవర్ మరియు టార్క్ గణాంకాలు హైరైడర్ మాదిరిగానే ఉంటాయి.

ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా

టొయోటా తమ హైరైడర్ హైబ్రిడ్ ఎస్‌యూవీ ఫ్రంట్-వీల్ డ్రైవ్ మరియు ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో అందిస్తోంది. కాబట్టి, మారుతి సుజుకి విటారా కూడా ఇదే రకమైన డ్రైవ్‌ట్రైన్ ఆప్షన్లతో అందుబాటులోకి వస్తుందని సమాచారం. విటారాలో ఉపయోగిస్తున్న ఈ హైబ్రిడ్ సెటప్ కారణంగా, ఇది సెగ్మెంట్లోని ఇతర మోడళ్ల కన్నా మెరుగైన మరియు అత్యుత్తమమైన మైలేజీని అందిస్తుందని భావిస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం, ఇది లీటరు 25 కిలోమీటర్లకు పైగా మైలేజీనిస్తుందని అంచనా వేయబడింది.

ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, హైరైడర్‌లో కనిపించిన వైర్‌లెస్ ఛార్జింగ్, పెద్ద 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కనెక్టింగ్ టెక్నాలజీ, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ డ్రైవర్ సీట్ మొదలైనవి ఉండనున్నాయి.

ఇప్పుడు మారుతి సుజుకి వంతు.. టొయోటా హైరైడర్ ఆధారంగా

అలాగే, సేఫ్టీ విషయానికి వస్తే, 360 డిగ్రీ సరౌండ్-వ్యూ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరింగ్ పాయింట్లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), హిల్ హోల్డ్ మరియు హిల్ డిసెండ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మొదలైన వాటిని మారుతి సుజుకి విటారా లో కూడా ఆశించవచ్చు. మరిన్ని వివరాలు తెలియాలంటే జులై 20 వరకూ వేచి ఉండక తప్పదు. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Now its maruti suzuki turn to reveal toyota hyryder based vitara hybrid suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X