హ్యుందాయ్ బాటలోనే కియా.. ఒక్క స్మార్ట్ కీతోనే కార్ల డెలివరీ..

ఆటోమొబైల్ పరిశ్రమను సెమీకండక్టర్ సంక్షోభం తీవ్రంగా వెంటాడుతోంది. ప్రస్తుతం, కార్ల యొక్క తాళం చెవి మొదలుకొని మొత్తం కారు తయారీలో కూడా ఈ సెమీకండక్టర్ చిప్స్ చాలా అధిక సంఖ్యలో ఉపయోగించబడుతున్నాయి. అయితే, వీటి లభ్యత విషయంలో మాత్రం సప్లయ్ కి మించిన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో, కార్ కంపెనీలు తమ కార్లలో కొన్ని ఫీచర్లను బలవంతంగా తగ్గించాల్సి వస్తోంది.

హ్యుందాయ్ బాటలోనే కియా.. ఒక్క స్మార్ట్ కీతోనే కార్ల డెలివరీ..

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ ఇటీవల తమ కార్లలో అందిస్తున్న స్మార్ట్ కీ ఫీచర్ విషయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. కంపెనీ ఇప్పుడు తమ కస్టమర్లకు కేవలం ఒకే ఒక స్మార్ట్ కీతో వాహనాలను డెలివరీ చేస్తోంది. మిగిలిన రెండవ స్మార్ట్ కీని ఆరు నెలల తర్వాత కస్టమర్ ఇంటికి డెలివరీ చేస్తామని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్ కూడా ఇప్పుడు ఇలాంటి మార్గాన్నే అనుసరిస్తోంది. కియా తమ పాపుల కార్లను ఇప్పుడు కేవలం ఒక్క స్మార్ట్ కీతోనే కస్టమర్లకు డెలివరీ చేస్తోంది.

హ్యుందాయ్ బాటలోనే కియా.. ఒక్క స్మార్ట్ కీతోనే కార్ల డెలివరీ..

సెమీకండక్టర్ చిప్ కొరత ప్రస్తుతం కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉంది. సెమీకండక్టర్ ఉత్పత్తి ప్రస్తుతం పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పటికీ, దీని లభ్యత మాత్రం డిమాండ్, సప్లయ్ స్థాయిలకు సరిపోవడం లేదు. ఈ సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కోవడానికి అనేక ఆటోమోటివ్ కంపెనీలు తమ కార్ల లోని ఫీచర్లు మరియు సౌకర్యాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల భారతదేశంలో చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా కూడా తమ కార్లలో ఇన్ఫోటైన్‌మెంట్ సైజును తగ్గించింది.

హ్యుందాయ్ బాటలోనే కియా.. ఒక్క స్మార్ట్ కీతోనే కార్ల డెలివరీ..

కియా ఇండియా విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ బ్రాండ్ భారత మార్కెట్లో సోనెట్, సెల్టోస్, కారెన్స్ మరియు కార్నివాల్ అనే నాలుగు ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తోంది. కంపెనీ ఇటీవలే తమ ప్రోడక్ట్ లైనప్ లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కియా ఈవీ6 ను కూడా జోడించింది. కియా అందిస్తున్న ఈ కార్లన్నీ కూడా రెండు స్మార్ట్ కీ లతో వస్తాయి, ఇవి వినియోగదారులకు కీలెస్ ఎంట్రీ, టెలిమాటిక్స్ మరియు నిర్దిష్ట ఫీచర్లకు యాక్సెస్‌ను అందిస్తాయి.

హ్యుందాయ్ బాటలోనే కియా.. ఒక్క స్మార్ట్ కీతోనే కార్ల డెలివరీ..

వాటన్నింటికీ పని చేయడానికి ప్రాసెసింగ్ శక్తి అవసరం మరియు ఈ కీలు ఈ సంకేతాలను ప్రాసెస్ చేసే అధునాతన సెమీకండక్టర్ చిప్‌లను కలిగి ఉంటాయి. ఈ చిప్ సంక్షోభం కారణంగా కియా ఇండియా తమ వాహనాల స్మార్ట్ కీలను రెండు నుండి ఒకటికి తగ్గించినట్లు సమాచారం. అయితే, కంపెనీ తమ రెండవ స్మార్ట్ కీ స్థానంలో ఓ మెకానికల్ కీని కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది స్మార్ట్ ఫీచర్లు లేకుండా లభించే మెకానికల్ కీగా ఉంటుంది. అయితే, రెండవ స్మార్ట్ కీని పొందాలంటే కస్టమర్లు కొంత కాలం ఆగాల్సి ఉంటుంది.

హ్యుందాయ్ బాటలోనే కియా.. ఒక్క స్మార్ట్ కీతోనే కార్ల డెలివరీ..

సమాచారం ప్రకారం, భారతదేశంలో కియా ఈవీ6 మినహా ఇతర కియా బ్రాండ్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లంతా ముందుగా ఒక స్మార్ట్-కీని మాత్రమే పొందుతారు. కాగా, రెండవ స్మార్ట్ కీ ని వచ్చే అక్టోబర్ నెల తర్వాత సంబంధిత డీలర్‌లకు పంపబడుతుంది. రెండవ కీని డీలర్లు వినియోగదారులకు అందజేస్తారు. ఈ ప్రక్రియ యజమాని ఇంటి వద్ద లేదా డీలర్ సర్వీస్ స్టేషన్‌లో నిర్వహించబడుతుంది.

హ్యుందాయ్ బాటలోనే కియా.. ఒక్క స్మార్ట్ కీతోనే కార్ల డెలివరీ..

ఈ సింగిల్-కీ స్ట్రాటజీ పరిధిలోకి రాని ఏకైక కియా కారు ఇటీవలే విడుదల చేయబడిన కియా ఈవీ6. ఇది పూర్తిగా విదేశాలలో తయారై, ఇంపోర్టెడ్ మోడల్ గా భారతదేశంలోకి దిగుమతి చేసుకోబడుతుంది. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 60 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది.

హ్యుందాయ్ బాటలోనే కియా.. ఒక్క స్మార్ట్ కీతోనే కార్ల డెలివరీ..

కంపెనీ ఈ కారును CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గం ద్వారా భారతదేశంలోకి దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడ స్థానికంగా విక్రయించే ఇతర కియా కార్ల వలె కాకుండా, ఇది భారతదేశంలో తయారు చేయబడినది కాదు. కాబట్టి, కియా ఈ ఇంపోర్టెడ్ కారు విషయంలో మాత్రం డ్యూయెల్ స్మార్ట్ కీ స్ట్రాటజీని ఫాలో అవుతుంది.

హ్యుందాయ్ బాటలోనే కియా.. ఒక్క స్మార్ట్ కీతోనే కార్ల డెలివరీ..

కియా ఈవీ6 (Kia EV6) గురించి క్లుప్తంగా..

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఇది కియా బ్రాండ్ నుండి భారత మార్కెట్లో ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు. ఇది రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇందులో మొదటిది జిటి-లైన్ (GT-Line), ఇది రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్ తో లభిస్తుంది. ఇకపోతే, రెండవది జిటి-లైన్ ఏడబ్ల్యూడి (GT-Line AWD), ఇది ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో లభిస్తుంది. మొదటి బ్యాచ్ లో భాగంగా కంపెనీ 100 యూనిట్ల కోసం ప్రీ-బుకింగ్ లను ఓపెన్ చేయగా, లాంచ్ సమయం నాటికి ఈ కారు కోసం 350 యూనిట్లకు పైగా బుకింగ్ లు వచ్చి పడ్డాయి.

హ్యుందాయ్ బాటలోనే కియా.. ఒక్క స్మార్ట్ కీతోనే కార్ల డెలివరీ..

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు 77.4 కిలోవాట్అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీ ప్యాక్ కారుకు దిగువ భాగంలో ప్లాట్‌ఫామ్‌లోనే అమర్చబడి ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 528 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే, రియల్ వరల్డ్ డ్రైవింగ్ కండిషన్స్ ప్రకారం దీని రేంజ్ మారే అవకాశం ఉంది. ఈ కారు స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ లను సపోర్ట్ చేస్తుంది. ఈ కారును 350 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 18 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అదే 50 కిలోవాట్ డిసి ఫాస్ట్ చార్జర్ సాయంతో అయితే కేవలం 73 నిమిషాల్లో 0-80 శాతం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. - పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Now kia india customers will get only one smart key with carens seltos sonet carnival details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X